వివేకా హత్య కేసులో తదుపరి విచారణ కొనసాగించడానికి సీబీఐ సిద్ధంగా ఉంది. కోర్టు ఆదేశిస్తే కొనసాగిస్తామని తెలియాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయని సీబీఐ చెబుతోంది. సుప్రీంకోర్టు సూచనలతో సునీత దిగువ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ కొనసాగించాలని.. తన తండ్రి హత్య విషయం మొదట వైఎస్ భారతికి ఫోన్ కాల్ ద్వారా తెలిసిందని.. అక్కడి నుంచే విచారణ మొదలు పెట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై సీబీఐకి.. ఇతర నిందితులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
సీబీఐ విచారణ వద్దని నిందితుల అఫిడవిట్లు
సహజంగానే నిందితులు అంతా.. సీబీఐ విచారణ ఇక కొనసాగించవద్దని అఫిడవిట్లు వేస్తున్నారు.ఇంకా అవినాష్ రెడ్డితో పాటు ఆయనతండ్రి భాస్కర్ రెడ్డి అఫిడవిట్లు వేయలేదు. అందుకే కేసును గురువారానికి వాయిదా వేసి.. వెంటనే అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే సీబీఐ కూడా దాఖలు చేసినందున ఈ విచారణ జరగనుంది. కోర్టు నిర్ణయం ఇవాళే వస్తుందా.. తర్వాత వస్తుందా అన్నది తెలియదు. కానీ సీబీఐ దర్యాప్తు చేస్తామని అంటోంది. బాధితులు దర్యాప్తు కోరుతున్నారు. కానీ నిందితులు మాత్రమే వద్దని అంటున్నారు.
దర్యాప్తు కొనసాగించడానికి దర్యాప్తు సంస్థ, బాధితులు రెడీ
అవినాష్ రెడ్డి అసలు విచారణ వద్దనే చెబుతారు. నిజానికి ఆయన.. ఆయన గ్యాంగ్.. తాము చెప్పిందే నిజమని ఇక విచారణ ఎందుకని చాలా సార్లు సాక్షి పత్రికల్లో రాయించారు. కేసును వివేకా కుమార్తె సునీత, ఆమె భర్తపైకి నెట్టేసి.. మొత్తం కుటుంబాన్ని లేకుండా చేయాలనుకున్నారు. కానీ కోర్టు సీబీఐకి ఇవ్వడంతో తేడా కొట్టింది. సీబీఐ అధికారులపై కేసులు పెట్టి.. ఎలాగోలా మేనేజ్ చేసి అరెస్టు కాకుండా తప్పించుకోగలిగారు. కానీ ఎల్లకాలం చట్టంతో, వ్యవస్థలతో ఆటాడలేరు.
దర్యాప్తు కొనసాగితే సంచలన విషయాలు వెలుగులోకి !
సీబీఐ తదుపరి విచారణ ప్రారంభిస్తే వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి.. ఇవన్నీ.. ఇప్పటికే సామాన్య ప్రజలకు తెలిసినవే. కానీ ఆధారాల రూపంలో సీబీఐ చెబితేనే వాటికి వ్యాలిడిటీ ఉంటుంది. అందుకే సీబీఐ కోర్టు తీసుకునే తీసుకునే నిర్ణయం.. మళ్లీ ప్రారంభం కావాల్సిన విచారణలపై రాష్ట్రమంతటా ఆసక్తి చూపుతోంది. న్యాయం కోసం సునీత కూడా దీర్ఘకాలంగా చేస్తున్న పోరాటానికి ప్రతిఫలం కోరుకుంటున్నారు.
