వివేకా హత్య కేసులో టీవీచానళ్లపై సీబీఐ గురి !

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు అసలు విషయాల కన్నా కొసరు అంశాలపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్లుగా కనిపిస్తోంది. తాజాగా వారు మీడియా ప్రతినిధుల్ని విచారిస్తున్నారు. అయితే అది అప్పట్లో ఎవరు ముందుగా గుండె పోటు అనిచెప్పారు.. ఎలా ప్రచారం చేశారు… హత్య అనితెలిసినా గుండెపోటుగా ఎందుకు ప్రచారం చేశారు అన్న అంశాలపై కాదు. ఇటీవల వాచ్ మెన్ గంగన్న కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఇదే ఆయన ఇచ్చిన వాంగ్మూలం అంటూ కొన్ని చానళ్లు ప్రసారం చేశారు. మరికొన్ని చానళ్లు అత్యుత్సాహనికి వెళ్లి షాడో బొమ్మలు చూపించాయి.

సీబీఐ అధికారులు ఈ వివరాలేమిటో.. వారికి ఎలా తెలిసిందో తెలుసుకోవాలని అనుకున్నారు. మీడియా ప్రతినిధులకు నోటీసులు జారీ చేసి ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఇప్పటికే పలు ఛానెళ్లకు నోటీసులు పంపినట్లుగా తెలుస్తోంది. వివేకా హత్య జరిగిన రోజు తాను ఇద్దరిని చూసినట్లు వాంగ్మూలంలో రంగన్న చెప్పారని అనేక టీవీ చానళ్లలో ప్రసారం అయింది. వాటి గురించే ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. వాంగ్మూలం ఇచ్చేటప్పుడు న్యాయమూర్తి తప్ప ఎవరూ ఉండరని ఎలా బయటకు తెలిసిందని సీబీఐ డౌట్ కావొచ్చని భావిస్తున్నారు.

అయితే సీబీఐ తీరుపై ఇప్పటికే అనేక రకాల విమర్శలు మీడియాలో వస్తున్నాయి. సంబంధం లేని వారిని ప్రశ్నిస్తున్నారని సాక్ష్యాలు తుడిచేసిన వారిని పట్టించుకోవడం లేదని.. అలాగే హత్యను గుండెపోటుగా నమ్మించిన వారిని కూడా ప్రశ్నించడం లేదనే విమర్శను సీబీఐ అధికారులు ఎదుర్కొంటున్నారు. అయితే సీబీఐ అధికారులు మాత్రం తమదైన శైలిలో అవి పట్టించుకోకండా మీడియా చూపించిన ఆ ఇద్దరు ఎవరంటూ నోటీసులు జారీ చేయడం.. టీవీ చానళ్ల ప్రతినిధుల్లోనూ విస్మయం వ్యక్తం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close