‘ఐకాన్‌’కి అడ్డు లేన‌ట్టే..!

ఏంసీఏ హిట్టు త‌ర‌వాత‌.. `ఐకాన్` అనే స‌బ్జెక్టు త‌యారు చేసుకున్నాడు వేణు శ్రీ‌రామ్. కొత్త క‌థ‌లు చేద్దాం, ప్ర‌యోగాలు చేద్దాం… అనే మూడ్ లో ఉన్న అల్లు అర్జున్‌కి అప్ప‌ట్లో ఆ క‌థ బాగా న‌చ్చింది. దిల్ రాజు నుంచి ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. కానీ.. మ‌న‌సు మార్చుకున్న బ‌న్నీ.. ఆ ప్రాజెక్టు హోల్డ్ లో పెట్టాడు. ఈమ‌ధ్య దిల్ రాజు కూడా `ఐకాన్ సినిమా ఉంది` అని హింట్ ఇచ్చారు. కానీ ష‌రతు ఒక్క‌టే. `వ‌కీల్ సాబ్‌` హిట్ట‌వ్వాలి. ఆ సినిమా హిట్ట‌యితే, ద‌ర్శ‌కుడిగా వేణు శ్రీ‌రామ్ కి పేరొస్తుంది. అది `ఐకాన్‌`కి ప్ల‌స్ అవుతుంది. అందుకే.. వ‌కీల్ సాబ్ రిజ‌ల్ట్ కోసం బ‌న్నీ కూడా వెయిటింగ్ లో ఉన్నాడ‌ని టాక్‌.

ఇప్పుడు వ‌కీల్ సాబ్ వ‌చ్చేసింది. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెచ్చేసింది. ఓవ‌రాల్ గా ఈ సినిమాకి హిట్.. సూప‌ర్ హిట్ టాక్ న‌డుస్తోంది. సో.. వేణు శ్రీ‌రామ్ త‌దుప‌రి సినిమాకి హీరోల వెంట ప‌డాల్సిన ప‌నిలేదు. `ఐకాన్‌` క‌థ ఎలాగూ రెడీగానే ఉంది. బ‌న్నీ ఓకే అనాలి అంతే. కాక‌పోతే.. దిల్ రాజు ద‌గ్గ‌ర రెండో ఆప్ష‌న్ కూడా ఉంద‌ని టాక్‌. బ‌న్నీ కాక‌పోయినా, మ‌రో స్టార్ హీరోతో అయినా ఈ ప్రాజెక్టు మొద‌లెడ‌దామ‌నుకుంటున్నాడ‌ట‌. వేణు శ్రీ‌రామ్ త‌దుప‌రి ప్రాజెక్టు.. `ఐకాన్‌` అయ్యే అవకాశాలే పుష్క‌లం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close