త్రివిక్ర‌మ్ వ‌డ్డీతో స‌హా క‌ట్టాల‌ట‌!

ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమా ఆగిపోయింది. ఎన్టీఆర్, కొర‌టాల‌తోనూ, త్రివిక్ర‌మ్ మ‌హేష్ తోనూ సినిమా చేయ‌బోతున్నారు. ‌పర‌స్ప‌ర అంగీకారంతో, ఓ ఆరోగ్య క‌ర‌మైన వాతావ‌రణంలోనే ఈ సినిమా ఆగిపోయింది. అయితే.. ఇప్పుడు త్రివిక్ర‌మ్ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాల‌ట‌. అది కూడా వ‌డ్డీతో.

ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమాని హారిక హాసిని సంస్థ నిర్మించాల్సివుంది. అది త్రివిక్ర‌మ్ సొంత సంస్థే. అక్క‌డ అడ్వాన్సుల మాటే లేదు. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా చేతులు క‌లిపింది. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ భాగ‌స్వామి. త‌న చేతుల నుంచి త్రివిక్ర‌మ్ కి  కోటి రూపాయ‌ల అడ్వాన్స్ ఇచ్చార‌ని టాక్‌. ఆ కోటి, వ‌డ్డీతో స‌హా తిరిగి ఇవ్వాల్సిన బాధ్య‌త త్రివిక్ర‌మ్ పై ప‌డింది. త్రివిక్ర‌మ్ కి అదేమంత లెక్క కాదు. కానీ… ఓ నిర్మాత ద‌గ్గ‌ర్నుంచి తీసుకున్న అడ్వాన్స్ తిరిగి, వడ్డీతో స‌హా ఇవ్వాల్సిన ప‌రిస్థితి రావడం త్రివిక్ర‌మ్ కెరీర్‌లోనే ఇదే మొద‌టి సారి కావొచ్చు. ఇప్ప‌డు ఎన్టీఆర్ – కొర‌టాల సినిమా కూడా.. క‌ల్యాణ్ రామ్ కి అప్ప‌గిస్తాడా, లేదా? అనే ఓ అనుమానం ఉంది. క‌ల్యాణ్ రామ్ ఈ సినిమాని ఎలాగైనా వ‌దులుకోకూడ‌ద‌ని భావిస్తున్నాడు. అన్నీ కుదిరితే.. నిర్మాత జాబితాలో క‌ల్యాణ్ రామ్ పేరు కూడా చూడొచ్చు. ఈరోజు సాయింత్రానికి ఎన్టీఆర్ – కొర‌టాల శివ సినిమాకు సంబంధించి ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంది. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రమేష్ ఆస్పత్రికి రఘురామ..! హైకోర్టు ఆదేశాలనైనా పాటిస్తారా..?

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అయినా రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించకూడదనుకున్న సీఐడీ అధికారులు.. ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఐడీ కోర్టు ఆదేశించించినట్లుగానే.. రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించాలని స్పష్టం చేసింది. గుంంటూరు ప్రభుత్వాసుపత్రిలో...

జైలుకు ఆర్ఆర్ఆర్.. కోర్టును లైట్ తీసుకున్న సీఐడీ..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కోర్టులను లెక్క చేయలేదు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్యం అందించాలని ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేసి.. జిల్లా జైలుకు తరలించేశారు. ఆయనకు వైద్యం అందించే విషయంలోనే కాదు.. వైద్య నివేదిక...

టీవీ9 ప్రాథమిక నివేదిక.. ఆర్ఆర్ఆర్‌కి సొరియాసిస్..!

రఘురామకృష్ణరాజు కాళ్లకు ఉన్న దెబ్బల గురించి టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ కోర్టు.. హైకోర్టులు ఆదేశించాయి. వైద్యులు నివేదికల కోసం.. కోర్టు ఇచ్చిన సమయం దాటి మరీ టెస్టులు చేస్తున్నారు. నివేదికలు...

రేవంత్‌కు పోలీసులే అలా ప్రచారం చేసి పెడతారు..!

హైదరాబాద్‌లో రూ. ఐదు రూపాయల భోజన కేంద్రాలయిన అన్నపూర్ణ క్యాంటీన్లు కొనసాగుతాయని మీడియాకు సమాచారం ఇచ్చిన తెలంగాణ సర్కార్.. నిజానికి ఆపేసింది. దాంతో పేదలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా చోట్ల టీఆర్ఎస్...

HOT NEWS

[X] Close
[X] Close