చైతన్య : కేసీఆర్‌ను చూసి జగన్ నేర్చుకోలేరా..?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల విషయంలో.. గట్టిగా ముందుకెళ్లాలని.. తెలంగాణ సీఎం కేసీఆర్ .. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సూచించినట్లుగా మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఈ విషయంలో కేసీఆర్ తప్పేమీ లేదు. ఆయన అచ్చమైన తెలంగాణ నాయకుడు. తమ ప్రాంతానికి ఎలా మేలు జరుగుతుందో.. చూసుకుని అలా వ్యవహరించగల సమర్థుడు. ఆయన మాటల్లో చెప్పాలంటే.. తల తెగిపడినా.. తన ప్రాంతానికి నయా పైసా అన్యాయం జరగనివ్వరు. లాభం వస్తుందంటే.. వదిలి పెట్టరు. ఇప్పుడు.. ఏపీ పరిణామాలతో తెలంగాణకు ఎనలేని లాభం కలుగుతుంది కాబట్టే.. ఆయన ప్రోత్సహిస్తున్నారని సులువుగానే అర్థం చేసుకోవచ్చు.

తెలంగాణలో వికేంద్రీకరణ ఆలోచనే కేసీఆర్ ఎందుకు చేయరు..?

ఆంధ్రప్రదేశ్‌లో పాలనా వికేంద్రీకరణ చేస్తూ.. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నట్లుగా చెప్పుకుంటున్న ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ సర్కార్.. ఎందుకు అభివృద్ధి వికేంద్రీకరణ చేయడం లేదో.. ఆలోచించలేకపోతున్నారు. నిజానికి తెలంగాణ పూర్తిగా వెనుకబడిన రాష్ట్రం. ఒక్క హైదరాబాద్ మాత్రమే మెట్రో నగరంగా అభివృద్ధి చెందింది. హైదరాబాద్‌లో కలుస్తున్న శివారు ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయి. అదే హైదరాబాద్‌ను యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న.. ప్రాంతాలకు వెళ్తే.. అక్కడి పరిస్థితి చూసి.. అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం. అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు అత్యంత దారుణంగా ఉంటాయి. ఉపాధి ఉండదు. ఇక హైదరాబాద్‌కు సుదూరంగా.. ఆదిలాబాద్ లాంటి జిల్లాలు అయితే… అవి రాజకీయంగా మాత్రమే.. తెలంగాణ అన్నట్లుగా.. మిగతా అంతా మహారాష్ట్ర అన్నట్లుగా ఉంటాయి. కనీస మౌలిక సదుపాయాలు కూడా ఉండవు. ఫ్లైఓవర్లు కట్టినా.. ఔటర్ రింగ్ రోడ్డులు కట్టినా.. విమానాశ్రయాలు కట్టినా హైదరాబాద్ చుట్టుపక్కలే. అయినా.. అక్కడి ప్రభుత్వం వికేంద్రీకరణ గురించి ఆలోచించడం లేదు. అదిలాబాద్‌లో సెక్రటేరియట్ పెడితే.. మరో హైదరాబాద్ అవుతుందని చెప్పడం లేదు. మహబూబ్ నగర్‌లో హైకోర్టు పెడితే.. అభివృద్ధి జరుగుతుందని చెప్పడం లేదు. కనీసం అలాంటి ప్రకటనలు కూడా చేయరు.

జగన్ ఫార్ములాలో అంత మ్యాజిక్ ఉంటే కేసీఆర్ అనుసరించరా..?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు.. సెక్రటేరియట్ ఒకటో.. హైకోర్టు ఒక చోట.. అసెంబ్లీ మరో చోట పెట్టడమే అభివృద్ధి.. కేసీఆర్ ఈ పాటికి ఎప్పుడో అమలు చేసి ఉండేవారు. ఎందుకంటే.. ఆయనకు తెలంగాణ సమగ్రాభివృద్ధి ముఖ్యం. తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలనే.. ఆయన ఉద్యమం చేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన కూడా.. హైదరాబాద్ చుట్టుపక్కలే దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తున్నారు కానీ… నలుమూలలా చూడటం లేదు. అలా ఎందుకు చూడటం లేదో.. జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకుంటున్నారో.. చేసుకుని కూడా.. చేసుకోనట్లు ఉంటున్నారో అర్థం కాని పరిస్థితి. హైదరాబాద్‌లో ఎంత అభివృద్ధి జరిగితే.. తెలంగాణ ప్రభుత్వానికి అంత ఆదాయం వస్తుంది. అదే మహా నగరాల్లో ఉండే మ్యాజిక్. ఆ విషయాన్ని కేసీఆర్ దగ్గర్నుంచి కూడా జగన్ నేర్చుకోలేకపోతున్నారు.

కేసీఆర్ వంద శాతం కరెక్ట్.. ఏపీ సీఎందే తప్పు..!

ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు.. ఏపీకి ఎంత మాత్రం మంచివి కావు. విశాఖ నుంచి పరుగులు పెట్టి పారిపోతున్న పెట్టుబడులు.. ఏపీలో తగ్గిపోయిన ఆర్థిక కార్యకలాపాలు … నిలిచి పోయిన అభివృద్ధి.. కుప్పకూలే స్థితికి చేరిన ఆర్థిక పరిస్థితి.. ఇవన్నీ… తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సంబంధం లేనివే. ఏపీ ప్రజలు తెచ్చి పెట్టుకున్న ముఖ్యమంత్రి సాధించిన విజయాలే. కేసీఆర్ సలహాలతోనే జగన్ ఇవన్నీ చేస్తున్నారని ప్రచారంలో నిజం ఉన్నా.. లేకపోయినా.. కేసీఆర్ వంద శాతం కరెక్టే చేస్తున్నారు. తాను సీఎంగా ఉన్న రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం.. తనను ముఖ్యమంత్రిని చేసిన ప్రజలను.. వంచించకుండా.. పాలన చేయడం.. ఏపీ ముఖ్యమంత్రి విధి. అందులో మాత్రం ఆయన ఫెలయివుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close