ప్రొ.నాగేశ్వర్: అస్సాంలోలా తెలంగాణలో బీజేపీ గెలుస్తుందా..?

బీజేపీ ఓ రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీ అన్న తర్వాత విజయమే లక్ష్యంగా పోరాటం చేస్తారు. రెండు సీట్లు మాత్రమే ఉన్న అస్సాంలో అధికారంలోకి రాగలిగాం.. అసలు సీటే లేని త్రిపురలో అధికారంలోకి రాగలిగాం.. తెలంగాణలోనూ ఎందుకు రాలేమన్న వాదన వినిపిస్తున్నారు. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్… తెలంగాణను మరో అస్సాంగా చెబుతున్నారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షునికి ఉన్న రాజకీయ వ్యూహచతురత ఇంకెవరికీ లేదంటున్నారు. నిజంగానే అమిత్ షా సమర్థవంతమైన రాజకీయ వ్యూహకర్త అందులో ఎలాంటి సందేహం లేదు.

అస్సాంలో బీజేపీకి కలసి వచ్చిన పొలరైజేషన్..!

అస్సాంలో బీజేపీ ఎలా అధికారంలోకి వచ్చింది..?. అస్సాంలో ఉన్నటు వంటి పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయా..? ఉండేందుకు ప్రయత్నాలు బీజేపీ చేస్తోందా..?. అస్సాంలో ఓ ఉద్యమం జరిగింది. ఎందుకంటే… బెంగాల్ నుంచి … బంగ్లాదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో అస్సాంకు వలసలు జరిగాయి. బోర్డర్ స్టేట్ కావడమే దీనికి కారణం అయింది. ఈ వలసల వల్ల రెండు సమస్యలు వచ్చాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్లు.. బెంగాలీలే కాకుండా ముస్లింలు. బెంగాల్ నుంచీ కొంత మంది వచ్చారు. దీని వల్ల హిందూ-ముస్లిం తేడాలు పెరిగిపోయాయి. హిందూ-ముస్లిం ఓట్ల పోలరైజేషన్ అస్సాంలో జరిగింది. ఇంకో ముఖ్య కారణం ఏమిటంటే.. అస్సామీ భాష అస్థిత్వం దెబ్బతినడం ప్రారంభమయింది. అస్సామీ ప్రజలు మైనార్టీలోకి పడిపోయారు. దీంతో అస్సామీ ఉద్యమం నడిచింది. ఈ రెండింటిలోనూ బీజేపీ క్రియాశీలకంగా ఉంది. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్లను టార్గెట్‌గా చేసుకుని.. ఇల్లీగల్ మైగ్రేషన్‌ను కారణంగా చూపుతూ రాజకీయం చేశారు. ఇవన్నీ బీజేపీకి బాగా ఉపయోగపడ్డాయి.

అస్సాం రాజకీయ పరిస్థితులు తెలంగాణలో లేవు..!

తెలంగాణ విషయాన్ని పరిశీలిస్తే..ఇక్కడ కూడా పెద్ద ఉద్యమం జరిగింది. అయితే అస్సాంలోలాగా.. తెలంగాణేతలు మెజార్టీ ప్రజలుగా కాలేదు. కొంత మైగ్రేషన్ ఉన్నా.. అది చాలా పరిమితమే. అయినా అస్సాంలో జరిగిన ఉద్యమాల్లో బీజేపీ ఎంత చురుగ్గా ఉందో..తెలంగాణలోనూ అంతే చురుగ్గా ఉంది. కానీ సమస్య ఏమిటంటే.. అక్కడ అస్సాం ఉద్యమానికి నాయకత్వం వహించిన అస్సాం గణ పరిషత్ పార్టీ ముక్కలు చెక్కలయింది. ఏజీపీ నుంచి నాయకులుగా ఎదిగిన అనేక మంది పార్టీలు మారిపోయారు. కానీ ఇక్కడ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన టీఆర్ఎస్.. బలంగా ఉంది. ఐక్యంగా ఉంది. అందుకే తెలంగాణ ఉద్యమంలో బీజేపీ చురుగ్గా పాల్గొన్న కూడా.. 2014లో బీజేపీ ప్రభావం చూపించలేకపోయింది. కేసీఆర్ భాషలో చెప్పాలంటే సీమాంధ్ర నాయకత్వంలో ఉన్న తెలుగుదేశానికి 15 సీట్లు వచ్చాయి. బీజేపీకి ఐదే సీట్లు వచ్చాయి. పార్లమెంట్‌లో బీజేపీ మద్దతు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. అయినా కానీ ప్రభావం చూపించలేకపోయారు. 2014లోనే ప్రభావం చూపించలేకపోతే.. ఇక 2019లో ఎలా చూపిస్తారు..?

అస్సాం బీజేపీలో బలమైన నేతలున్నారు..! మరి తెలంగాణలో..!?

