రివ్యూ – ‘ఊపిరి’ ఓ ఎమోషనల్ జర్నీ

న్యూ జనరేషన్ తో పాటు ప్రయాణిస్తూ, కథ బాగుంటే మల్టీ స్టారర్ కైనా సరే అని, ప్రయోగాత్మక సినిమాలను చేసుకుంటూ, అటు యూత్ ఇటు మాస్ ప్రేక్షకుల్లోనూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నాగార్జున, తమిళ్ యంగ్ స్టార్ హీరో కార్తిల కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘ఉపిరి’. ఫీల్ గుడ్ మూవీస్ హృదయాన్ని హత్తుకునే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అందుకే ఆ తరహా చిత్రాలు ఎప్పటికీ ప్రజల మనసులో నిలిచిపోతాయ్. ఇలాంటి చిత్రాలకు భాష బేదం వుండదు. హాలీవుడ్ చిత్రం ‘ఇన్ టచ్ బుల్స్’ అలాంటి చిత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకున్న టాప్ 25 హాలీవుడ్ చిత్రాల్లో ఇదొకటి. ఈ చిత్రానికి రీమేక్ గా వచ్చిన చిత్రమే ‘ఊపిరి’. ఎంతో ప్యాషన్ ఉంటేనే గాని ఇలాంటి చిత్రాలు నిర్మించడానికి ముందుకు రారు. అలాంటిది పి వి పి బ్యానర్ లో పరమ్‌ వి. పొట్లూరి, కవిన్‌ అన్నే కన్ఫిడెంట్ గా నిర్మించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయ్యింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ చూసినప్పుడు ఖచ్చితంగా ఓ ఎమోషనల్ జర్నీ చేయబోతున్నామనే ఫీల్ చూసేవాళ్లకి కలిగింది… మరి.. ఈ జర్నీ ఎలా ఉందో తెలుసుకుందాం…మరి విడుదలకు ముందు ఈ సినిమాకు అంతటా కనిపించిన పాజిటివ్ నెస్ సినిమా లో నిజంగానే కొనసాగించిందా? లేదా… సమీక్షలో చూద్దాం.

కథ:

విక్రమాదిత్య (నాగార్జున) కోటీశ్వరుడైన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి చైర్ పర్సన్. ఓ యాక్సిడెంట్ లో స్పైనల్ కార్డ్ దెబ్బ తినడంతో పూర్తిగా కాళ్ళు, చేతులు పనిచేయకుండా వీల్ ఛైర్ కే పరిమితమవ్వాల్సి వస్తుంది. విక్రమాదిత్య కి సెకట్రరీ గా వర్క్ చేస్తుంటుంది కీర్తి (తమన్నా). ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన శీను(కార్తీ), జైలు కెళ్లి, అమ్మ ఇంట్లోంచి గెంటేయడంతో ఆవారాగా తిరుగుతున్న శ్రీను, విక్రమాదిత్య సెక్రటరీ కీర్తి మంచి ఫిగర్ కాబట్టి, విక్రమాదిత్యకు కేర్ టేకర్ గా జాయిన్ అవుతాడు. అసలు విషయం ఆమెను పడగొట్టాలనే టార్గెట్ తో కేర్ టేకర్ గా జాయిన్ అవుతాడు శ్రీను. అతన్ని ఇంటర్య్వూ చేసినప్పుడే ఇలాంటి కుర్రాడే ఇప్పుడు తనకు అవసరమని ఫిక్స్ అయ్యి శ్రీనుని జాయిన్ చేసుకుంటాడు విక్రమాదిత్య, అయితే విక్రమాదిత్య లీగల్ అడ్విసర్ ప్రసాద్ (ప్రకాష్ రాజ్) మాత్రం శ్రీను ఏ మాత్రం కేర్ టేకర్ గా కరెక్ట్ కాదనే భావనతో ఉంటాడు. డబ్బుంటేనే సంతోషం ఉంటుందనుకునే శీను, విక్రమాదిత్యకు కేర్ టేకర్ గా జాయిన్ అయ్యి విక్రమాదిత్య లైఫ్ లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు… ఆవారాగా తిరుగుతున్న అతను బాధ్యత కల కేర్ టేకర్ గా జాబ్ ని డీల్ చేసాడా..? తన అమ్మకు చేరువ అవ్వాలన్న శ్రీను కోరిక తీరుతుందా.. కీర్తితో శ్రీను ప్రేమ ఫలిస్తుందా..లాంటి ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ…

నటీనటుల పర్ఫార్మెన్స్:

