చైతన్య : యెస్..యు కెన్ డు..! మార్పు నువ్వు సాధించగలవు పవన్..!

పవన్ కల్యాణ్ అంటే.. మ్యాన్ ఆఫ్ డిఫరెన్స్..! సినీ పరిశ్రమలో … ఆ ప్రత్యేకతే ఆయనను సూపర్ స్టార్‌ని చేసింది. తొలి సినిమా తర్వాత అసలు యాక్టర్ మెటీరియల్ కాదని విమర్శలు గుప్పించిన వారితోనే… “శభాష్ పవన్” అనిపించుకున్న విజయం ఆయనది. అలాంటి పవన్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఓటములకు కుంగిపోని తత్వం.. ఎవరేమనుకున్నా.. తాను అనుకున్నది చేసే పట్టుదల ఉన్న పవన్.. రాజకీయాల్లోనూ అదే పట్టుదల చూపిస్తారా ? అదే ప్రత్యేకత చూపించాడనికి సిద్ధమవుతారా..? దీని కోసం పవన్ ఏం చేయాల్సి ఉంది..?

మార్పుని పవన్ ఆచరించి చూపించబోతున్నారా..?

సామాజిక పరంగా పవన్ కల్యాణ్ భావాలు అత్యున్నతం. సమాజంలో కుళ్లుని కడిగి పారేయాలని.. కుల, మత, ప్రాంతం అనే తేడాలను రూపు మాపేయాలనేది.. పవన్ కల్యాణ్ లక్ష్యం. తన ఆలోచనలు, సమాజాన్ని మార్చాలన్న సంకల్పంతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అదే విషయాన్ని పదే పదే చెబుతున్నారు కూడా. నేటి రాజకీయ నేతలు ఏది చేయడానికి భయపడిపోతారో.. పవన్ కల్యాణ్ అవన్నీ చేయడానికి సిద్ధమవుతున్నారు. రాజకీయాల్లో పారదర్శకత, నిజాయితీ, కుల రహిత రాజకీయాలు లాంటివన్నింటినీ ఆయన సాధించాలనుకుంటున్నారు. నేటి రాజకీయ నేతలెవరికీ.. ఈ లక్షణాలులేవని.. పవన్ కల్యాణ్ విమర్శిస్తూ ఉంటారు. అయితే.. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా ఆ నేతల జాబితాలో చేరకుండా.. రాజకీయాల్లో కూడా తాను “మ్యాన్ ఆఫ్ డిఫరెన్స్” అని నిరూపించుకోవాలంటే… కచ్చితంగా.. పారదర్శకత, నిజాయితీ, కుల రహిత రాజకీయాలు చేయాల్సి ఉంటుంది. అయితే.. మాటల్లోకాదు..! చేతల్లో ఎలా ?

ఆదాయం, ఆస్తుల్ని ప్రకటించి పారదర్శకత పాటిస్తారా..?

రాజకీయాల్లో పారదర్శకత చాలా ముఖ్యం. పవన్ కల్యాణ్ ప్రజా జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు కాబట్టి.. ముందుగా.. తన గురించి ప్రజలకు పూర్తిగా తెలియజెప్పాలి. ఎన్నికల్లో పోటీ చేసే ముందే తన ఆర్థిక స్థితిగతులన్నింటినీ ప్రజల ముందు ఉంచాలి. తను కడుతున్న ఆదాయ పన్ను వివరాల్ని , వున్న ఆస్తుల్ని రెండిటిని వెల్లడించాలి. ఆ తర్వాత ప్రతీ ఏడాది తన ఆస్తుల్ని,ఆదాయ పన్ను వివరాల్ని వెల్లడిస్తూ ఉంటే.. ఎలాంటి అక్రమ సంపాదన లేదని తేలిపోతుంది.తనకు సంబంధించిన ఆస్తులు, ఆదాయ వివరాలన్నింటినీ.. బహిర్గతం చేయడం ద్వారా..ఇతర నేతలపై వత్తిడి పెంచి వారినీ తన దారిలోకి తీసుకు రావడానికి అవకాశం ఉంది. మన దేశంలో ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటిస్తారు గాని , ఆదాయపు పన్ను బహిరంగం చెయ్యరు. పాశ్చాత్య దేశాల్లో రాజకీయ నేతలు.. తమ ఆదాయపు పన్ను రిటర్నుల్ని కూడా బహిర్గతం చేస్తారు.అందుకే అమెరికా లాంటి దేశాల్లో రాజకీయాలు..పారదర్శకంగా ఉంటాయి.అలాంటి వ్యవస్థకు పవన్ ఆద్యుడయ్యే అవకాశం ఉంది.

