విశాఖ నుంచి జగన్ పాలన ముహుర్తం జూలై 23..!

ఆరునూరైనా విశాఖనుంచి రాష్ట్రాలన్ని పరిపాలించాలని అనుకుంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఆటంకాలన్నింటినీ తనదైన శైలిలో అధిగమించాలని డిసైడ్ అయ్యారు. ముందుగా తాను విశాఖ వెళ్లి పరిపాలన చేయడానికి ఏ సమస్యలు లేవని న్యాయనిపుణులు తేల్చిచెప్పడంతో ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల ఇరవై మూడో తేదీ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్‌ను విశాఖకు తరలించబోతున్నారు. సీఎం ఇక రోజువారీ కార్యకలాపాలు అక్కడ్నుంచే నిర్వహిస్తారు. ఇందు కోసం ఏర్పాట్లు పుల్ స్వింగ్‌లో ఉన్నాయి. నివాస భవనాన్ని కూడా ఖరారు చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ.. ఆ పనులను రోజూ పరిశీలిస్తున్నారు. అప్పుడప్పుడు సమీక్షిస్తున్నారు. వైజాగ్ కు క్యాంప్ కార్యాలయం తరలింపుకు సంబంధించి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్ కు సీఎం సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

అయితే ఇక్కడ ఓ సమస్య ఉంది… వెళ్తే సీఎం జగన్ మాత్రమే విశాఖ వెళ్లాలి. ఆయనతో పాటు ఇతర శాఖలు తరలించడానికి అవకాశం లేదు. ఎందుకంటే గతంలో కర్నూలుకు విజిలెన్స్ కార్యాలయాలను తరలించడాన్నే హైకోర్టు కొట్టి వేసింది. ఇప్పుడు.. కోర్టులో ఉన్న అంశాన్ని భిన్నంగా శాఖల కార్యాలయాలను కూడా తరలిస్తే అది కోర్టు ధిక్కారం అవుతుంది. అందుకే శాఖల కార్యాలయాలను తరలించడానికి అవకాశం లేదు. అదే కొంత మంది అధికారులను కలవర పెడుతోంది. సీఎం క్యాంప్ ఆఫీస్ వైజాగ్ లో ఉంటే అధికారులు అమరావతిలో ఉంటారని, సమావేశాలకు హాజరయ్యే అధికారులు అటూ ఇటూ తిరగడం కష్టమవుతుందని ఆందోళన చెందుతున్నారు.

ఈ సమస్యను పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వ వినూత్న మార్గాలను అన్వేషిస్తోంది. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి సీఎం జగన్ నివాసానికి రాకపోకలు సాగించేందుకు ప్రత్యేకమైన రహదారిని నిర్మించాలనే ఆలోచనచేస్తున్నారు. ఆ దారిలో ఒక్క సీఎంతో పాటు ఆయన కోసం వచ్చి పోయే వారి కోసమే ట్రాఫిక్ అనుమతిస్తారు. ఇలాంటి కొన్ని ప్రయత్నాలు చేసి.. ఎలగైనా క్యాంప్ ఆఫీసును విశాఖకు తరలించాలన్న ఆలోచన చేస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత పట్టుదల కోసం చేస్తున్న ఈ ప్రయత్నాల వల్ల ప్రజాధనం వృధానే కానీ.. ఏ ప్రయోజనం ఉండదని కొంత మంది పార్టీ నేతలు గొణుక్కుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేంద్రం – కేజ్రీవాల్ మధ్యలో రాకేష్..!

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేష్ ఆస్థానా అనే అధికారిని మోడీ సర్కార్ నియమించడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఆయనను తక్షణం పదవి నుంచి తప్పించాలని కేజ్రీవాల్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఢిల్లీకి...

మీడియా వాచ్ : తెలుగులో ఏబీపీ డిజిటల్..! పెరుగుతున్న ఉత్తరాది ప్రాబల్యం..!

తెలుగు మీడియా రంగంలో ఉత్తరాది ప్రాబల్యం పెరుగుతోంది. గతంలో తెలుగు మీడియాకు సంబంధించి పత్రికలైనా.. టీవీ చానళ్లు అయినా తెలుగు వారే ప్రారంభించేవారు. గతంలో ఉత్తదారికి చెందిన పెద్ద పెద్ద సంస్థలు మీడియా...

పెట్రో కంపెనీల్నీ అమ్మేస్తున్న కేంద్రం..!

పెట్రో పన్నులు పెంచుతూ ప్రజల వద్ద నుంచి లక్షల కోట్ల ఆదాయం కళ్ల జూస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఆ కంపెనీలను కూడా అమ్మకానికి పెట్టేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా వంద...

హుజూరాబాద్‌లో అసలు కన్నా ఫేక్ ప్రచారాలే ఎక్కువ..!

హుజూరాబాద్ ఉపఎన్నిక రాజకీయాల్లో పెరిగిపోతున్న మకిలీ మొత్తాన్ని బయట పెడుతూనే ఉంది. అసలు షెడ్యూలే రాలేదు.. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ.. రాజకీయ పార్టీలు.. అన్ని రకాల తెలివి తేటల్నీ ప్రదర్శిస్తున్నాయి....

HOT NEWS

[X] Close
[X] Close