తొలుత ఇలాంటి ఒక అంగ వైకల్య పాత్రను ఒప్పుకొని, దాన్ని పూర్తిస్థాయిలో సొంతం చేసుకొని చేసిన నాగార్జున గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! మాస్ పాత్ర, క్లాస్ పాత్ర, భక్తుని పాత్ర, భగవంతుని పాత్ర… ఏ పాత్రని అయినా సునాయాసంగా చేయగల మంచి నటుడు నాగార్జున. ఈ చిత్రంలో వీల్ ఛైర్ కే పరిమితమయ్యే వ్యక్తి పాత్రను గొప్పగా చేసాడు. అక్కడక్కడ మనసులను తాకే ఎక్స్ ప్రెషన్స్, బ్యాలెన్స్ యాక్టింగ్ తో నాగార్జున మాత్రమే ఈ పాత్రకు వంద శాతం న్యాయం చేయగలరు అని ప్రేకకులకు అనిపించడం ఖాయం. ఇక.. కార్తీ గురించి చెప్పక్కర్లేదు. మంచి నటుడు. స్లమ్ ఏరియాకి చెందిన మాస్ యువకుడిగా పాత్రలో ఒదిగిపోయాడు. నవ్వించడంతో పాటు హార్ట్ టచ్ సీన్స్ లో కార్తీ నటన సూపర్బ్. ఓవరాల్ గా కార్తీ నటన ప్రేకకుల మనసుల్లో నిలిచిపోతుంది. ఓ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ సెక్రటరీగా,లుక్ తో హుందాగా, ఓ పక్క గ్లామర్ గా, తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం తమన్నా ఆ పాత్రకు సరిపోయింది. ప్రకాష్ రాజ్ చేసిన స్నేహితుడు పాత్ర ఈ మధ్య కాలంలో ఆయన చేసిన అన్ని పాత్రలకన్నా గుర్తుండి పోయే విధంగా ఉంది. జయసుధ, కల్పన, తనికెళ్ల భరణి, అలీ ఎవరి పాత్రల పరిధి మేరకు వారు నటించారు. స్పెషల్ అప్పియరన్స్ ఇచ్చిన అనుష్క, శ్రియ, ఫ్లాష్ లైట్స్ అయ్యారు. అడవి శేష్ ఓ కె అనిపించుకున్నాడు.

సాంకేతిక వర్గం:

సినిమా మొత్తం ఓ ఫీల్ ని క్యారీ చేయాలి. అలా చేయాలంటే సీన్స్ హార్ట్ టచబుల్ గా ఉండాలి. ఇలాంటి ఒక సినిమాను తెరకెక్కించాలన్న ఆలోచనకు, దాన్ని సినిమాగా తీర్చిదిద్దడంలో చూపిన ప్రతిభను చూశాక డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేసారనిపించింది . పారిన్ లొకేషన్స్ ని తన కెమెరా లో అద్భుతంగా బంధించారు సినిమాటోగ్రాఫర్ పి.ఎస్.వినోద్. సీన్ డెప్త్ ని బట్టి సీన్ ని ఎడిట్ చేయడం ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ప్రతిభను మరోసారి రుజువు చేసుకున్నారు.మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ సమకూర్చిన పాటలు అన్నీ బాగున్నాయి. సీన్స్ ని ఎలివేట్ చేసే విధంగా రీ-రికార్డింగ్ గ్రాఫ్ ఉండటం ఈ సినిమాకి ఓ హైలైట్. నిర్మాణ విలువలు సూపర్బ్. నిజం చెప్పాలంటే ఇలాంటి కథలను తీసుకుని, డబ్బు పెట్టి సినిమా చేయాలంటే ఏ నిర్మాతకైనా గట్స్ ఉండాలి. దాంతో పాటు సినిమా మీద ఇష్టం ఉండాలి. ఈ రెండు ఉన్న నిర్మాత పివిపి అధినేత పొట్లూరి వరప్రసాద్. అందుకే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సినిమా చాలా రిచ్ వుంటుంది.

విశ్లేషణ:

