నవరత్నాల్లో కేంద్ర నిధులున్నాయని బీజేపీకి ఇప్పుడే గుర్తొచ్చిందా..?

భారతీయ జనతా పార్టీ నేతలు.. ఏడాది తర్వాత ఏపీ సర్కార్‌పై కాస్త విమర్శలు ప్రారంభించారు. ఇప్పుడు విమర్శలకు వారు ఎంచుకున్న అంశం.. ఏపీ సర్కార్ అమలు చేస్తున్న పథకాల్లో కేంద్ర నిధులు ఉండటం. కేంద్రం ఇస్తున్న నిధులలతో పథకాలు అమలు చేస్తూ.. ముఖ్యమంత్రి జగన్ బొమ్మ వేసుకుంటున్నారని.. బీజేపీ నేతలు తాజాగా ఆరోపించడం ప్రారంభించారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి … చిరు వ్యాపారులకు రూ. పదివేల వరకూ.. పూచీకత్తు లేని రుణాలను ఇచ్చే పథకాన్ని ప్రవేశ పెట్టారు. కోవిడ్ కారణంగా వ్యాపారాలు లేని.. తోపుడు బండ్లు.. చిన్న చిన్న టీస్టాల్స్ నిర్వాహకులకు ఈ లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే.. ఇది ఇస్తోందని కేంద్రమని.. జగన్మోహన్ రెడ్డి తన ఫోటో వేసుకుంటున్నారని బీజేపీ నేతలు తెర ముందుకు వచ్చారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర ప్యాకేజీలో భాగంగా.. ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. పీఎం స్వానిధి పేరుతో… అమలు చేయడం ప్రారంభించారు. ఏపీలో ఆ పీఎం స్వానిధి కాస్తా.. జగన్నతోడుగా మారిందని.. బీజేపీ నేతలు మండిపోతున్నారు. ఏపీ సర్కార్ తీరుపై.. కేంద్రానికి ఫిర్యాదు చేశామని అంటున్నారు. కేంద్ర నిధులతో పథకాలు అమలు చేస్తూ.. స్టిక్కర్ సీఎంగా మారిపోయారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకపై కేంద్ర నిధులతో నడిచే పథకాలకు.. ముఖ్యమంత్రి ఫోటోతో పాటు.. ప్రధానమంత్రి ఫోటో కూడా వాడాలని.. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

అయితే… కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు..అత్యధికం వయా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానే అమలవుతూ ఉంటాయి. కొన్ని మాత్రం కేంద్రం నేరుగా అమలు చేస్తూ ఉంటుంది. అయితే అవిచాలా తక్కువ. పీఎం కిసాన్ యోజన లాంటి పథకాలు నేరుగా అమలు చేస్తోంది. అయితే.. ఏపీ సర్కార్.. దాన్ని కూడా.. రైతు భరోసాలో కలిపేసి… తామే అమలు చేస్తున్నట్లుగా ప్రకటనలు చేస్తోంది. కేంద్రం నేరుగా నిధులు రైతుల ఖాతాల్లో వేస్తున్నప్పటికీ.. అది జగన్ సర్కారే వస్తున్నట్లుగా ప్రచారం చేస్తోంది. ఇది గత ఏడాది నుంచి జరుగుతోంది. ఈ ఏడాది రైతు భరోసా నిధులు విడుదల చేసినప్పుడు.. మోడీ బొమ్మ కూడా ప్రకటనల్లో వేయలేదు. అప్పుడు కనీసం.. బీజేపీ నేతలు మాట్లాడలేదు.

కరోనా సహాయ చర్యల నిమిత్తం.. కేంద్రం ఉచితంగా ఇస్తున్న రేషన్, రూ. వెయ్యి సాయం కూడా.. జగనే ఇచ్చారని వాలంటీర్లు.. వైసీపీ నేతలు ఊరూరా ప్రచారం చేశారు. అది కేంద్రం ఇచ్చిన నిధులని.. టీడీపీ నేతలు రచ్చ చేశారు కానీ… బీజేపీ నేతలు మాత్రం నోరు మెదపలేదు. ఇప్పుడే గుర్తొచ్చినట్లుగా కొత్తగా విమర్శలు ప్రారంభించారు. అదీ కూడా.. బీజేపీలోని ఓ వర్గమే వైసీపీకి అనుకూలంగా ఉండేవారు మాత్రం.. నోరు మెదపడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ రాజధానిపై కేంద్రం తేల్చేసింది..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో కేంద్రానికి సంబంధం లేదని.. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని... కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని అంశం కేంద్ర పరిధిలోనిదా.. రాష్ట్ర పరిధిలోనిదా...

రఘురామకృష్ణరాజుకు వై కేటగిరీ సెక్యూరిటీ..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేంద్ర బలగాలు రక్షణ కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనకు వై కేటగిరి సెక్యూరిటీ కల్పించినట్లుగా సమాచారం అందిందని.. అధికారిక ఆదేశాలు ఒకటి రెండు రోజుల్లో వస్తాయని రఘురామకృష్ణరాజు మీడియాకు...

దళిత నేతలతోనే న్యాయస్థానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు..! వైసీపీ స్ట్రాటజీ ఏంటి..?

వైసీపీ రాజకీయ వ్యూహం.. న్యాయవ్యవస్థపై సామాజిక పద్దతుల్లో అమలు చేస్తున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని... దళితుల్ని అడ్డు పెట్టుకుని.. న్యాయవ్యవస్థపై విమర్శలు చేసి.. ఒత్తిడి పెంచే...

రామాలయ భూమిపూజ లైవ్ ఇవ్వని ఎస్వీబీసీ..! బీజేపీ విమర్శలు..!

అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ చూసేలా.. ఏర్పాట్లు చేశారు. చివరికి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లోనూ... ప్రసారం చేశారు. అయితే.. అనూహ్యంగా... తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి...

HOT NEWS

[X] Close
[X] Close