రంగబలి టీజర్: నాగ శౌర్య నవ్వించాడు

నాగ శౌర్య కొత్త సినిమా ‘రంగబలి’. పవన్ బాసంశెట్టి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. తాజాగా టీజర్ ని వదిలారు. ఇదో విలేజ్ డ్రామా లోకల్ డ్రామా. టీజర్ లో వినోదానికి పెద్దపీట వేశారు. హీరోతో పాటు సత్య, సప్తగిరి, మిగతా హాస్యనటులు చేసిన సందడి బావుంది.

టీజర్ లో కథని కూడా రివిల్ చేశారు. వూర్లో హాయిగా గడిపేసే కుర్రాడు. తనక్ లోకల్ ఫీలింగ్ కూడా వుంటుంది. అదే ఊర్లోకి వచ్చిన వైద్యురాలిని ఇష్టపడతాడు. అదే సమయంలో షైన్ టామ్ చాకో పాత్ర రూపంలో తనకి ఓ సవాల్ ఎదురౌతుంది. అదేంటనేది తక్కిన కథ.

ఈ మధ్య విలేజ్ నేపధ్యంలో కొన్ని కథలు వచ్చాయి కానీ అవి పూర్తిస్థాయి వినోదాన్ని అందించలేకపోయాయి. రంగబలి టీజర్ చూస్తుంటే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో తీర్చిదిద్దిన విలేజ్ డ్రామాలా అనిపిస్తోంది. నాగ శౌర్య కూడా బాగా కలిసొచ్చే జోనర్ ఇది. ఛలో కూడా ఇలాంటి తరహా సినిమానే. మరి ఆ మ్యాజిక్ ఇందులో రిపీట్ అవుతుందో లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.