టీవీ 9 యాంకర్ సత్య, కత్తి మహేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి

సినిమాలలో చిన్న చిన్న పాత్రలో వేసుకుని నటి బోయ సునీత , టీవీ 9 యాంకర్ సత్య మరియు వివాదాస్పద క్రిటిక్ కత్తి మహేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పట్ల టీవీ9 స్టూడియో లో నే వీరిద్దరూ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..

దాదాపు ఏడాది కిందట జరిగిన సంఘటన కి ప్రస్తుతం జరిగిన ఈ సంఘటన కి మధ్య సంబంధం ఉంది. ఏడాది కిందట శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ మీద గళమెత్తుతూ గంటల తరబడి టీవీ 9 స్టూడియో లో చర్చా కార్యక్రమాలు చేస్తున్న సమయంలో, ఈ సమస్యతో ఎటువంటి సంబంధం లేదని పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లిన టీవీ 9 రిపోర్టర్, శ్రీ రెడ్డి వ్యాఖ్యల మీద స్పందించమని కోరగా, పవన్ కళ్యాణ్ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం మంచిదని, స్టూడియోలలో కూర్చుని చర్చలు చేయడం వల్ల ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు. అయితే స్టూడియోలో డిబేట్ చేయడం కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడం మంచిది అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద టీవీ9 మరొక ప్రోగ్రాం పెట్టింది. ఒకరకంగా చెప్పాలంటే కేవలం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలనీ ఖండించడానికి ఈ ప్రోగ్రాం పెట్టింది. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న జూనియర్ ఆర్టిస్ట్ సునీత- లైవ్ లో , కత్తి మహేష్, టీవీ9 యాంకర్ సత్య తన పక్కన కూర్చుని ఉండగానే, గతంలో కత్తి మహేష్ తన పట్ల లైంగిక దాడికి ప్రయత్నించాడని బాంబ్ పేల్చింది. అయితే ఆవిడను తన గదికి వేరే చర్చ కోసం పిలుచుకున్న మాట వాస్తవమే కానీ లైంగిక దాడి చేయలేదని అప్పట్లో కత్తి మహేష్ గట్టిగా వాదించుకున్నారు. పైగా నిజంగా అలాంటి లైంగిక దాడి తాను చేసి ఉంటే గనక టీవీలో డిబేట్ పెట్టడం కాకుం డా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా టీవీ9 యాంకర్ సత్య, కత్తి మహేష్ ఆమె కు సూచించారు.

కట్ చేస్తే, లైవ్ డిబేట్ కి టీవీ9 చిన్న బ్రేక్ ఇచ్చి, బ్రేక్ అయ్యేలోపు నటి సునీత ని డిబేట్ నుండి బయటకు పంపించింది. అప్పట్లో జరిగిన ఈ కార్యక్రమం టీవీ9 మీద తీవ్ర విమర్శలు వచ్చేలా చేసింది. ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లాలని సూచించిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ని ఖండించడానికి ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంలో, నటి సునీత కత్తి మహేష్ కి మీద ఆరోపణలు చేయగానే అదే టీవీ9 యాంకర్, ఆమె ని పోలీస్ స్టేషన్ కి వెళ్ళమని సూచించడం ఆ చానెల్ ని నవ్వుల పాలు చేసింది.అయితే ఈ సంఘటన అనంతరం ఆమె సత్య మీద, కత్తి మహేష్ మీద పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. దాదాపు ఏడాది సమయం గడిచినా, ఆ కేసులో పురోగతి లేకపోవడంతో ఇప్పుడు మళ్ళీ ఆమె పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది. అంతేకాకుండా నిన్న టీవీ9 స్టూడియో కు వేరే కార్యక్రమ నిమిత్తం వెళ్తే మళ్లీ అక్కడ ఇదే తంతు జరిగిందని, స్టూడియో లో నే తన ను అవమానించారని, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆమె ఫిర్యాదు స్వీకరించడమే కాకుండా, గత ఫిర్యాదును కలిపి విచారిస్తామని చెప్పినట్లుగా సమాచారం.

గత ఏడాది తో పోలిస్తే ఇప్పటికి రాజకీయ పరిస్థితులు మారి ఉండడం, టీవీ9 మీద ప్రజలలో కానీ ఇటు రాజకీయ పక్షాలలో కాని అభిప్రాయం కాస్త మారి ఉండడం – వీటన్నిటి దృష్ట్యా ఈ కేసు ఏ రకంగా ముందుకు వెళుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండ‌లు పెంచుతున్న‌ నాగ‌శౌర్య

ల‌వర్ బోయ్ పాత్ర‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతాడు నాగశౌర్య‌. త‌న కెరీర్‌లో అలాంటి క‌థ‌లే ఎక్కువ విజ‌యాల్ని అందించాయి. అయితే... మాస్ హీరోగా నిరూపించుకోవాల‌న్న‌ది నాగ‌శౌర్య తాప‌త్ర‌యం. అలాంటి క‌థ‌లు ఎంచుకుంటున్నా - స‌రైన...

‘పుష్ష‌’‌పై విజ‌య్‌ సేతుప‌తి క్లారిటీ

అల్లు అర్జున్ - సుకుమార్‌ల హ్యాట్రిక్ సినిమా 'పుష్ష‌'. ఈ సినిమా కోసం విజ‌య్ సేతుప‌తిని విల‌న్ గా ఎంచుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల విజ‌య్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఆ...

వ‌ర్మ‌ని లైట్ తీసుకున్నాడా?

రాంగోపాల్ వ‌ర్మ పేల్చ‌బోతున్న బాంబు `ప‌వ‌ర్ స్టార్‌`. ఓటీటీ వేదిక‌గా వ‌ర్మ ఇది వ‌ర‌కు ప‌లు సినిమాల్ని వ‌దిలాడు. దేనికీ రాని క్రేజు.. `ప‌వ‌ర్ స్టార్‌`కి వ‌చ్చింది. ఈ సినిమా స్పెషాలిటీ గురించి...

రాజకీయాల్లో రాజస్థాన్ “సచిన్” హిట్ వికెట్ ..!?

రాజస్థాన్ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కూల్చేసినట్లుగా కూల్చేస్తారని భావించిన సచిన్ పైలట్.. చివరికి.. హిట్ వికెట్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆయన తనకు...

HOT NEWS

[X] Close
[X] Close