సూరేకాంతం లేకుండానే ‘గుండ‌మ్మ క‌థ‌’

గుండ‌మ్మ క‌థ‌ని రీమేక్ చేయాల‌ని ఎన్టీఆర్‌, నాగ‌చైత‌న్య అనుకున్నారు. ఎన్టీఆర్ పాత్ర‌కు జూనియ‌ర్‌, ఏఎన్నార్‌గా నాగ‌చైత‌న్య రీప్లేస్ చేసేస్తారు. మ‌రి గుండ‌మ్మ‌గా ఎవ‌రు న‌టిస్తారు? ఇక్క‌డే ఈ రీమేక్ ఆగిపోయింది. ‘గుండ‌మ్మ లేదు కాబ‌ట్టి.. మేం ఆ సినిమా చేయ‌లేక‌పోయాం’ అని ఈ హీరోలిద్ద‌రూ చేతులెత్తేశారు. గుండ‌మ్మ‌గా సూరేకాంతం చూపించిన ఇంపాక్ట్ అదీ. ఆ పాత్ర‌కు రీప్లేస్‌మెంట్ లేదు.. రాదు.

స‌రిగ్గా ‘ఎన్టీఆర్‌’ బ‌యోపిక్‌లోనూ ‘గుండ‌మ్మ‌’ పాత్ర అవ‌స‌ర‌మైంది. ఎన్టీఆర్ బ‌యోపిక్ అంటే.. ఆయ‌న స‌మ‌కాలీన న‌టీన‌టుల్ని చూపించాలి. అంద‌రూ కాక‌పోయినా.. ఉద్దండుల్ని తెర‌పైనే కాసేప‌యినా చూపించాలి. గుండ‌మ్మ కోసం చిత్ర‌బృందం కూడా గాలించింది. కానీ సూరేకాంతంని రీప్లేస్ చేయ‌డం వారి వ‌ల్ల కాలేదు. అందుకే సూరేకాంతం పాత్ర‌ని లేకుండా చేశారు. ‘ఎన్టీఆర్‌’ బ‌యోపిక్ లో గుండ‌మ్మ క‌థ‌కు సంబంధించిన ఓ సీన్‌ని షూట్ చేశారు. కానీ అందులో తెలివిగా సూరేకాంతం పాత్ర‌ని స్కిప్ చేశారు. సూరేకాంతం లేని షాట్‌ని బాల‌కృష్ణ, సుమంత్‌ల‌పై తెర‌కెక్కించారు. కాంతారావు పాత్ర కూడా ఎన్టీఆర్ బయోపిక్‌లో క‌నిపించ‌ద‌ని టాక్‌. మోహ‌న్‌బాబు పాత్ర కూడా ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఉండ‌క‌పోవొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close