రాహుల్ గాంధీపై అనర్హతా వేటు !

ప్రభుత్వ వ్యతిరేకులు ముఖ్యంగా పోటీ దారులపై వ్యవస్థలు ఎంత వేగంగా స్పందిస్తాయో మరోసారి నిరూపణ అయింది. గురువారమే ఓ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీపై రెండేళ్ల జైలుశిక్షను గుజరాత్‌లోని సూరత్ కోర్టు వేసింది. శుక్రవారమే ఆయనపై లోక్ సభ సెక్రటేరియట్ అనర్హతా వేటు వేసింది. ఆ కోర్టు తీర్పు కాపీ అందిందో మీడియా రిపోర్టులు చూసి వేటు వేశారో తెలియదు కానీ.. ఆ కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లడానికి కోర్టే నెల రోజుల సమయం ఇచ్చింది. కానీ లోక్ సభ సెక్రటేరియట్ మాత్రం ఒక్క రోజు కూడా గడువు ఇవ్వకుండా అనర్హతా వేటు వేసేశారు.

రాహుల్ గాంధీ అప్పీల్ కు వెళ్లి ఆ కోర్టు తీర్పుపై స్టే తెచ్చుకుంటారేమోనన్న కంగారులో ఇలా చేసేశారని సహజంగానే విమర్శలు వస్తున్నాయి. రాజకీయ విమర్శల కేసుల్లో రెండేళ్ల జైలు శిక్ష విధించడమే అనూహ్యం అంటే అంతకు మించి వేగంగా రాహుల్ గాంధీని సభ నుంచి గెంటేశారు. నిజానికి రాజకీయాల్లో అత్యంత అవినీతి పరులు, దారుణమైన హత్యలు చేసిన వారు … అంతకు మించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు ఉన్నారు. వారంతా యథేచ్చగా రాజకీయాలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి విచారణ జరుగుతోంది. ఎవరూ అనర్హతా వేటుకు గురికాలేదు.

వారంతా అధికార పార్టీలోనో.. అధికార పార్టీ అండతోనే వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ రాజకీయాలు చేసేస్తున్నారు. కానీ తాను చేసిన కామెంట్లకు జైలు శిక్ష వేస్తారని రాహుల్ గాంధీ కూడా ఊహించి ఉండరు. ప్రజలు ఈ విషయంలో తిరుగుబాటు చేస్తే.. బీజేపీకి అతి పెద్ద ప్రమాదం ముంచుకొస్తోంది. రాహుల్ కు వేసిన శిక్షపై ప్రజలు ఎలా స్పందిస్తారన్నదానిపై రాజకీయాలు ఆధారపడి ఉంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2024 బాక్సాఫీస్ : సెకండాఫ్ పైనే ఆశ‌లు

ఈ యేడాది అప్పుడే నాలుగు నెల‌లు గ‌డిచిపోయాయి. కీల‌క‌మైన వేస‌వి సీజ‌న్ స‌గానికి వ‌చ్చేశాం. సంక్రాంతిలో మిన‌హాయిస్తే స్టార్ హీరోల సినిమాలేం బాక్సాఫీసు ముందుకు రాలేదు. ఈ వేస‌వి చాలా చ‌ప్ప‌గా, నీర‌సంగా,...

అనకాపల్లి లోక్‌సభ రివ్యూ : సీఎం రమేష్‌కు వైసీపీ పరోక్ష సాయం !

అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకం. ఆ స్థానం నుంచి పోటీ చేయాలని టీడీపీ నుంచి కనీసం ముగ్గురు కీలక నేతలు అనుకున్నారు. జనసేన నుంచి నాగబాబు...

క‌న్న‌ప్ప సెట్లో అక్ష‌య్ కుమార్‌

`క‌న్న‌ప్ప‌` కు స్టార్ బ‌లం పెరుగుతూ పోతోంది. ఇప్ప‌టికే ప్ర‌భాస్, మోహ‌న్ లాల్‌, శివ‌రాజ్ కుమార్‌, న‌య‌న‌తార‌.. వీళ్లంతా ఈ ప్రాజెక్ట్ లో భాగం పంచుకొన్నారు. అక్ష‌య్ కుమార్ శివుడిగా న‌టించ‌బోతున్నాడంటూ ప్ర‌చారం...

రేవంత్ సర్కార్ చేస్తున్న అప్పుల కన్నా “రీ పే” ఎక్కువ !

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అప్పులు భారీగా చేస్తోందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. తాము తెచ్చిన అప్పుల కన్నా చెల్లించేది ఎక్కువని లెక్కలు విడుదల చేసింది. కేసీఆర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close