భూముల అమ్మకాల్ని విపక్షాలు అడ్డుకోగలవా..!?

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వ భూముల్ని పెద్ద ఎత్తున అమ్మడం ద్వారా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కాలని నిర్ణయించుకున్నారు. అమ్మాల్సిన భూముల లెక్క తీశారు. ఇప్పటికే మొదటి విడత అమ్మకానికి ముహుర్తం కూడా ఖరారైంది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణలో ఒక్క సారిగా గగ్గోలు రేగింది. విపక్ష పార్టీలన్నీ భూముల అమ్మకాలను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. అసలు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే ఆస్తుల పరిరక్షణ కోసం అని .. ఇప్పుడు అవే ఆస్తుల్ని తెగ నమ్ముతామంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటామని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి విధానాన్నే ప్రతిపక్ష పార్టీలు గుర్తు చేస్తున్నాయి.

తెలంగాణ ఉద్యమ సమయంలో .. టీఆర్ఎస్‌ ఉద్యమానికి ఇంజిన్ ఆయిల్‌లా పని చేసిన అంశం భూముల అమ్మకం. హైదరాబాద్ చుట్టుపక్కల జరిగిన అభివృద్ధితో విపరీతంగా పెరిగిన భూముల ధరల నేపధ్యంలో… ప్రభుత్వ భూముల్ని అమ్మి అప్పటి ప్రభుత్వాలు సొమ్ము చేసుకున్నాయి. నిజానికి ప్రభుత్వాలు సొమ్ము చేసుకోవడం అక్కడ మ్యాటర్ కాదు.. అమ్మకాల పేరుతో కొంతమంది అస్మదీయులైన వారికి ఆ భూములు కట్టబెట్టారన్న ప్రచారం జరిగింది. ఇది తెలంగాణ ఉద్యమకారులకు మరింత ఆవేశం తెప్పించింది. ఓ సందర్భంలో టీఆర్ఎస్ నేతలు.. భూముల వేలం పాటలను అడ్డుకున్నారు. ఆ స్థాయి నుంచి ఇప్పుడు..కొత్తగా టీఆర్ఎస్సే భూముల్ని టోకుగా అమ్మే పరిస్థితి వచ్చింది.

ఏం చేసైనా తెలంగాణ భూముల్ని అమ్మకుండా అడ్డుకుంటామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ నేతలుకూడా అదే ప్రకటనలు చేస్తున్నారు. అయితే.. వీరిద్దరికీ టీఆర్ఎస్ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. కాంగ్రెస్ పాలనలో అమ్ముకున్న భూములవివరాలు బయట పెడుతోంది. అదే సమయంలో బీజేపీ తెగనమ్ముతున్న ప్రైవేటు సంస్థల వివరాలను బయట పెట్టి టీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. భూములు అమ్మకుండా హైకోర్టులో పిటిషన్లు వేయడానికి కూడా పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో భూముల అమ్మకమే పెద్ద రాజకీయ అంశంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెట్రో కంపెనీల్నీ అమ్మేస్తున్న కేంద్రం..!

పెట్రో పన్నులు పెంచుతూ ప్రజల వద్ద నుంచి లక్షల కోట్ల ఆదాయం కళ్ల జూస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఆ కంపెనీలను కూడా అమ్మకానికి పెట్టేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా వంద...

హుజూరాబాద్‌లో అసలు కన్నా ఫేక్ ప్రచారాలే ఎక్కువ..!

హుజూరాబాద్ ఉపఎన్నిక రాజకీయాల్లో పెరిగిపోతున్న మకిలీ మొత్తాన్ని బయట పెడుతూనే ఉంది. అసలు షెడ్యూలే రాలేదు.. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ.. రాజకీయ పార్టీలు.. అన్ని రకాల తెలివి తేటల్నీ ప్రదర్శిస్తున్నాయి....

ఎడిటర్స్ కామెంట్ : “ది ప్రాబ్లమ్ విత్ పొలిటికల్ జోక్స్ ఈజ్ దట్ దే గెట్ ఎలక్టెడ్” ..

"ది ప్రాబ్లమ్ విత్ పొలిటికల్ జోక్స్ ఈజ్ దట్ దే గెట్ ఎలక్టెడ్" .. హెన్సీ కేట్ అనే పద్దెనిమిదో శతాబ్దానికి చెందిన రాజకీయ పండితులు చేసిన వ్యాఖ్య ఇంది. దశాబ్దాలు...

మీడియా వాచ్ : ఓనర్లు కాదు.. వాళ్లే టీవీ5ని అమ్మేశారు..!

ప్రముఖ మీడియా సంస్థ టీవీ5 అమ్మేశారని కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిపోయిందని ఒక్క సారిగా ఓ పార్టీ వాళ్లు ప్రచారం ప్రారంభించేశారు. దీంతో తెలుగు మీడియాలో అందరూ ఉలిక్కిపడ్డారు. నిజమా అని చెక్...

HOT NEWS

[X] Close
[X] Close