నూటఏడవ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేద్దాం….!

✍ సమాజ మార్పులో భాగంగా వేటలో, అభివృద్ధిలో, అన్నింటిలో ముందుండి పోరాడిన మహిళ, దోపిడీ శక్తుల అవిర్భావంతో పురుషాధిక్య బావజాలంతో వెనక్కి నెట్టబడింది. తిరిగి 18వ శతాబ్దంలో ప్రపంచంలో దోపిడీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టు ప్రణాళిక ఆవిర్భావంతో శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో తనదైన ముద్ర వేసుకుని ముందుకు నడిచింది. ఆ క్రమంలో క్లారాజట్కిన్‌తో సహా అనేక మంది ఆ పోరాటాల్లో మహిళలకు నాయకత్వం వహిస్తూ ప్రపంచ మహిళలను ఏకం చేసి, మా హక్కులకోసం పోరాడే ఒక రోజు కావాలని ఆకాక్షించారు. వారి పోరాటఫలితమే మార్చి8 మహిళాదినోత్సవం.

👉 ఆ రోజుల్లో కర్మాగారాల్లో పనిచేసే మహిళలు 18గంటలు పనిచేసేవారు. ఎటువంటి కనీస సౌకర్యాలు లేని దుర్భర జీవితం గడిపేవారు. యజమానులు కూృరంగా హింసించేవారు. గర్భం దాల్చిన సమయంలో ప్రసవ సమయాల్లో వేగంగా పని చేయకపోతే పనిలోంచి గెంటేసేవారు. పని పోతుందనే భయంతో పుట్టిన బిడ్డల్ని రహస్యంగా పెంచుకోవడం లేదా చంపివేసేవారట. ఇంత దీనస్థితినుంచి బయటపడ్డానికి మనకు దొరికిన ఆయుధం మార్చి8. 1910లో కొపెన్‌ హెగెన్‌లో మార్చి8 మహిళల హక్కులరోజుగా ప్రకటించ బడింది.

ప్రపంచమంతటా ప్రజలు హక్కులకోసం ఉద్యమించారు. సామ్రాజ్యవాదుల కోటలు బద్దలుకొట్టి సోవియట్‌ రష్యా మరో 15 దేశాల్లో సోషలిస్టు రాజ్యాలు అధికారంలోకి వచ్చాయి. ఆ సమయంలోనే మహిళా ఉద్యమాలు తమ డిమాండ్స్‌ను సాధించుకోవటం మొదలైంది. హిందూవారసత్వ చట్టం బిల్లుకోసం 1956 పార్లమెంటులో బాబాసాహెబ్‌ అంబెద్కర్‌ తన మంత్రి పదవికే రాజీనామా చేసారు. స్త్రీల ఓటుహక్కు 1920 ప్రాంతంలో సాధించుకున్నారు. వరకట్న నిషేధచట్టం 1961, సమాన పనికి సమాన వేతన చట్టం 1976, కుటుంబ కోర్టుల చట్టం 1984, వరకట్న చట్టానికి సవరణల చట్టం 1985, మహిళల అసభ్య చిత్రీకరణ నిరోదక చట్టం 1986, మహిళలకు విద్య, ఉద్యోగాలలో 33శాతం రిజర్వేషన్లు, 73,74 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు 1992, స్త్రీలకు సమాన ఆస్తిహక్కు చట్టం 1986, భ్రూణహత్యల నిరోధకచట్టం (పీయన్‌డీటీ యాక్ట్‌) 1994, ర్యాగింగ్‌ నిరోధక చట్టం 1997, గృహహింస నిరోధక చట్టం 2005లో సాధించుకోగలిగారు. 1948నుంచి జరిగిన తెలంగాణ సాయుధపోరాటం మహిళల హక్కులను ఎలుగెత్తి చాటింది. వెట్టిచాకిరి వ్యతిరేకచట్టం కోసం పోరాడింది. అటవీ సంపదలపై పన్నులకు వ్యతిరేకంగా దొరల పెత్తనానికి దోపిడీకీ వ్యతిరేకంగా జరిపిన ఉద్యమాలు అన్ని తరగతుల మహిళల్లో దైర్యాన్ని నింపాయి.

👉 ఆ స్ఫూర్తితోనే మహిళ నాయకత్వం ముందుకు సాగుతున్నది. దేశంలో అంగన్‌వాడీ స్కీంను బలోపేతం చేయాలని, వారిని ఉద్యోగులుగా గుర్తించాలని అంగన్‌వాడి యూనియన్‌కి ఐద్వా మద్దతుగా నిలిచింది. వ్యవసాయ కూలి వేతనాలు పెంచాలని, ఇండ్ల స్థలాలకు జాయింటు పట్టాలు, తండ్రి ఆస్తిలో కూతురికీ కొడుకుతో సమాన వాటకోసం నినదించింది. తెలంగాణ ప్రాంతంలో జోగిని బస్విని వ్యవస్థ నిర్మూలనకై తెచ్చిన జోగిని వ్యతిరేకచట్టం మహిళ నాయకత్వ పోరాట ఫలితమే. 100రోజుల పనిలో మూడోవంతు పనిదినాలకోసం, పనిప్రదేశాల్లో లైంగిక వేదింపుల నిరోదక బిల్లుకోసం ఐద్వా పోరాడింది. ఇటీవల 498ఎ కి వ్యతిరేకంగా సాగిన దుష్ప్రాచారాన్ని మహిళ నాయకత్వం ఎండగట్టింది. మహిళల ఆత్మగౌరవానికి బంగం కలిగే వ్యాఖ్యల్ని సామెతల్ని సహించేది లేదని ఐక్య మహిళా వేదికలు ఏర్పడ్డాయి. నిర్భయ ఘటనతో దేశంలో ప్రధాని, రాష్ట్రపతితో సహా పలువురు సమాధానం చెప్పవల్సిరావటం ఉద్యమాల ఫలితమే. ఇన్ని సాధించినా స్త్రీకి పూర్తి విముక్తి లభించలేదు. ఆటంకాల్ని అదిగమిస్తున్నకొద్ది నూతన పద్ధతుల్లో అణచివేతకు గురవుతున్నారు. నూతన ఆర్థిక రాజకీయ విధానాలు స్త్రీలను అడకత్తెరలో పోకచెక్కలా నలిపేస్తున్నాయి. నిరక్షరాస్యత, నిరుద్యోగం, ఉపాధిలేమి, సామాజిక వివక్షత, అత్యాచారాలు, దిగజారుతున్న విలువలు మహిళల ప్రగతికి ఆటంకంగా వున్నాయి.

ఐక్యంగా పోరాడితే ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. నారపీచు విడిగాఉంటే గాలికి ఎగిరిపోతుంది. ఐక్యంగా ఉంటే తాడుగా తయారై ఎనుగును సైతం బంధిస్తుంది. మార్చి8 స్ఫూర్తితో మరింత సంఘటితంగా, కదల౦డి కదిలి౦చ౦డి, నినదిచ౦డి, సాధి౦చ౦డి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close