ఓ పెద్ద స్టార్ కాస్టింగ్ తో రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా చేయాలనుకోవడం సాహసమే. ఒక వేళా చేసినా అందర్నీ మెప్పించడం అంత సులువు కాదు .హాలీవుడ్ మూవీ ‘ఇన్ టచబుల్స్’ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకుని చేసిన చిత్రం ఇది. ఓ ఇంగ్లీష్ చిత్రాన్ని రీమేక్ చేసి ఆడియన్స్ ని మెప్పించాలంటే కొంచెం గట్స్ ఉండాలి. హాలీవుడ్ మూవీ లుక్ లో కనిపించే ఈ చిత్రం ఇండియన్ ఆడియన్స్ ఎమోషన్స్ కి తగ్గట్టుగా ఉండటం ఓ ప్లస్ పాయింట్. ఒక మంచి సినిమా చూసాం అని చెప్పడంకన్నా, ఒక ఎమోషనల్ జర్నీ చేసిన ఫీల్ ఈ సినిమా చూసిన తర్వాత కలుగుతుంది. నాగార్జున లాంటి రొమాంటిక్ హీరోని ఫుల్ లెంత్ వీల్ ఛైర్ లో కూర్చోబెడితే అభిమానులు హర్ట్ అవుతారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత జీవితాంతం గుర్తుండిపోయే పాత్ర చేసాడని అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు. కార్తీ క్యారెక్టరైజేషన్ ని మలిచిన విధానం బాగుంది. తన స్టార్ ఇమేజ్ ని పక్కన పెట్టి మరీ ఈ పాత్రను చేసాడు. నవ్వించినప్పుడు నవ్వించి, ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టించేలా చేసాడు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఎన్ని సినిమాలు చేసినా ఓ ఇంటర్వ్యూ లో చెప్పినట్టే అయన జీవితం లో ‘ఊపిరి’ మాత్రం అతని కెరియర్ లో ఎప్పటికీ చెప్పుకునే చిత్రంగా నిలిచిపోతుంది. పారిస్ నేపథ్యంలో ఈ సమయంలో వచ్చే కొన్ని సన్నివేశాలు కాస్త డల్ అనిపిస్తాయి. అదేవిధంగా కార్తీ-తమన్నాల మధ్యన వచ్చే ఓ పాట నిజంగా అవసరం లేనిదనిపించింది. ఈ సినిమాలో రెండో భాగంలో మొదటి ఇరవై నిమిషాలు కాస్త నెమ్మదించడం అన్నది. ఫీల్ గుడ్ చిత్రాలను అందించాలనే తాపత్రయంతో నిర్మాత పివిపి ఈ సినిమా తీసారు. ప్రేకకులు కూడా ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ ని ఆదిరిస్తే ముందు ముందు ఇలాంటి మంచి చిత్రాలు తీయడానికి ఇంకొంతమంది నిర్మాతలు ముందుకొస్తారు. ఎందుకంటే ‘ఊపిరి’ క్లాస్ మాస్ తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటుంది. ఫస్టాప్ చాలా బాగుంది. సెకండాఫ్ ఆరంభమైన కాసేపటికి కొంచెం ల్యాగ్ అనిపించినప్పటికీ, తర్వాత వచ్చే సీన్స్ ఆ ఫీల్ ని పోగొట్టాయి. అప్పుడప్పుడూ వచ్చే ఇలాంటి సినిమాలు హార్ట్ టచ్ గా వున్నా బాక్స్ ఆఫీసు వద్ద ఎంత వరకు నిలబడుతుందో వేచి చూడాల్సిందే…

తెలుగు360.కామ్ రేటింగ్ 3.5/5

బ్యానర్ : పివిపి
నటీనటులు : నాగార్జున, కార్తీ, తమన్నా, జయసుధ, ప్రకాష్ రాజ్, భరత్, కల్పన, అనుష్క, శ్రీయ, (గెస్ట్ అఫియరెన్స్), అడవి శేష్ (గెస్ట్ అఫియరెన్స్) తదితరులు…
సంగీతం : గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ : పి.ఎస్.వినోద్
మాటలు : అబ్బూరి రవి
ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
నిర్మాత : పరమ్. వి. పొట్లూరి, కవిన్‌ అన్నే
స్ర్కీన్ ప్లే, దర్శకత్వం : వంశీ పైడిపల్లి
విడుదల తేది : 25.03.2016

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలుగు రాష్ట్రాల సీఎంలకు షెకావత్ మళ్లీ మళ్లీ చెబుతున్నారు..!

తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త ప్రాజెక్టుల అంశం కేంద్రానికి చిరాకు తెప్పిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అపెక్స్ కౌన్సిల్ భేటీ జరిగే వరకూ..కొత్త ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని జలశక్తి మంత్రి...

‘ఈగ’ కాన్సెప్టులో ‘ఆకాశవాణి’?

రాజ‌మౌళి ద‌గ్గ‌ర శిష్యుడిగా ప‌నిచేసిన అశ్విన్ గంగ‌రాజు ఇప్పుడు మెగా ఫోన్ ప‌ట్టాడు. 'ఆకాశ‌వాణి' సినిమాతో. స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర పోషించిన ఈ చిత్రానికి కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ సంగీతం అందిస్తున్నారు. ఇటీవ‌లే...

పుస్త‌క రూపంలో ‘పూరీఇజం’

పూరి సినిమాల్లో డైలాగులు ఎంత ప‌వ‌ర్‌ఫుల్ గా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. సూటిగా, గుండెని తాకేలా రాయ‌గ‌ల‌డు. అవ‌న్నీ సినిమాల‌కే ప‌రిమితం కాదు. త‌న జీవ‌న శైలే అలా ఉంటుంది....

పోలీస్ స్టేష‌న్‌లో న‌గ్నంగా `రాడ్‌ గోపాల్ వ‌ర్మ‌`

టాలీవుడ్ లో ఇప్పుడు రెండు ర‌కాల సినిమాలే త‌యార‌వుతున్నాయి. ఓటీటీలో అవే విడుద‌ల అవుతున్నాయి. ఒక‌టి రాంగోపాల్ వ‌ర్మ తీస్తున్న సినిమాలు, రెండోది రాంగోపాల్ వ‌ర్మ‌పై తీస్తున్న సినిమాలు. బ‌యోపిక్‌ల పేరుతో.. వాస్త‌వ...

HOT NEWS

[X] Close
[X] Close