ఆర్జీవీ ఎన్టీఆర్ పై బ్రహ్మాస్త్రం ఇదేనా?

ఆర్జీవీ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ ను చకచకా రెడీ చేస్తున్నారు. సందేహం లేదు. ఇందులో ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్లను, చంద్రబాబు భయంకరంగా టార్గెట్ చేస్తారు. దర్శకులు క్రిష్ లాగానో, మహీ లాగానో సున్నితంగా భావోద్వేగాలు మేళవించి చెప్పరు. ఎక్కడో కర్ర గుచ్చినట్లే వుంటుంది వర్మ వ్యవహారం. 

మరి దీనిని ఎలా అడ్డుకుంటారు? సెన్సారు ద్వారా అడ్డుకోవడం సాధ్యం అవుతుందా? ఎందుకంటే ఆంధ్రకు ప్రత్యేకంగా సెన్సారు బోర్డు లేదు. హైదరాబాద్ లోనే వుంది. పైగా సెన్సారు అన్నది కేంద్రం అదుపాజ్ఞలలో వుంటుంది. అందువల్ల ఆ కోణంలో అడ్డంకులు పెద్దగా వుండవు.

మరి అలా అని చూస్తూ, చూస్తూ ఆ సినిమాను అలా వదిలేస్తారా? లేక ఆంధ్రలో ప్రభుత్వం వుంది కనుక, నిషేథం విధిస్తారా? అదేమైనా లాభసాటిగా వుంటుందా? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల ఆలోచన వేరుగా వుందని తెలుస్తోంది

”..మా నాన్న కథ, మా కుటుంబం కథ, మా ఫ్యామిలీ వ్యవహారం సినిమాగా తీసి రచ్చ చేసే హక్కు ఎవరు ఇచ్చారు..” ఇదీ నందమూరి ఫ్యామిలీ కోర్టుల ద్వారానో? మరో విధంగానో వ్యక్తం చేయబోయే అభ్యంతరం అని తెలుస్తోంది. ఒక విధంగా అది పాయింట్ నే కూడా. కుటుంబ సభ్యులు అది కూడా వాళ్ల పాత్రలను తెరకెక్కించాలంటే సంబందిత జనాల అనుమతి వుండాలి కదా? కోర్టు కూడా ఇదే అడిగితే అప్పుడు పరిస్థితి ఏమిటి?

అందుకే నందమూరి ఫ్యామిలీ ముఖ్యంగా బాలయ్య ఇప్పుడు సైలంట్ గా వున్నట్లు తెలుస్తోంది సరైన సమయం చూసి, ఈ ఫ్యామిలీ పర్మిషన్, ఫ్యామిలీ ప్రైవసీ హక్కుల పాయింట్ ద్వారా సినిమాను ఆపించే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొత్త హీరోయిన్ల తలరాతలు మారుస్తున్న రాంగోపాల్ వర్మ

సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ రావడం అన్నది అంత ఆషామాషీ కాదు. వందల మంది ఆర్టిస్టులు బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నా, టాలెంట్ విషయంలో కొదువ లేకపోయినా, అదృష్టం కలిసి రాక, సరైన గాడ్ ఫాదర్...

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

HOT NEWS

[X] Close
[X] Close