శిష్యుడికి మ‌ళ్లీ దారి చూపిస్తున్న సుకుమార్‌

త‌న శిష్యుల్ని సుకుమార్ ప‌ట్టించుకున్నంత‌గా మ‌రో ద‌ర్శ‌కుడు ప‌ట్టించుకోడేమో..? త‌న ద‌గ్గ‌ర ప‌నిచేసిన‌వాళ్లంద‌రినీ ఏదో ఓ రూపంలో సెట్ చేసేస్తున్నాడు సుకుమార్‌. అందుకు తాజా ఉదాహ‌ర‌ణ‌.. బుచ్చిబాబు. `ఉప్పెన‌`తో బుచ్చి ఓ బ్లాక్ బ్ల‌స్ట‌ర్ కొట్టాడు. ఈ సినిమా వెనుక క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌.. అన్నీ సుకుమారే. త‌నే లేక‌పోతే… ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని న‌మ్మి.. బుచ్చి చేతుల్లో పెట్టేవారు కాదు.

తొలి సినిమా హిట్ట‌య్యింది. ఇక బుచ్చికి త‌న‌దంటూ ఓ మార్గం ఏర్ప‌డింది. అయినా.. ఇప్పుడు కూడా శిష్యుడి చేయి వ‌ద‌ల్లేదు సుకుమార్‌. ఎందుకంటే బుచ్చిబాబులో ఇప్పుడే ఇంకాస్త కన్‌ఫ్యూజ‌న్ మొద‌లైంది. ఎందుకంటే.. త‌న రెండో సినిమా ఎన్టీఆర్ తో అనుకున్నాడు. కానీ అది ఇప్ప‌ట్లో కుద‌రేలా లేదు. అందుకే.. అల్లు అర్జున్ చెంత‌కు చేరాడు. బ‌న్నీకీ – బుచ్చిబాబుకీ మీటింగ్ సెట్ చేసిందే… సుకుమారే. బ‌న్నీ ఇప్పుడు డైలామాలో ఉన్నాడు. `పుష్ఫ‌` త‌ర‌వాత ఎలాంటి సినిమా చేయాలా? అనే సందిగ్థంలో ఉన్నాడు. అటు బ‌న్నీని కూడా… సుకుమారే గైడ్ చేస్తున్న‌ట్టు ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్. బ‌న్నీకి కాస్త న‌చ్చ‌జెప్పి.. శిష్యుడి తో సినిమాని ప‌ట్టాలెక్కించాల‌న్న‌ది సుకుమార్ ప్ర‌య‌త్నం. ఒక‌వేళ బ‌న్నీకి వీలుకాక‌పోయినా.. మ‌రో హీరోతో.. ఆ క‌థ‌ని సెట్ చేయ‌డానికి సైతం సుకుమార్ ప్ర‌య‌త్నాలు ప్రారంభించాడ‌ట‌. ఎప్పుడైతే… సుకుమార్ ఎంట‌రై.. బుచ్చికి భ‌రోసా ఇచ్చాడో, బుచ్చి కాస్త రిలాక్స్ అయ్యాడ‌ట‌. ఇక బుచ్చి భార‌మంతా.. సుకుమార్‌దే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేంద్రం – కేజ్రీవాల్ మధ్యలో రాకేష్..!

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేష్ ఆస్థానా అనే అధికారిని మోడీ సర్కార్ నియమించడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఆయనను తక్షణం పదవి నుంచి తప్పించాలని కేజ్రీవాల్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఢిల్లీకి...

మీడియా వాచ్ : తెలుగులో ఏబీపీ డిజిటల్..! పెరుగుతున్న ఉత్తరాది ప్రాబల్యం..!

తెలుగు మీడియా రంగంలో ఉత్తరాది ప్రాబల్యం పెరుగుతోంది. గతంలో తెలుగు మీడియాకు సంబంధించి పత్రికలైనా.. టీవీ చానళ్లు అయినా తెలుగు వారే ప్రారంభించేవారు. గతంలో ఉత్తదారికి చెందిన పెద్ద పెద్ద సంస్థలు మీడియా...

పెట్రో కంపెనీల్నీ అమ్మేస్తున్న కేంద్రం..!

పెట్రో పన్నులు పెంచుతూ ప్రజల వద్ద నుంచి లక్షల కోట్ల ఆదాయం కళ్ల జూస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఆ కంపెనీలను కూడా అమ్మకానికి పెట్టేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా వంద...

హుజూరాబాద్‌లో అసలు కన్నా ఫేక్ ప్రచారాలే ఎక్కువ..!

హుజూరాబాద్ ఉపఎన్నిక రాజకీయాల్లో పెరిగిపోతున్న మకిలీ మొత్తాన్ని బయట పెడుతూనే ఉంది. అసలు షెడ్యూలే రాలేదు.. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ.. రాజకీయ పార్టీలు.. అన్ని రకాల తెలివి తేటల్నీ ప్రదర్శిస్తున్నాయి....

HOT NEWS

[X] Close
[X] Close