డిప్యూటీ సీఎంకు ఏపీ కోవిడ్ వైద్యం నచ్చలేదా..?

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి ఆంజాద్ భాషా కుటుంబానికి కరోనా సోకింది. కొద్ది రోజుల నుంచి ఈ ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి .. వైయస్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు ఇడుపుల పాయ వెళ్లినప్పుడు కూడా.. ఆయనకు అంజాద్ భాషా స్వాగతం చెప్పిన వారిలో కనిపించలేదు. దాంతో… ఆయనకు కరోనా సోకిందన్న ప్రచారం ఉద్ధృతం అయింది. నాలుగు రోజుల తర్వాత ఆయనకు కరోనా సోకిందని.. తిరుపతి ఆస్పత్రిలో చేరారని ప్రకటించారు. అయితే.. సాయంత్రానికి ఆయన కుటుంబం.. తిరుపతి ఆస్పత్రి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయింది. అక్కడ ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో.. చేరినట్లుగా తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. పలువురు ప్రముఖులకూ కరోనా సోకింది. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న వారు.. ఉన్నతాధికారులు కూడా కరోనా బారిన పడ్డారు. వీరిలో ఎవరూ… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందడానికి ఆసక్తి చూపించడం లేదు. వారంతా.. నేరుగా హైదరాబాద్ వెళ్లి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరిపోతున్నారు. అక్కడ ఆస్పత్రులు.. లక్షలకు లక్షలు బిల్లులు వేస్తున్నాయని… విమర్శలు వస్తున్నా సరే..వారు వెనుకాడటం లేదు. ఎన్ని లక్షలు ఖర్చు అయిన సరే.. తమకు ప్రాణమే ముఖ్యమన్నట్లుగా.. హైదరాబాద్ వెళ్లి… కరోనాను క్యూర్ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అధికారులు… ఇతర ప్రముఖులు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స పొందితే…. సామాన్యులకూ భరోసా ఉంటుంది. కరోనా సోకిందని తెలియగానే.. వచ్చి టెస్టులు చేయించుకుని.. చికిత్స పొందడానికి ప్రాధాన్యం ఇస్తారు. కానీ.. ప్రభుత్వంలోని కీలక వ్యక్తులే.. కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్సపై నమ్మకం లేదన్నట్లుగా ఇతర రాష్ట్రాలకు పోతూండటంతో.. ప్రజల్లోనూ అప నమ్మకం ప్రారంభమవుతోంది. ఇప్పటికే.. హోం ఐసోలేషన్‌లోనే ఉంటామని… ఆస్పత్రులకు రాబోమని చెప్పేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. అదేసమయంలో.. కోవిడ్ సెంటర్లలో ఆహారం సహా.. మౌలిక సదుపాయాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో కోవిడ్ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచాల్సిన ప్రభుత్వ బాధ్యులు… తామే ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తూ.. ప్రభుత్వంపై విమర్శలు వచ్చేలా చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌రోనాని జ‌యించిన జ‌క్క‌న్న కుటుంబం

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్.రాజ‌మౌళి, అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. రెండు వారాల నుంచి రాజ‌మౌళి, కుటుంబ స‌భ్యులు హోం క్వారెంటైన్‌లోనే ఉంటున్నారు. డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు...

ప్చ్…ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా..!

ఆగస్టు పదిహేనో తేదీన 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలిస్తామన్న ఏపీ సర్కార్ మళ్లీ వాయిదా బాట పట్టింది. కోర్టుల్లో కేసులున్నాయంటూ... మరోసారి ముహుర్తం మార్చింది. ఈ సారి గాంధీ జయంతికి...

అనధికార కేబినెట్ భేటీని నిర్వహించేసిన కేటీఆర్..!

తెలంగాణ సర్కార్‌లో నెంబర్ టూగా ఉంటూ.. సీఎం రేంజ్ పవర్స్ తో పాటు విధులు కూడా నిర్వహిస్తున్న అనధికారికంగా కేబినెట్ భేటీ కూడా నిర్వహించేశారు. ప్రాక్టీస్ కోసం అన్నట్లుగా జరిగిన ఈ కేబినెట్...
video

స‌డ‌క్ 2 పై.. సుశాంత్ అభిమానుల సెగ‌

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య వెనుక‌.. ప్ర‌త్య‌క్షంగానూ ప‌రోక్షంగానూ మ‌హేష్ భ‌ట్ ప్ర‌మేయం ఉంద‌ని సుశాంత్ అభిమానులు న‌మ్ముతున్నారు. చాలా రోజులుగా సుశాంత్ వ‌ర్గం మ‌హేష్ భ‌ట్ ని టార్గెట్ చేస్తోంది....

HOT NEWS

[X] Close
[X] Close