ఉప్పల్ స్టేడియంలో రచ్చ..! యాంకర్ ప్రశాంతిపై కేసు..!

ఉప్పుల్ క్రికెట్ స్టేడియంలో.. స్నేహితులతో కలిసి యాంకర్ ప్రశాంతి మద్యం మత్తులో చేసిన రచ్చతో… పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆదివారం.. ఉప్పల్ స్టేడియంలో.. సన్ రైజర్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు మరో ఐదుగురు స్నేహితులతో కలిసి మద్యం తాగి… ప్రశాంతి వచ్చారు. వీరిలో ముగ్గురు మగవాళ్లు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో.. వీరు.. అసభ్య చేష్టలకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలు.. కెమెరాల్లో రికార్డయ్యాయి. మద్యం మత్తులో వీరు చేస్తున్న పనులు.. మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు.. ఇబ్బందులు కలిగించారు. ప్రశ్నించిన ప్రేక్షకులతో కూడా.. దురుసుగా ప్రవర్తించారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో యాంకర్ ప్రశాంతితో సహా మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రశాంతి పలు టీవీ చానళ్లలో యాంకరింగ్ చేశారు. సినీ సెలబ్రిటీస్‌ను ఇంటర్యూ చేసి పేరు తెచ్చుకున్నారు. గతంలో.. ఎఫైర్ అనే ఓ సినిమాలోనూ నటించారు. పూర్తిగా లెస్బియన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ చిక్కులో కూడా పడింది. గీతాంజలి అనే మరోనటితో కలిసి ప్రశాంతి.. ఈ సినిమాలో.. లెస్బియన్స్ గా నటించారు. సెన్సార్ కూడా ఆమోదించని సన్నివేశాలు ఉండటంతో.. సినిమాపై ఆసక్తికర చర్చ జరిగింది. ఎట్టకేలకు ఆ సినిమాను విడుదల చేసినప్పటికీ.. పెద్దగా సక్సెస్ కాలేదు.

యాంకర్ ప్రశాంతితో పాటు… ఆమె మిత్రబృందం.. వీఐపీ బాక్స్‌లో ఉన్నారు. వారికి… పాసులు.. కార్పొరేట్ కంపెనీ నుంచి వచ్చాయని చెబుతున్నారు. ఐపీఎల్ సీజన్‌లో… ఫ్రాంచైజీ జట్టుతో పాటు.. ఆ జట్టుతో సంబంధం ఉన్న వ్యాపారసంస్థలకు వీఐపీ పాసులు వస్తాయి. పైగా.. సన్ రైజర్స్ టీం.. జెమిని టీవీ యాజమాన్యానికి సంబంధించినది కావడంతో… ఆ కోణంలోనే వారికి వీఐపీ బాక్స్ టిక్కెట్లు అంది ఉంటాయని.. భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప సవాల్ – అవినాష్ రెడ్డిపై షర్మిల పోటీ !

కడప ఎంపీ బరి ఈ సారి ప్రత్యేకంగా మారనుంది. అవినాష్ రెడ్డిపై షర్మిల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. సునీత లేదా ఆమె తల్లి ఇండిపెండెంట్ గా లేదా టీడీపీ తరపున...

ఐదేళ్ల విలాసం తర్వాత ఎన్నికల ప్రచారానికే జనాల్లోకి జగన్ !

పదవి కోసం ప్రజల మధ్య పాదయాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి .. అధికారం వచ్చాక విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. రెండు కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాఫ్టర్లను వాడారు. తన...

తుండు రివ్యూ: కాపీ కొట్ట‌డం ఎలా?

Thundu movie review ఈమ‌ధ్య మ‌ల‌యాళ చిత్రాల‌కు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఓటీటీలు వ‌చ్చాక‌... ఆ భాష‌లో సినిమాల్ని స‌బ్ టైటిల్స్ తో చూసే బాధ త‌ప్పాక‌, తెలుగు డ‌బ్బింగులు పెరిగాక ఆ ప్రేమ మ‌రింత...

పాపం వైసీపీ – కోడ్ వచ్చాక పెయిడ్ సర్వేలూ ప్లేట్ ఫిరాయింంపు !

ఏపీలో జగన్ రెడ్డికి అంతా అనుకూలంగా ఉందని సర్వేలు వచ్చేలా.. మూడేళ్ల నుంచి చాలా పెద్ద బడ్జెట్ తో ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు.. కోడ్ వచ్చాక పరువు తీస్తున్నాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close