తెలకపల్లి రవి : సిబిఐ టు ఆర్‌బిఐ- బాసుకు బానిసలు కావలెను!

చిన్నపిల్లలు ఆటల్లో పేకమేడను కూల్చేసినట్టు ప్రధాని మోడీ హయాంలో వొకో వ్యవస్థ కల్లోలితమవుతున్నది. సుప్రీం కోర్టు, యూనివర్సీటీలు, ప్రణాళికా సంఘం, సెన్సార్‌బొర్డ్‌ ఇలా చెప్పలేనన్ని ఉదాహరణలు. తాజాగా సిబిఐలో సంక్షోభం చూసి దేశం నివ్వెరపోతుంటే అది ఇప్పుడు ఆర్‌బిఐ అంటే రిజర్వు బ్యాంక్‌కు విస్తరించింది. దేశంలో మొండి బాకీలను నియంత్రించడంలో ఆర్‌బిఐ విఫలమైందని ఆర్థిక మంత్రి ఆరుణ్‌జైట్లీ బహిరంగంగా విమర్శించడంతో గవర్నర్‌ ఊర్జిత్‌ పటేల్‌ రాజీనామాకు సిద్ధమైనారు. ఇంతకూ రఘురామ్‌ రాజన్‌ను తప్పించి ఈ పటేల్‌ను ఏరికోరి తెచ్చిపెట్టుకుంది మోడీనే! ఆ మాటకొస్తే సిబిఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ కూడా ఆయన ఎంపికే. కాని బాసుకు బానిసలు కావలెను అన్నట్టు మోడీ మహాశయులకు సంపూర్ణ విధేయత వున్నవారే నచ్చుతారు. అన్ని సంస్థలనూ ఆయనే ఆదేశిస్తారు. అందులో అణువంత తేడా వచ్చినా అంతే సంగతులు. ఆర్‌బిఐలో ఇప్పుడు చూస్తున్న కల్లోలం కూడా అందుకు మినహాయింపు కాదు ఆర్థికవేత్త మహల్నోబిస్‌ సూచనల మేరకు ఏర్పడిన భారతీయ రిజర్వ్‌ బ్యాంకు దేశానికి జీవనాడి. నగదు నియంత్రణ బ్యాంకింగు రుణాలు వడ్డీరేట్టు వంటివన్నీ క్రమబద్దం చేస్తుంది. అయితే మోడీ హఠాత్తుగా నోట్ల రద్దు చేయాలనుకున్నప్పుడు రఘురాం రాజన్‌ వారించారు. అందుకే ఆయనను పక్కకు పెట్టి తనే మీడియాలో ప్రకటించారు. నోట్ల రద్దుతో వందమంది ప్రాణాలు కోల్పోగా దేశమే అల్లాడిపోయింది. ఇప్పటికి ఏటిఎంలు దారికి రాలేదు. నల్లడబ్బు అదుపు పేరిట తీసుకున్న ఈ చర్య ఏ మేరకు లక్ష్యం సాధించిందంటే ప్రభుత్వం జవాబివ్వలేదు. పార్లమెంటరీ స్థాయి సంఘం ముందు అనివార్యంగా ఆలస్యంగా ఊర్జిత్‌ పటేల్‌ ఇచ్చిన సమాధానంతో అసలు సంగతి తెలిసింది. రద్దయిన నోట్లన్నీ తిరిగొచ్చేశాయి తప్ప ఆశించిన లక్ష్యం నెరవేరలేదని తెలిసిపోయింది. ఊర్జిత్‌ పటేల్‌ ఈ వివరాలు బయిటపెట్టడం ఏలిన వారికి మింగుడుపడలేదు. నోట్లరద్దు తర్వాత పేటిమ్‌, క్రెడిట్‌ డెబిట్‌ కార్డుల వినియోగం అనివార్యంగా పెరిగింది. వీటిని ఆర్‌బిఐ పరిధినుంచి తప్పించేందుకు పిఆర్‌బి పేరిట వేరే వ్యవస్థ ఏర్పాటు చేయాలని మోడీ ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి కార్డుల రూపంలో వున్నా అదీ నగదే గనక ఈ నిర్ణయం ఆర్‌బిఐ వ్యవస్థను తగ్గించడమేనని వారు అంగీకరించలేదు. రూపాయి విలువ పడిపోయి న్నప్పుడు తన దగ్గరున్న డాలర్‌ నిల్వలు విడుదల చేస్తామని ఆర్‌బిఐ అంటే ప్రభుత్వం అందుకు అనుమతించలేదు.పెట్రోలు రేట్లు పెరుగుతున్నా ఆ కంపెనీలకు డాలర్ల విక్రయంలో ఆర్‌బిఐ పాత్రే లేకుండా పోయింది. పైగా వారిదగ్గరున్న నిల్వలను తన ఖజానాకు తరలించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆర్‌బిఐ పాక్షికంగా అంగీకరంచవలసి వచ్చింది.ఈ పరిస్థితిపై కొద్ది రోజుల కిందట డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య విచారం వెలిబుచ్చితే ఆర్‌బిఐ బోర్డులో ప్రభుత్వం నియమించిన బిజెపి నేత గురుమూర్తి ఫిర్యాదు చేశారు మోడీ హయాంలోనే రెండు లక్షల కోట్లకు పైగా పెరిగిపోయిన మొండి బకాయిలు ఎన్‌పిఎలకు రాజకీయ బాధ్యత తీసుకోకుండా అది కూడా ఆర్‌బిఐ వైఫల్యమని అరుణ్‌జైట్లీ నోరు పారేసుకోవడంతో ఘర్షణ తారాస్థాయికి చేరింది. ఆర్‌బిఐకి పూర్తి స్వతంత్రమిచ్చి తన అదుపులో పెట్టుకోవాలన్నది ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల వ్యూహం. రాజకీయంగా తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలన్నది మోడీ ఆలోచన. ఈ రెంటికీ మధ్యన ఈ కీలక సంస్థను కాపాడుకోవడం పెద్ద సవాలు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీలో “వన్ ఇయర్” మార్పు..! సజ్జలే నెంబర్ టూ..!?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ ఎవరు అంటే.. అందరూ.. ఎంపీ విజయసాయిరెడ్డి పేరును మొదటి ఆప్షన్‌గా పెడతారు. ఎందుకంటే.. అంత క్రియాశీలకంగా ఉంటారు ఆయన. అటు ఢిల్లీలో పరిస్థితుల్ని...

బీజేపీ గవర్నరేగా సంతకం పెట్టింది..! ఎలా స్వాగతిస్తున్నారు..?

ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్‌ను తొలగిస్తూ.. తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని..హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ నేతలు కూడా.. పోటీలు పడి స్వాగతించారు. ఢిల్లీలో జీవీఎల్ నరసింహారావు దగ్గర నుంచి...

ఫిరాయించిన ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు..!?

మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లు విషయంలో మండలిలో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయకుండా.. వైసీపీ గూటికి చేరిపోయిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డిలపై అనర్హతా వేటు వేయడానికి టీడీపీ రంగం సిద్ధం చేసుకుంది....

ఏడాది యాత్ర 11 : అంచనాలు ఎక్కువ… ఆచరణ తక్కువ..!

ఇంత ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ తట్టులేకపోతున్నాను భయ్యా..! .. అంటాడు ఓ సినిమాలో హీరో. నిజంగానే ఆ సినిమాకు హైప్ ఓ రేంజ్‌లో వచ్చింది. ఎంతగా అంటే.. సినిమా ఎంత అద్భుతంగా తీసినా .....

HOT NEWS

[X] Close
[X] Close