కత్తి మహేష్ టెంప్లేట్ వైకాపా వదలదా? కత్తి స్థానాన్ని పోసాని భర్తీ చేయగలరా ?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైఎస్ఆర్సిపి మంత్రులు వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటూ చిన్న సైజు యుద్ధమే జరుగుతుంది. సినిమా టికెట్లను ప్రభుత్వ పోర్టల్ ద్వారా అమ్మాలి అన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత వైఎస్ఆర్సీపీ మంత్రులు పవన్ పై ముప్పేట దాడికి దిగిన సంగతి తెలిసిందే. తాజాగా సభ్యసమాజం చదవలేని రాయలేని భాషలో పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ పై బూతు పురాణం లంకించుకున్నాడు. అయితే పోసాని కృష్ణ మురళి విమర్శలను చూసిన విశ్లేషకులు వై ఎస్ ఆర్ సి పి మరొకసారి కత్తి మహేష్ టెంప్లేట్ ని బయటకు తీసిందా? కత్తి మహేష్ స్థానాన్ని పోసాని కృష్ణమురళి చేత భర్తీ చేయిస్తోందా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

కత్తి మహేష్ టెంప్లేట్ అనగానేమి?

2019 ఎన్నికలకు ఏడాదిన్నర ముందు కత్తి మహేష్, శ్రీ రెడ్డి వంటి వ్యక్తులు తెరమీదకు వచ్చారు. పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తును ఆదిలోనే భస్మం చేయాలన్న ఏకైక ఉద్దేశ్యంతోనే వీరు వచ్చారు అన్న విషయం తెలుసుకోవడానికి తెలుగు ప్రజలకు చాలా కాలం పట్టింది. అయితే వీరి modus operandi దాదాపు ప్రతిసారీ ఒక ప్రత్యేకమైన pattern లో కొనసాగుతుంది.

ఇందులో మొదటి స్టెప్ – పవన్ కళ్యాణ్ ఏదైనా సమస్య పై మాట్లాడినప్పుడు, ఏదైనా వ్యాఖ్యలు చేసినప్పుడు ఆగమేఘాల మీద వీరు స్పందిస్తారు. రెండవ స్టెప్- ఆ స్పందనలో అసలు సమస్య పై సమాధానం చెప్పకుండా, తెలివిగా ఏదో ఒక ఒక వ్యక్తిగత అంశాన్ని తీసుకుని , పవన్ కళ్యాణ్ పై మాటల దాడికి దిగుతారు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అభిమానులు రెచ్చి పోవాలనే ఉద్దేశంతోనే వీరు ఆ వ్యాఖ్యలు చేస్తారు. మూడవదిగా – పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరో కొందరు రెచ్చిపోయి వీరి ఫోన్ లకు మెసేజ్ లు పెట్టడం లేదా కాల్ చేయడం చేయగానే, నిన్నటిదాకా aggressive గా దాడి చేసినవారు హఠాత్తుగా victim card బయటకు తీస్తారు. పవన్ కళ్యాణ్ దగ్గరుండి అభిమానుల చేత తమను తిట్టిస్తున్నాడు అంటూ విమర్శలు చేస్తారు. తద్వారా రెండు ప్రయోజనాలు సాధించడానికి ప్రయత్నిస్తారు- మొదటిది అసలు లేవనెత్తిన సమస్య నుండి అందరినీ డైవర్ట్ చేయడం, రెండవది పవన్ కళ్యాణ్ అభిమానులను సైకో లు గా చిత్రీకరించడం ద్వారా తటస్తులను పవన్ కళ్యాణ్ కి దూరం చేసేలా చేయడం.

కత్తి మహేష్ స్థానాన్ని పోసాని భర్తీ చేస్తున్నాడా ?