కులరహిత రాజకీయానికి తొలి అడుగు వేస్తారా..?

కుల, మత, ప్రాంత రాజకీయాలు అంటే పవన్ కల్యాణ్‌కు అసహ్యం.ఆయనకు కులం లేదు. మతం లేదు. కానీ రాజకీయాలంటే.. ముందుగా కులం ముద్ర వేస్తారు. పవన్ పై కూడా అదే వేసే ప్రయత్నం చేశారు. కానీ.. పవన్ కల్యాణ్ ఈ ట్రాప్‌లో పడకుండా.. ఇతర రాజకీయ పార్టీలు, నేతలకు బుద్ది చెప్పేలా.. తను రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. తన కుల ప్రభావం అస్సలు లేని చోట లేదా చాలా తక్కువ వున్న చోట పోటీ చేయాలి. పవన్ కల్యాణ్.. భావి నేత. ఆయన ఎక్కడ పోటీ చేసినా గెలవగలరు. కాబట్టి… తన సామాజికవర్గం లేని చోట పోటీ చేస్తేనే…పోటీ చేసి గెలిచి తన సత్తా చూపిస్తేనే తను అనుకున్న సందేశాన్ని బలంగా ప్రజల్లోకి పంపించగలరు.

రాజకీయాల్లో సంస్కరణల విప్లవం కోసం మొదటి అడుగు వేస్తారా..?

పవన్ కల్యాణ్ కచ్చితంగా… ఓ విప్లవం సృష్టించగల రాజకీయ నేత. ఉండవల్లి నుంచి పెంటపాటి పుల్లారావు వరకు అనేక మంది మేధావుల ప్రశంసలు పొందిన నేత. అయితే సామాన్య ప్రజలు మాత్రం..మేధావుల్లా ఆలోచించలేరు. వారికి ఎన్ని గొప్ప మాటలు చెప్పినా… వారు చేతలనే విశ్వసిస్తారు. పవన్ కల్యాణ్.. తన ఆదర్శాలను చేతల ద్వారా… ఆచరించి… గొప్ప రాజకీయ సంస్కరణ వాదిగా నిలుస్తారని.. సామాన్యుల భావన. నేటి రాజకీయాలపై అసహ్యం పెంచుకునే అనేక మంది యువ ఓటర్లు కూడా పవన్ కల్యాణ్ వైపు ఇలాగే చూస్తున్నారు. పవన్ ఈ అంచనాలను అందుకోగలరు..అనే ఆశతో…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్‌ని కలిసి జగన్‌పై విమర్శలు చేసిన బండి సంజయ్..!

తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చాలని చూస్తున్నారని.. తెలంగాణ బీజేపీ చీఫ్.. బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమవేశమయ్యారు. తెలంగాణలో జనసేనతో కలిసి...

క్రైమ్ : ఒక్క హత్య బయట పడకుండా 9 హత్యలు..! కానీ..

ఒక్క హత్య చేశాడు.. అది ఎక్కడ బయటపడుతుందోనని తొమ్మిది మందిని చంపేశాడు. స్థూలంగా వరంగల్ జిల్లాలోని గొర్రెల కుంట బావిలో బయటపడిన తొమ్మిది మృతదేహాల కథ. ఇందులో నిందితుడు..బాధితులు.. ఎవరూ తెలుగువాళ్లు కాదు....

తూచ్.. శ్రీవారి భూములు అమ్మాలని బోర్డు నిర్ణయం తీసుకోలేదన్న సుబ్బారెడ్డి..!

శ్రీవారి భూములు అమ్మడానికి ఆస్తులు గుర్తించి..రిజిస్ట్రేషన్ అధికారాలను కూడా అధికారులకు కట్టబెట్టేసిన తర్వాత... ఇప్పుడు వివాదం ఏర్పడటంతో.. టీటీడీ బోర్డు చైర్మన్ మాట మార్చారు. భూములు అమ్మడానికి పాలక మండలి నిర్ణయం తీసుకోలేదని...కేవలం...

బీజేపీ తల్చుకుంటే శ్రీవారి ఆస్తుల అమ్మకం నిలిపివేత ఎంత సేపు..!?

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు..శ్రీవారి ఆస్తులను అమ్మకానికి పెట్టిన విషయంపై బీజేపీ భగ్గమని లేస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు దీక్షలకు సిద్ధమయ్యారు..తెలంగాణ నేతలు కూడా.. ఊరుకునేది లేదని.. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్వయంగా......

HOT NEWS

[X] Close
[X] Close