13.99 శాతం వడ్డీకి అప్పులు – ఏపీ కాగ్ రిపోర్టు

సాధారణంగా 12 శాతం వడ్డీ రేటుతో రూ. లక్ష పర్సనల్ లోన్లే తీసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. భారీ మొత్తం లోన్లు అయితే 9 శాతం చాలా ఎక్కువ అని ఆర్థిక నిపుణులు చెబుతూంటారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఏకంగా 13.99 శాతం వడ్డీ తో వేల కోట్లు అప్పులు తెస్తోంది. తెచ్చిన సొమ్మును అప్పటి వరకూ తెచ్చిన అప్పులకు వడ్డీలు, అసలు కట్టగా పోను మిగతా మొత్తాన్ని నగదు బదిలీ పథకాలకు వాడుతోంది. ఈ కారణంగా ఒక్క ఏడాదిలో వడ్డీ చెల్లింపుల భారం అంతకు ముందు ఏడాది కంటే రూ. 24వేల కోట్లకుపైగా పెరిగాయి. ఈ విషయాలను కాగ్ వెల్లడించింది.

2021-22 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రూ.3,72,503 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. ఇందులో 90 శాతం మేర రుణాలు.. 13.99 శాతం వడ్డీ తో తీసుకున్నారని తెలిపింది. 2018 నుంచి 2022 వరకూ అంతర్గత రుణాలు 77.54 శాతం మేర పెరిగాయి. గడిచిన 5 ఏళ్లలో తలసరి రుణం 61 శాతం మేర పెరిగింది, బడ్జేటేతర రుణాలు కూడా కలిపితే తలసరి రుణ భారం- రూ. 92,797గా నమోదైంది. వచ్చే ఏడేళ్లలోగా రాష్ట్ర ప్రభుత్వం 1,29,817 కోట్ల రుణాల్ని తీర్చాలని కాగ్ తన నివేదికలో వెల్లడించింది.

డిస్కమ్‌లు, నీటిపారుదల ప్రాజెక్టులకు చెల్లించాల్సిన బకాయిలు మరో రూ.17,804 కోట్లు ఉన్నాయి. రూ.688 కోట్ల రెవెన్యూ వ్యయాన్ని మూలధన వ్యయమని తప్పుగా వర్గీకరించారు. నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ గృహవసతి పథకాన్ని మూలధన వ్యయంగా ప్రభుత్వం చూపింది. ల బడ్జెట్‌లో చూపని అదనపు రుణాలు పరిమితి కంటే అధికంగా ఉన్నాయి. స్మార్ట్ పట్టణాలు, కృషి వికాస్ యోజన, జాతీయ ఆరోగ్య మిషన్ లాంటి పథకాలకు రాష్ట్ర వాటా విడుదల కాకపోవటం వల్ల అవి సరిగా అమలు కాలేదు. దీని వల్ల ఆరువేల కోట్లు మురిగిపోయాయి.

ఏపీలో ఆర్థిక విస్పోటం.. ఇదే విషయం కాగ్ చెప్పిందని పయ్యావుల విమర్శించారు. ఎఫ్ఆర్బీఎంను ఉల్లంఘించిందని, ప్రభుత్వ సంస్థల రుణాలను కూడా చెల్లించాల్సి ఉంటే ప్రభుత్వ ఖాతాల్లో చూపాల్సిందేనని, ప్రభుత్వ గ్యారంటీలను.. అప్పులను దాచారని కాగ్ తన నివేదికలో పేర్కొందని .. ఏపీ దివాలా అంచున ఉందని పయ్యావుల స్పష్టం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మహానాడు : టీడీపీ 6 హామీలతో భవిష్యత్‌కు గ్యారంటీ !

మహానాడులో తెలుగుదేశం పార్టీ ప్రజలకు సంక్షే్మ రంగంలో ఆరు హామీలు ప్రకటించింది. భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో మినీ మేనిఫెస్టోని చంద్రబాబు ప్రకటించారు. నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు టీడీపీ...

ఎన్టీఆర్‌ను వైసీపీ స్మరించుకుంది.. చంద్రబాబును తిట్టడానికైనా సరే!

ఎన్టీఆర్ అందరి మనిషి. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సహజంగానేకొంత మందికి దూరంఅవుతారు. అలా దూరమైన వారు కూడా ప్రత్యేక సందర్భాల్లో దగ్గర చేసుకోక తప్పదు. ఎన్టీఆర్‌ను అలా దగ్గర చేసుకోవాల్సిన ప...

బాలయ్య కోసం కొత్త ప్ర‌పంచం సృష్టిస్తాడ‌ట‌

అ, క‌ల్కి, జాంబిరెడ్డి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఇప్పుడు హను-మాన్ రూపొందిస్తున్నాడు. తేజా స‌జ్జా క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది. ఈలోగా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేసే...

అందరికీ బెంచ్ మార్క్ బిల్డింగ్‌లు – ఏపీ జనానికి మాత్రం బటన్లు !

తెలంగాణ ప్రభుత్వం ఓ పెద్ద సెక్రటేరియట్ కట్టుకుంది. కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇప్పుడు కేంద్రం పార్లమెంట్ నిర్మించింది.. అంత కంటే ఎక్కువ కథలు చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ రెండు నిర్మాణాలూ అవసరం లేదని..దుబారా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close