భార్యను వదిలేసిన మోడీకి కుటుంబమంటే ఏం తెలుసు..? : చంద్రబాబు

లోకేష్ తండ్రి చంద్రబాబు అంటూ గుంటూరు సభలో నరేంద్రమోడీ వ్యక్తిగత విమర్శలు చేయడంపై… టీడీపీ అధినేత తీవ్రంగా స్పందించారు. ‘మీకు కొడుకుల్లేరు. పెళ్లాన్ని వదిలేశారు. కుటుంబం అక్కర్లేదు. అనుబంధాలు, ఆత్మీయతలు తెలియవు’ అని మండిపడ్డారు. తాను వ్యక్తిగత విమర్శలకు దూరమని, కానీ మోదీ వ్యక్తిగత విమర్శలకు దిగడంతోనే తాను సమాధానం ఇవ్వాల్సి వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. తాను కుటుంబ పెద్దగా గర్వపడతానని ప్రకటించారు. తనను లోకేష్ తండ్రిగా సంబోధించినందుకు గర్వపడుతున్నానని ప్రకటించారు. అంతటితో ఆగలేదు.. మోడీ తీరుపై నేరుగా ఎటాక్ చేశారు. మోడీకి కుటుంబం లేదు, పిల్లలు లేరు… భార్యకు విడాకులు కూడా ఇవ్వకుండా వదిలేశారు.

కుటుంబ బాధ్యతలు, విలువలు ఏవీ ఆయనకు తెలియదని విమర్శించారు. తాను రాష్ట్రంలో ప్రజలందరికి కుటుంబ పెద్దగాఉన్నాని.. కోటి మండి ఆడబిడ్డలకు అండగా ఉన్నా… గర్వపడుతున్నానన్నరు. ఏపీలో ఉండే అన్ని కుటుంబాలకు పెద్దగా నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నానన్నారు. తన రాజకీయం మీద నా కుటుంబసభ్యులు ఆధారపడలేదని గుర్తు చేశారు. ఓ బాధ్యత గల తండ్రిగా లోకేష్‌ని స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో చదివించానన్నారు. కుటుంబ బంధాలు, బాధ్యతల గురించి ఏ మాత్రం తెలియని మోడీ.. తన కుటుంబంపై వ్యక్తిగతంగా దాడి చేయడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాధారణంగా చంద్రబాబు.. వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉంటారు. అయితే.. ప్రధాని హోదాలో గుంటూరుకు వచ్చిన నరేంద్రమోడీ… నేరుగా.. చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేసి.. అత్యంత దారుణంగా… ఫాదర్ ఆఫ్ లోకేష్.. చంద్రబాబు అంటూ.. వెటకారంగా మాట్లాడుతూ.. వికృతానందాన్ని పొందే ప్రయత్నం చేయడంతో.. చంద్రబాబు కూడా రివర్స్ అయ్యారు. మోడీ వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నించారు. పెళ్లి చేసుకుని విడాకులు కూడా ఇవ్వకుండా.. మోడీ భార్యను వదిలేయడాన్ని ప్రశ్నించారు. దీంతో… వ్యక్తిగత విమర్శలకు.. వ్యక్తిగత విమర్శతోనే కౌంటర్ ఇచ్చినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com