దురదృష్టవశాత్తు ప్రమాదంలో కత్తి మహేష్ మరణించాడు. ఆయన చికిత్స కోసం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం, ప్రభుత్వ ఖజానా నుండి 17 లక్షలు ఖర్చు పెట్టినప్పటికీ ఫలితం దక్కలేదు. అయితే ఈ రోజు పోసాని కృష్ణ మురళి ఆయన స్థానాన్ని భర్తీ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముందుగా పవన్ కళ్యాణ్ తన ఉపన్యాసంలో ఎక్కడా పోసాని కృష్ణమురళి పేరు ప్రస్తావించలేదు. పరోక్షంగా మంత్రి పేర్ని నాని ని, నేరుగా నటుడు మోహన్ బాబు పేరు ని ప్రస్తావించినప్పటికీ పోసాని పేరు ని ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే పోసాని ప్రెస్ మీట్ పెట్టి మరి, పంజాబీ అమ్మాయిని మోసం చేసిన వ్యక్తి అంటూ పవన్ కళ్యాణ్ పై నిందారోపణలు చేసే విధంగా చాలా ప్లాన్డ్ గా విమర్శలు చేశారు. కాకతాళీయం ఏమిటంటే గతంలో కత్తి మహేష్ కూడా ఇదే పంజాబీ అమ్మాయి పేరిట పవన్ పై విమర్శనాస్త్రాలు సంధించి ఉన్నారు. తన పేరు ప్రస్తావించక పోయినా వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పోసాని, తాను ఊహించినట్లుగానే కొంతమంది అభిమానుల నుండి అసభ్యకరమైన మెసేజ్ లు రావడంతో సడన్ గా విక్టిమ్ కార్డ్ బయటకు తీశారు. ఇప్పుడు ఆయన తదుపరి చర్య ఏం చేస్తాడు అన్న దానిపై కూడా పెద్దగా సస్పెన్స్ అక్కర్లేదు. గతంలో కత్తి మహేష్ ఏ విధంగా ప్రవర్తించాడో అచ్చం అదే విధంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, ఆ తర్వాత ఈ టాపిక్ ని మళ్లీ సాగదీయడం చేస్తాడని సులువుగానే ఊహించవచ్చు.

జగన్ ఆదేశాల మేరకే ఈ ఎపిసోడ్ నడుస్తుందన్న విషయం జీవిత పాత వ్యాఖ్యల ద్వారా అర్థమైందా?

కత్తి మహేష్ టెంప్లేట్ లాంటిది గతంలో ప్రజారాజ్యం సమయంలో జీవిత రాజశేఖర్ లు చిరంజీవిపై వాడేవారు. చిరంజీవి తుమ్మిన దగ్గినా మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవిని చెడుగుడు ఆడేవారు. అయితే మొన్నీమధ్య అప్పటి ఆ వ్యాఖ్యలపై కాస్త బాధ వ్యక్తం చేశారు జీవిత. అప్పట్లో చిరంజీవి ఏదైనా మాట్లాడగానే, అంబటి రాంబాబు గారు తమకు గంటకోసారి ఫోన్ చేసి మరీ చిరంజీవి ని తిడుతూ ప్రెస్ మీట్ పెట్టమని బలవంతం చేసే వారని జీవిత వివరించారు. అయితే అంబటి వీరిని ఒత్తిడి చేయడానికి ముందు సజ్జల రామకృష్ణారెడ్డి , జగన్ తదితరులు చర్చించుకుని అంబటి రాంబాబు కి డైరెక్షన్ ఇచ్చేవారని, తదనుగుణంగానే అంబటి, జీవిత రాజశేఖర్ ల పై ఒత్తిడి తెచ్చే వారని రాజకీయ వర్గాల్లో చర్చ వినిపించేది. ఈ లెక్కన పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ని ఈ విధంగా తిట్టడం అన్నది కూడా వైకాపా పార్టీ నుండి వచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకే జరిగి ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. మరి దీని పరిణామాలు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాయో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రొమాంటిక్… రామ్ స్పెషల్!

ఆకాష్ పూరి రొమాంటిక్ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్లు చేరిపోతున్నాయి. పూరి స్వయంగా ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాశారు. శివగామి రమ్యకృష్ణ సినిమాలో కీలక పాత్ర చేసింది. ప్రభాస్ ఈ...

పూరికి కోట్ల పబ్లిసిటీ ఇచ్చిన ప్రభాస్ !

పూరి జగన్నాధ్ కి ప్రభాస్ చాలా పెద్ద సాయమే చేశాడు. రొమాంటిక్ సినిమా ప్రమోషన్స్ లో భాగస్వామి అయ్యాడు. ట్వీట్ చేయడమో, పోస్ట్ పెట్టడమో కాదు.. ఏకంగా ఒక ఫుల్ డే కాల్...
video

బాలయ్య మాటల్లో ఫిల్టర్ ఉండదు

https://youtu.be/nugtpLfdiD0 నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అలరించనున్నారు. ‘అన్‌స్టాపబుల్‌’ అనే ప్రోగ్రామ్ లో సందడి చేయనున్నారు. ‘ఆహా’ఓటీటీ లో ప్రసారంకానున్న ఈ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ప్రోమోలో బాలకృష్ణ అదరగొట్టారు.''నీకు చిత్తశుద్ధి...

‘ఆర్‌ఎక్స్‌ 100’ కథ మారలేదు కానీ..

ఎలాంటి అంచనాలు లేకుండా సంచలనాలు నమోదు చేసిన చిత్రం 'ఆర్‌ఎక్స్‌ 100’. హీరోగా కార్తికేయ, హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్, దర్శకుడిగా అజయ్ భూపతికి ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చిపెట్టిన...

HOT NEWS

[X] Close
[X] Close