“డ్రోన్” ఘటనలో టీడీపీ నేతలపైనే ఎదురు కేసులు..!

TDP

జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై.. డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టడం కలకలం రేపింది. సీఎం జగన్ ఇంట్లో పని చేసే వీరమాచనేని కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఆదేశంతోనే… తాము డ్రోన్‌తో.. చంద్రబాబు ఇంటిని చిత్రీకరించామని.. పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు.. మీడియా ముందు.. అలాగే పోలీస్ స్టేషన్‌లోనూ చెప్పారు. కానీ.. పోలీసులు … టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఆ సమయంలో.. చంద్రబాబు ఇంటి వద్ద .. పోలీసుల విధి నిర్వహణను అడ్డుకున్నారంటూ.. టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌, మాజీ ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌కుమార్‌, జీవీ ఆంజనేయులు, శాసనమండలిలో టీడీపీ ఉపనేత డొక్కా మాణిక్యవరప్రసాద్‌, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాశ్‌, గంజి చిరంజీవిలతోపాటు మరో 20మందిపై కేసులు నమోదు చేశారు.

చంద్రబాబు ఇంటిపై డ్రోన్ ను ఎగురవేసి.. దృశ్యాలు చిత్రీకరించాలంటే.. కచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. పోలీసులకు తెలియకుండానే… ఎగురవేశారని.. సాక్షాత్తూ డీజీపీ గౌతం సవాంగ్ కూడా చెప్పారు. ఇప్పుడు.. జగన్ ఇంట్లో పని చేసే కిరణ్ కుమార్ అనే వ్యక్తిని సైడ్ చేసేశారు. జలవనరుల శాఖ రంగంలోకి వచ్చింది. తామే .. వారిని చంద్రబాబు ఇంటి వద్ద వరద పరిస్థితిని అంచనా వేయడానికి పంపామని… మంత్రి అనిల్ ప్రకటించుకున్నారు అయితే.. ఇదంతా నోటిమాట ద్వారానే జరిగింది. ఎలాంటి… రాతపత్రాలు.. అనుమతులు ఇవ్వలేదు. దీంతో… జగన్ ఇంట్లో పని చేసే కిరణ్ పేరు బయటకు రాకుండా.. ఈ జాగ్రత్తలు తీసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెక్యూరిటీని బ్రీచ్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా… డ్రోన్ ఘటనపై పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. కానీ.. పోలీసుల విధుల్ని అడ్డుకున్నారంటూ… టీడీపీ నేతలపై ఎదురు కేసులు మాత్రం పెట్టారు.

చంద్రబాబు ఇంటిని అణువుఅణువూ చిత్రీకరించి.. ఏదో కుట్ర చేద్దామనే.. ప్రయత్నం చేస్తున్నారని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పట్టుబడుతున్నారు. దీనిపై టీడీపీ నేతలు.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని కూడా కలిసి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు భద్రతకు ప్రమాదం ఉందని.. తక్షణం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ నేతలు… గవర్నర్ ను కలవడంతో… డీజీపీ మరోసారి స్పందించారు. అనుమతి తీసుకోకుండానే.. ఇరిగేషన్ శాఖ డ్రోన్ ఎగురవేసిందని… ఇక ముందు మాత్రం.. కచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సిందేనని ప్రకటించారు. చంద్రబాబు ఇంటిపై డ్రోన్లను ఎగురువేయడంలో ఎలాంటి కుట్ర లేదని.. రాజకీయం చేయవద్దని.. ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి డ్రోన్ రాజకీయం.. ఇంతటితో ఆగే పరిస్థితి లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com