వైసీపీ హయాంలో దేవదేవుడ్ని కూడా వదలకుండా.. ఎలా దోచుకున్నారో.. ఆయన భక్తుల ఆరోగ్యంతో ఎలా ఆడుకున్నారో మరోసారి స్పష్టమయింది. నెయ్యి కల్తీ అంశంపై సుప్రీంకోర్టు నియమించిన సిట్.. ఐదు సంవత్సరాల పాటూ కల్తీ నెయ్యి సరఫరా సాగిందని గుర్తించింది. ఈ మేరకు ఇటీవల అరెస్టు చేసిన నిందితుడి రిమాండ్ రిపోర్టులో స్పష్టమైన సమాచారం పొందు పరిచింది. భోలేబాబు డెయిరీకి కల్తీ నెయ్యి తయారు చేయడానికి అవసరమైన కెమికల్స్ ను సరఫరా చేసిన ట్రేడర్ ను సీబీఐ అరెస్టు చేసింది.
భోలేబాబా డెయిరీ ఒక్క లీటర్ కూడా పాలు కొనకుండా.. రూ.250 కోట్ల విలువైన 68 లక్షల లీటర్ల నెయ్యిని టీటీడీకి సరఫరా చేసింది. అంటే ఆ నెయ్యి మొత్తం కల్తీదే. కెమికల్స్ ఉపయోగించి తయారు చేశారు. ఇంత నిరాటంకంగా ఎలా సాగిందో తదుపరి అరెస్టులో సీబీఐ వివరించే అవకాశం ఉంది. భోలేబాబా డెయిరీ కల్తీ నెయ్యి సరఫరా చేస్తోందని గుర్తించి బ్లాక్ లిస్టులో పెట్టాక.. ఏఆర్ డెయిరీ.. వైష్ణవి డెయిరీల పేరుతో సరఫరా చేసింది. ఇదందా ఓ పెద్ద కుట్రలో భాగంగానే జరిగింది.
భోలేబాబా డెయిరీ ఉత్తరాంఖండ్ లో ఉంటుంది. ఆ డెయిరీకి ఎవరైనా పాలు సరఫరా చేశారా అని సీబీఐ అధికారులు దర్యాప్తు చేశారు. ఒక్కరు కూడా తాము పాలు సరఫరా చేసినట్లుగా చెప్పలేదు. పూర్తి దర్యాప్తుతో ఆధారాలతో.. సీబీఐ సిట్ దర్యాప్తు చేసి అరెస్టులు చేస్తోంది. ఇప్పటికి టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి పీఏను అరెస్టు చేసింది. నాటి పాలకుల నిర్వాకాన్ని త్వరలోనే సీబీఐ సిట్ ప్రజల ముందు ఉంచే అవకాశం ఉంది.

