ఆ సినిమాల‌కు సెన్సార్ స‌మ‌స్య‌

ఓ పెద్ద‌ సినిమా వ‌స్తోందంటే.. ఏదో ఓ రూపంలో దాన్ని ఆపడానికి ఓ వ‌ర్గం ఎప్పుడూ ప్ర‌య‌త్నిస్తుంటుంది. వాళ్లు చేసే ప్ర‌య‌త్నాల వ‌ల్ల సినిమా ఆగిపోదు గానీ, ప‌రోక్షంగా బోలెడంత ప‌బ్లిసిటీ వ‌స్తుంటుంది. ఇప్పుడు ఓ రెండు సినిమాల‌పై కూడా ఇలాంటి వివాదమే రేగ‌నుంది. ఆ సినిమాలే.. ఆచార్య‌, విరాట‌ప‌ర్వం.

చిరంజీవి న‌టించిన `ఆచార్య‌`కీ.. రానా చేసిన `విరాట‌ప‌ర్వం`కీ ఓ పోలిక ఉంది. రెండూ న‌క్స‌ల్ నేప‌థ్యంలో సాగే క‌థ‌లే. ఈ రెండు సినిమాల్లోనూ హీరోలు న‌క్స‌లైట్ల‌గా క‌నిపించ‌నున్నారు. ఆయా క‌థ‌ల్లో అభ్యుద‌య భావాలు ఉంటాయ‌న్న సంగతి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇలాంటి సినిమాల వ‌ల్ల‌, స‌మాజం చెడిపోతుంద‌ని, యువ‌త‌రానికి త‌ప్పుడు సంకేతాలు అందుతాయ‌ని, కాబ‌ట్టి ఈ సినిమాల్ని సెన్సార్ చేయ‌కుండా ఆపాలంటూ.. యాంటీ టెర్ర‌రిజం ఫార‌మ్ అనే సంస్థ ఓ విన‌తి ప‌త్రం సమ‌ర్పించింది. ఈ సినిమా విడుద‌లైతే మాత్రం థియేట‌ర్ల ముందు త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేస్తామ‌ని, విడుద‌ల‌ను అడ్డుకుంటామ‌ని తెలిపింది. అయితే దీన్ని సెన్సార్ ఎంత సీరియ‌స్ గా తీసుకుంటుందో చూడాలి.నిజానికి సినిమాలో ఏముంద‌న్న విష‌యం సెన్సార్ అయితే గానీ తెలీదు. న‌క్స‌ల్ ఉద్య‌మ నేప‌థ్యంలో ఇంత‌కంటే భ‌యంక‌ర‌మైన, ప్ర‌భావవంత‌మైన సినిమాలు ఇది వ‌ర‌కూ వ‌చ్చాయి. కానీ.. ఎవ్వ‌రూ వాటిని ఆప‌లేదు. ఈ రెండు సినిమాలూ అందుకు మిన‌హాయింపు మాత్రం కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close