“టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల” జీవో సస్పెన్షన్ !

వివాదాస్పదంగా మారిన టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల జీవోను హైకోర్టు నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది. పాలక మండలితో పాటు విడిగా 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో జారీ చేసింది. అయితే ఇది ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1987కు విరుద్ధమని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. టీడీపీ, బీజేపీ నేతలతో పాటు పలువురు హిందూ సంస్థల ప్రతినిధులు కూడా పిటిషన్లు వేశారు.

వీటిపై విచారణ జరిపిన హైకోర్టు జీవోను నాలుగు వారాల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. టీటీడీ బోర్డును ప్రకటించినప్పటి నుండి తీవ్ర వివాదాస్పదమవుతోంది. రాజకీయ అవసరాల కోసం, లాబీయింగ్ చేసే వారిని, వివిధ కేసుల్లో ఉన్న వారిని పవిత్రమైన ఆలయంలో పాలక మండలి సభ్యులుగా చేర్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ట్రస్ట్ బోర్డును రద్దు చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం గవర్నర్ ను కలిసి ఇదే అంశం పైన ఫిర్యాదు చేశారు.

హైకోర్టును జీవోను సస్పెండ్ చేయడంతో పూర్తి స్థాయి పాలక మండలి సభ్యులుగా నియమితులైన 25 మందికి మాత్రమే పదవులు ఉంటాయి. ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన 52 మందికి పదవులు జీవో సస్పెన్షన్‌లో ఉన్నంత కాలం పెండింగ్‌లో ఉంటాయి. ప్రమాణం చేసిన వారి పదవులు కూడా పెండింగ్‌లో ఉన్నట్లే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంజాయి కట్టడికి కేసీఆర్ స్పెషల్ ఆపరేషన్ !

ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి వ్యవహారం రాజకీయ ప్రకంపనలకు కారణం అవుతోంది. ఏపీలోని విశాఖ మన్యం నుంచే గంజాయి దేశం మొత్తం రవాణా అవుతోందని ఐదారు రాష్ట్రాల పోలీసులు వస్తున్నారని స్వయంగా పోలీసు ఉన్నతాధికారులే చెబుతున్నారు....

చేతకాని దద్దమ్మలే తిడతారన్న సజ్జల !

ఏదైనా తమ దాకా వస్తే కానీ దెబ్బ రుచి తెలియదన్నట్లుగా ఉంది వైసీపీ నేతల పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంత కాలం ఇష్టం వచ్చినట్లుగా టీడీపీ నేతల్ని అమ్మనా బూతులు...

బ్రేకింగ్ : కోర్టు మెట్లెక్కిన సమంత

సమంత కోర్టుని ఆశ్రయించింది. తన పరువుకి భంగంవాటిల్లిందని పలు యూట్యూబ్‌ ఛానళ్లపై సమంత పరువు నష్టం దావా వేసింది. సుమన్‌ టీవీ, తెలుగు పాపులర్‌ టీవీతోపాటు సీఎల్‌ వెంకట్రావుపై కూకట్‌పల్లి కోర్టులో పిటిషన్‌...

‘ఆర్య’ని మారిస్తే ‘అల్లు’ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా ?

'ఆర్య'.. తెలుగు ప్రేక్షకులకు సుకుమార్ పరిచయం చేసిన హీరోయిక్ పాత్ర. ఆర్య సినిమాతోనే అల్లు అర్జున్ తొలి కమర్షియల్ విజయం దక్కింది. ఆర్యతోనే సుకుమార్ అనే దర్శకుడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు....

HOT NEWS

[X] Close
[X] Close