నరేశ్.. పవిత్రా లోకేశ్ ను వివాహం చేసుకున్న వీడియో సొషల్మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. ‘ఒక పవిత్రబంధం.. రెండు మనసులు.. మూడు ముళ్ళు.. ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు మీ పవిత్రానరేశ్’’ అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు నరేష్. నిజంగా ఇది పెళ్ళా లేదా సినిమా పెళ్ళా అనే అనుమానం కలిగింది. దీనిపై నరేష్ కూడా వివరణ ఇవలేదు. సమయం వచ్చినపుడు చెబుతా అనేశారు.
అయితే ఇది సినిమా పెళ్లి అనే సంగతి ఇప్పుడు తేలిపోయింది. నరేష్ ప్రవిత్ర కలసి మళ్ళీ పెళ్లి అనే సినిమాలో నటిస్తున్నారు. ఎంఎస్ రాజు దీనికి దర్శకుడు. నరేష్ నిర్మాత కూడా. ఈ రోజు ఫస్ట్ లుక్ వదిలారు. పెళ్లి చుట్టూ నడిచే కథ ఇది. నరేష్ నిర్మాత కావడం వలన సినిమాలో పుటేజ్ ని తనకు కావలసినప్పుడు రిలీజ్ చేసుకున్నారు తప్పితే ఇది నిజం పెళ్లి కాదని ఈ సినిమా ప్రకటనతో తేలిపోయింది.