అస్సాంలో బీజేపీ వలసలను ప్లాన్డ్‌గా ప్రొత్సహించింది. ఓ నాయకుడ్ని అస్సాం గణపరిషత్ నుచి మరో నాయకుడ్ని కాంగ్రెస్‌ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ వ్యూహరం బాగా పని చేసింది. కానీ తెలంగాణలో ఎవర్నీ చేర్చుకోలేకపోయారు. ఆంధ్రలో కూడా అదే టెక్నిక్‌తో కన్నా లక్ష్మినారాయణను పార్టీలో చేర్చుకుని అధికారంలోకి వస్తామన్న భ్రమలో ఉన్నారు. అస్సాంలో ఏజీపీ నుంచి పార్టీలో చేర్చుకున్న శర్వానంద సోనోవాల్ అంత పాపులర్ లీడర్ కాదు..కన్నా లక్ష్మినారాయణ. అది బీజేపీ నేతలకు అర్థం కావడం లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి బలమైన నాయకుడు ఎవరూ చేరలేదు. హరీష్ రావు చేరుతారని కొంత కాలం ప్రచారం చేశారు. కానీ కేసీఆర్ బలంగా ఉన్నంత కాలం.. హరీష్ రావు కూడా.. బీజేపీలో చేరినా ఏమీ చేయలేరు. అలాగే కాంగ్రెస్ నుంచి కూడా ఏ బలమైన నాయకుడు చేరలేదు. ప్రస్తుతం ఎవరైనా చేరినా…ఇప్పుడు ఉన్న బీజేపీ నేతలు వాళ్లను అంగీకరించరు. దానికి నాగం జనార్ధన్ రెడ్డినే ఉదాహరణ. దీన్ని బట్టి తెలిసిందేమిటంటే.. అస్సాంలో తెచ్చుకున్నట్లు బలమైన నాయకుల్ని ఇతర పార్టీల నుంచి తెచ్చుకునే పరిస్థితి లేదు. సొంత పార్టీ నుంచి నాయకత్వం ఎదిగే అవకాశం కూడా లేదు.

ఆరెస్సెస్ చాపకింద నీరులా విస్తరించింది..!

అస్సాంలో ఆరెస్సెస్ చాలా ఏళ్లుగా పాగా వేసింది. టీ తోట కార్మికుల్లో మంచి ప్రాబల్యం సంపాదించుకుంది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి ఉన్న సంగరేణి కార్మికుల్లో బీజేపీ కనీస పలుకుబడి సాధించలేదు. ఇంకో విషయం ఏమిటంటే.. అక్కడ కాంగ్రెస్ పార్టీ పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉంది. అంటే ప్రభుత్వ వ్యతిరేకత కూడా బీజేపీకి కలిసొచ్చింది. కానీ తెలంగాణలో .. కేసీఆర్‌కు అధికారిక వ్యతిరేకత గద్దె దించేంత బలంగా లేదు. ఒక వేళ వ్యతిరేకత వచ్చినా… టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా.. బీజేపీ లేదు. కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయమే కానీ… బీజేపీ కాదు. అస్సాంలో మిత్రుల్ని దగ్గర చేసుకున్నారు. తెలంగాణలో మిత్రులెవరున్నారు. టీడీపీ దూరమయింది. ఇప్పుడు తెలంగాణలో బీజేపీతో కలిసే పార్టీ ఒక్కటి కూడా లేదు.

టీఆర్ఎస్‌ విషయంలో సాఫ్ట్ కార్నర్..!

ఇక అధికారంలో ఉన్న పార్టీ పట్ల నిర్లిప్త ధోరణి. అస్సాంలో..కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక.,.. నేరుగా తలపడ్డారు. కానీ తెలంగాణలో మాత్రం.. టీఆర్ఎస్ విషయంలో ద్వంద్వ వైఖరి అవలభించారు. ఎందుకంటే.. టీఆర్ఎస్ బలపడితే కాంగ్రెస్‌ కు లాభపడుతుంది. కాంగ్రెస్ బలపడితే.. బీజేపీకి ఇబ్బందికరం. అందుకే ద్వంద్వ వైఖరి అవలంభించారు. పైగా.. టీఆర్ఎస్‌ వల్ల బీజేపీకి లాభమే. ఎందుకంటే.. టీఆర్ఎస్‌కు సీట్లు వచ్చినా.. వారు కాంగ్రెస్‌కు మద్దతివ్వలేరు. ఎందుకంటే.. వారికి కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కాబట్టి. అంటే ఎన్నికల తర్వాతైనా… టీఆర్ఎస్ తమకే మద్దతు ఇస్తుందన్న నమ్మకంతో.. బీజేపీ ఉంది. అందుకే.. టీఆర్ఎస్‌ను చాలెంజ్ చేసే స్థాయిలో బీజేపీ రాజకీయం చేయడం లేదు.

తెలంగాణను అస్సాం చేయడం అమిత్ షా వల్ల కూడా కాదు..!

వీటన్నింటిని బట్టిచూస్తే.. తెలంగాణను అస్సాం చేస్తామనేది..మాటలే. గ్రౌండ్ రియారిటీని చూస్తే… అది అసాధ్యం. అస్సాంలో ఓట్లు పోలరైజ్ అయినట్లు తెలంగాణలో కావు. అమిత్ షా గొప్ప వ్యూహకర్తే కావొచ్చు కానీ…బీజేపీ బీహార్, ఢిల్లీ, పంజాబ్ లాంటి పలు రాష్ట్రాల్లో ఓడిపోయింది. ఉపఎన్నికల్లోనూ ఓడిపోయింది. అది గుర్తుంచుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close