ఆన్ లైన్ జూదం:  ఇరుక్కున్న త‌మ‌న్నా, రానా

ఆన్ లైన్ లో జూదం విజృంభిస్తోంది. ర‌మ్మీ, డ్రీమ్ 11 ఇలా.. ర‌క‌ర‌కాల పేర్ల‌తో… ద‌ర్జాగా వెలిగిపోతోంది. దీని ప్ర‌చారానికి స్టార్ హీరోలు, క్రికెట‌ర్లు కూడా దిగిపోతున్నారు. ఆన్ లైన్ జూదాన్ని నిషేధించాల‌ని కొంత‌కాలంగా ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. తాజాగా.. ఆన్ లైన్ ర‌మ్మీని నిషేధించాలంటూ త‌మిళ‌నాడు హైకోర్టులో ఓ పిటీష‌న్ దాఖ‌లు అయ్యింది. దానిపై న్యాయ స్థానం విచార‌ణ చేప‌ట్టింది. ఆన్ లైన్‌లో జూదం ఆడుతూ, చాలా మంది ల‌క్ష‌లు పోగొట్టుకుంటున్నార‌ని, కొంత‌మంది అప్పులు తీర్చ‌లేక ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని పిటీష‌న్‌లో పేర్కొన్నారు. అంతేకాదు… వీటి ప్ర‌చారంలో స్టార్ హీరోలు, క్రికెట‌ర్లు పాల్గొంటున్నార‌ని, వాళ్ల‌ని చూసి యువ‌త‌రం జూదంపై మోజు పెంచుకుంటోంద‌ని ఆ పిటీష‌న్‌లో ప్ర‌స్తావించారు.

 ఆన్ లైన్ ర‌మ్మీ, డ్రీమ్ 11 ప్ర‌చారం చేస్తున్న సెల‌బ్రెటీలలో త‌మ‌న్నా, రానా, సుదీప్‌, ప్ర‌కాష్ రాజ్‌, కొహ్లి, గంగూలీ లాంటివాళ్లున్నారు. వీళ్లంద‌రికీ ధర్మాస‌నం నోటీసులు పంపింది. యువ‌త‌రాన్ని జూదం ఆడేలా ప్రేరేపిస్తున్నార‌ని, దీనిపై స‌మాధానం ఇవ్వాల‌ని కోర్టు ఆదేశించింది. అస‌లు ఆన్ లైన్ జూదాన్ని నిషేధించేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుందా, లేదా? అని త‌మిళ నాడు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిచింది. ఇప్ప‌టికే ఆంధ్ర‌, తెలంగాణ ప్ర‌భుత్వాలు డ్రీమ్ 11ని నిషేధించాయి. మిగిలిన రాష్ట్రాలూ ఈ దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. కోర్టు అక్షంత‌లు వేసిన నేప‌థ్యంలో.. ఇక‌పై సెల‌బ్రెటీలూ ఇలాంటి వాటికి ప్రచారం చేయాలంటే ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించుకోవాల్సిందే. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.....

విచారణకు రాను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు తాను హాజరు కావడం లేదని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి...

మళ్లీ ఉద్యోగుల పోరాటం ప్రభుత్వానికి తాకట్టు !

ఎన్నికలకు ముందు ఉద్యోగ నేతలు ఆందోళనలు అంటూ హడావుడి చేశారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని.. ఏమీ చేయకపోయినా ఏదో ఇచ్చినట్లుగా హడావుడి చేయడానికని మొదటి నుంచి అనుమానాలుననాయి. ఇప్పుడు అదే నిజం...

అభిప్రాయం : జనసేన శ్రేణుల అంతర్మధనం

2024 ఎన్నికల రాజకీయ వేడి రాజకుంది. తెలుగు దేశం పార్టీజనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న పొత్తు లో భాగం గా జనసేన 24 ఎమ్మెల్యే సీట్ల లో పోటీ చేస్తుందని చంద్రబాబు -పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close