వివేకా కేసులో మళ్లీ వచ్చిన సీబీఐ…!

వివేకా హత్య కేసును ఎవరూ తేల్చడం లేదు. ఏపీ పోలీసులు తేల్చలేదు. సిట్‌ల మీద సిట్‌లు వేసినా మార్పు రాలేదు. చివరికి హైకోర్టు సీబీఐకి ఇచ్చినా అదే పరిస్థితి. రెండు విడతలుగా సీబీఐ అధికారులు వచ్చి పోయారు కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అదే సమయంలో.. కడపలో అలాంటి హత్యలు కామనేనని.. సీబీఐ అధికారులు తనతో అన్నారంటూ .. వైఎస్ వివేకా కుమార్తె ఢిల్లీలో స్వయంగా ప్రకటించడంతో సీబీఐ అధికారులపై అనుమానాలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో వైసీపీ అధినేత.. సీఎం జగన్ .. వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులతో వీడియో కాల్స్‌లో మాట్లాడుతున్నారంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ వివాదం నేపధ్యంలో వైఎస్ వివేకా హత్య కేసు రాజకీయంగా కలకలం రేపుతోంది.

తిరుపతి ఉపఎన్నికల్లో ఈ అంశం రాజకీయ పార్టీలకు ప్రధాన అంశంమయింది. వివేకానందరెడ్డిని ఎవరు చంపారో తేల్చాలని డిమాండ్లు వినిపించడం ప్రారంభించాయి. సీబీఐపై అనుమానాలు ప్రారంభమవుతున్నాయని … రాజకీయ పరంగా ఓ హత్య కేసును సైతం దారి తప్పించేప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు రావడం సీబీఐ విశ్వసనీయతమే తీవ్రంగా దెబ్బకొట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మళ్లీ పెద్దగా హడావుడి లేకుండా నలుగురు సభ్యుల బృందం పులివెందుల చేరుకుంది. వారేం చేస్తారో.. ఇప్పటి వరకూ ఏం దర్యాప్తు చేశారో ఎవరికీ స్పష్టత లేదు.

కానీ.. ఏదో ఒకటి చేస్తున్నామనిపించడానికి మాత్రం వచ్చినట్లుగా ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ కేసులో అయినా సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నించినవారే ప్రధాన అనుమానితులు. వివేకా కేసులో హత్యను సహజ మరణంగా నమ్మించి.. మృతదేహానికి కుట్లు కట్టి… రక్తం తుడిచేసిన వారు ఎవరో అందరికీ తెలుసు. కానీ ఇంత వరకూ వారిని మాత్రం ప్రశ్నించకుండా… కేసు విచారణ చేస్తున్నారంటే… సీబీఐకి ఎంత సీరియస్‌ నెస్ ఉందో అర్థం చేసుకోవచ్చన్న విమర్శలు ఇతర పార్టీల నుంచి వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రమేష్ ఆస్పత్రికి రఘురామ..! హైకోర్టు ఆదేశాలనైనా పాటిస్తారా..?

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అయినా రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించకూడదనుకున్న సీఐడీ అధికారులు.. ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఐడీ కోర్టు ఆదేశించించినట్లుగానే.. రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించాలని స్పష్టం చేసింది. గుంంటూరు ప్రభుత్వాసుపత్రిలో...

జైలుకు ఆర్ఆర్ఆర్.. కోర్టును లైట్ తీసుకున్న సీఐడీ..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కోర్టులను లెక్క చేయలేదు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్యం అందించాలని ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేసి.. జిల్లా జైలుకు తరలించేశారు. ఆయనకు వైద్యం అందించే విషయంలోనే కాదు.. వైద్య నివేదిక...

టీవీ9 ప్రాథమిక నివేదిక.. ఆర్ఆర్ఆర్‌కి సొరియాసిస్..!

రఘురామకృష్ణరాజు కాళ్లకు ఉన్న దెబ్బల గురించి టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ కోర్టు.. హైకోర్టులు ఆదేశించాయి. వైద్యులు నివేదికల కోసం.. కోర్టు ఇచ్చిన సమయం దాటి మరీ టెస్టులు చేస్తున్నారు. నివేదికలు...

రేవంత్‌కు పోలీసులే అలా ప్రచారం చేసి పెడతారు..!

హైదరాబాద్‌లో రూ. ఐదు రూపాయల భోజన కేంద్రాలయిన అన్నపూర్ణ క్యాంటీన్లు కొనసాగుతాయని మీడియాకు సమాచారం ఇచ్చిన తెలంగాణ సర్కార్.. నిజానికి ఆపేసింది. దాంతో పేదలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా చోట్ల టీఆర్ఎస్...

HOT NEWS

[X] Close
[X] Close