వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి A8 !

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ మాత్రం పట్టు వదలకుండా తాను చెప్పాలనుకున్నది.. మొత్తం కోర్టులకు ఏ సందు దొరికినా చెబుతోంది. తాజాగా అవినాష్ రెడ్డి తండ్రి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేసిన సమయంలో మొత్తం కథ మరోసారి చెప్పింది. అయితే ఈ సారి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఎంపీ అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చింది సీబీఐ. ఇప్పటి వరకూ నిందితుడిగా ఎక్కడా చెప్పలేదు. తొలిసారిగా ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన కౌంటర్ లో అవినాష్ రెడ్డిని ఎనిమిదో నిందితుడిగా చేర్చింది.

హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో కీలకంగా వ్యవహరించారని సీబఐ స్పష్టం చేసింది. కేసు పెట్టవద్దని.. వివేకా మృతదేహానికి పోస్టుమార్టం వద్దని సీఐ శంకరయ్యకు అవినాష్ , శివశంకర్ రెడ్డి చెప్పారన్నారు. సీబీఐ , కోర్టుకు ఏమీ చెప్పవద్దని దస్తగిరిని ప్రలోభపెట్టారని సీబీఐ తెలిపింది. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు చేశారని.. ఆయన బయట ఉంటే.. పులివెందుల సాక్షులు ప్రభావితమైనట్లేనని కౌంటర్ లో సీబీఐ స్పష్టం చేసింది. బెయిల్ ఇచ్చి ఎన్ని షరతులు పెట్టినా ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. విచారణకు సహకరిస్తున్నామని భాస్కర్ రెడ్డి చెబుతున్నారని..కానీ అదంతా అబద్దమన్నారు.వివేకా హత్య కేసులో భారీ కుట్ర ఉందని దానిపై దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ తెలిపింది. షరతులతో కూడా బెయిల్ ఇవ్వనొద్దని సీబీఐ గట్టిగా వాదించింది.

హైకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ.. దాఖలు చేసిన కౌంటర్ లో సీబీఐ సీఎం జగన్ ప్రస్తావన తీసుకు వచ్చింది. వైఎస్ వివేకా హత్యకు గురయ్యారని బయట ప్రపంచానికి తెలియక ముందే .. సీఎం జగన్ తెలుసని కౌంటర్ దాఖలు చేసింది. తాజాగా సీబీఐ కోర్టులోనూ చెప్పింది. దీంతో మరోసారి జగన్ ప్రస్తావనను సీబీఐ తెచ్చినట్లయింది. అదే సమయంలో విస్తృతమైన కుట్రపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పడంతో.. ఇంకా చాలా కథ ఉందన్న అభిప్రాయాన్ని సీబీఐ కల్పిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close