ఏపీలో అంతే : మత ఘర్షణల కేసులు ఎత్తివేత..!

ఏపీలో శాంతిభద్రతల పరంగా జరుగుతున్న విన్యాసాలు విస్మయానికి గురి చేస్తోంది. కొద్ది రోజుల క్రితం పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి… పోలీసుల్నే కొట్టిన అల్లరి మూకలపై కేసులు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. తాజాగా.. ఏకంగా మత ఘర్షణల కేసులనూ ఎత్తివేయడానికి నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం ఇప్పుడు సంచలనాత్మకం అవుతోంది. మారణాయుధాలతో హల్ చల్ చేసి.. అనేక మంది ప్రాణభీతికి కారణం అయిన.. పదుల సంఖ్యలో బాధితులు ఉన్న మత కల్లోలాల కేసుల్ని ఎత్తివేయాలనే ఊహా ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వానికీ వచ్చి ఉండదు. కానీ ప్రస్తుత ఏపీ సర్కార్ మాత్రం.. ఆ కేసుల్ని ఎత్తివేయాలని పోలీసుల్ని ఆదేశించింది.

2011 సెప్టెంబరు 5, 6వ తేదీల్లో కర్నూలు జిల్లా ఆదోనిలో తీవ్ర మత ఘర్షణలు జరిగాయి. వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా.. రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. కావాలని … అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో… అధికార పార్టీగా ఉన్న వారిలో కొందరు కావాలనే ఈ అల్లర్లు రేపారని ఆరోపణలు ఉన్నాయి. ఆ సందర్భంగా ఆదోని ప్రజాజీవితం రెండు రోజులు స్తంభించిపోయింది. బిక్కుబిక్కు మంటూ జనం గడిపారు. ఆ ఘటనలపై నమోదైన 33 కేసుల్ని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. విచారణను ఉపసంహరించుకుంటూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేయించాలని డీజీపీని ఆదేశించింది.

ఈ ఎత్తివేత అవకాశాన్ని పొందిన నిందితులపై ఉన్న అభియోగాలు సాదా సీదావి కావు. ఆస్తుల విధ్వంసం, అల్లర్లకు పాల్పడటం, మారణాయుధాలతో ప్రదర్శన చేయటం, రెండు మతాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించటం, ఇళ్లు కొల్లగొట్టటం, అక్రమంగా చొరబడటం, ఇళ్లను తగలబెట్టాలనే ఉద్దేశంతో అగ్గి, పేలుడు పదార్థాలు వినియోగించటం, ప్రమాదకర ఆయుధాలతో దాడి చేయటం, హత్యాయత్నం వంటి కేసులు ఉన్నాయి. ఇలాంటి కేసుల్ని కూడా ఎత్తివేస్తూ పోతే.. ఇక మత ఘర్షణలకు పాల్పడేవారు.. పోలీస్ స్టేషన్లపై దాడి చేసే వారికి మరింత ధైర్యం వస్తుంది. ఓ రాజకీయ పార్టీ పోతే.. ఇంకో రాజకీయ పార్టీ వచ్చి తమపై కేసులు ఎత్తివేస్తుందని.. విచ్చలవిడిగా అరాచకాలకు పాల్పడే ప్రమాదం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రిష్ పేరు మిస్సింగ్‌.. ఏం జ‌రిగింది?

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు టీజ‌ర్ వ‌చ్చింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుద‌ల చేస్తామ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అది కూడా ఓకే. అయితే షాకింగ్ ఏమిటంటే......

పాయకరావుపేట రివ్యూ : వంగలపూడి అనితకు కలిసొస్తున్న కాలం !

తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఒకరు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఈ ఐదేళ్లలో టీడీపీ మహిళా నేతలు మానసిక వేధింపులు భయంకరంగా ఎదుర్కొన్నారు. వైసీపీ నేతల బూతులు,...

చైతన్య : ప్రభుత్వం శాశ్వతం.. సీఎం కాదు – ఇంగితం లేదా నాగేశ్వర్ !

ఎంత మేధావులమని చెప్పుకున్నా తాత్కాలిక లాభాలో తాము వ్యతిరేకించే వారిని గట్టిగా వ్యతిరేకించాలన్న కురచబుద్దితో వారి ప్రత్యర్థుల్ని సపోర్టు చేసి నవ్వుల పాలవుతూంటారు. ఆ జాబితాలో చాలా కాలంగా ప్రొ.నాగేశ్వర్ కూడా...

కడపలో సీన్ మార్చేస్తున్న షర్మిల !

షర్మిలతో రాజకీయం అంత తేలిక కాదని ఆమె నిరూపిస్తున్నారు. హోంగ్రౌండ్ లో కడప ఎంపీగా గెలిచేందుకు ఆమె చేస్తున్న రాజకీయ వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ చేస్తోంది. రెండు రోజుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close