“రాజధాని” కేంద్ర పరిధిలో లేదా.? ప్రభుత్వాలను మార్చడం ఉందా..?

భారతీయ జనతా పార్టీ నేతలు రాజధానితో కేంద్రానికి సంబంధం లేదంటూ.. ఓ విచిత్రమైన వాదనను తెరపైకి తీసుకు వస్తున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో కేంద్రం పలు రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. చివరికి మొన్నటికి మొన్న జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని కూడా విడగొట్టింది. రాజధానితో మాకు సంబంధం లేదని.. అక్కడి ప్రభుత్వమే ఏర్పాటు చేసుకుంటుందని కేంద్రం.. బిల్లులో కూడా చెప్పలేదు. బీజేపీ హయాంలో ఏర్పడిన పలు రాష్ట్రాల్లోనూ.. ఆయా రాష్ట్రాలకే నిర్ణయం ఇవ్వలేదు. అంతకు మించి… కొత్త రాష్ట్రాలకు రాజధాని ఎంపిక కేంద్ర ప్రమేయం ఉందనడానికి ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయి.

కేంద్రానికి సంబంధం లేకపోతే శివరామకృష్ణన్ కమిటీ ఎందుకు వేశారు..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించినప్పుడే… కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్ణయించడానికి శివరామకృష్ణన్ కమిటీని అధికారికంగా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రిపోర్ట్ సమర్పిచింది. ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారమే.. అత్యధిక మంది ప్రజలు కోరుకున్నట్లుగా అమరావతిని నిర్ణయించామని… ఏపీ సర్కార్ కేంద్రానికి తెలిపింది. కేంద్రం అంగీకరించి నోటిఫై చేసింది. అంతటితో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక పూర్తయిపోయింది. నిజానికి అప్పట్లో.. ఎవరి నుంచి అమరావతి విషయంలో అభ్యంతరాలు లేవు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్… అప్పుడు మరో మాట లేకుండా.. తన అంగీకారం తెలిపారు కూడా. అభ్యంతరాలు వ్యక్తం చేసి ఉంటే.. కేంద్రం అడ్డు పుల్ల వేసి ఉండేదే. ఎందుకంటే.. కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉంది. ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని మోడీ ఆంధ్రకు వచ్చి హామీలు ఇచ్చిపోయారు.

కేంద్రం నిధులు ఇస్తుంది అంటే… ఆమోదం కావాలనే కదా అర్థం..!

విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాజధానికి కేంద్రం సాయం చేయాలని ఉంది. ఆ మేరకు.. రాజధానిగా అమరావతిని గుర్తించి కేంద్రం రూ. 2500 కోట్లు ఇచ్చింది. ఇందులో.., రాజధాని ప్రాంతంగా గుర్తించి మరీ.. గుంటూరు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ. వెయ్యి కోట్లు ఇచ్చారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం రాజధానిగా గుర్తించబట్టే ఇచ్చింది. ఇప్పుడు.. కొత్త ప్రభుత్వం.. మూడు రాజధానులను నిర్మిస్తున్నామని.. మూడింటికి సాయం చేయమని చెబితే.. కేంద్రం ఒప్పుకుంటుందా..? అన్నింటికీ సాయం చేస్తుందా..? లేక ఇప్పటికే రాజధానికి సాయం చేసేశాం కాబట్టి… ఇంక ఎలాంటి సాయం చేయలేమని చెబుతుందా..?

విద్యుత్ పీపీఏల్లో జోక్యం చేసుకోవచ్చు కానీ.. అమరావతి విషయంలో చేసుకోకూడదా..?

బీజేపీ నేతలు.. కేంద్రానికి సంబంధం లేదన్న వితండ వాదాన్ని చేస్తున్నారు. మూడు రాజధానులకు మద్దుతుగా తమ పరోక్ష మద్దతును వారు ఇలా తెలియచేస్తున్నారని సులువుగానే అర్థం అవుతుంది. ఎందుకంటే.. దేశ ప్రయోజనాలకు భంగం కలిగితే.., కల్పించే అధికారం కేంద్రానికి ఎప్పుడూ ఉంటుంది. ఉదాహరణకు… పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల విషయంలో కేంద్రం జోక్యమే దీనికి నిదర్శనం. విద్యుత్ రంగం పూర్తిగా ఏపీ సర్కార్ పరిధిలోనిది. అయితే.. ఏపీ సర్కార్ దుందుడుకుగా.. పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లను రద్దు చేయడంతో కేంద్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అంతర్జాతీయంగా భారత్‌లో పెట్టుబడుల వాతావరణం దెబ్బతీస్తున్నారని.. తప్పు చేస్తున్నారని పదే పదే లేఖలు రాసింది. చివరికి… విద్యుత్ రంగాన్ని తన చేతుల్లోకి తీసుకునేందుకు చట్టం చేయడానికి సిద్ధమయింది. అమరావతి విషయంలోనూ అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘనలు జరిగాయి. విదేశీ పెట్టుబడిదారులెవ్వరూ ఏపీ వైపు చూడరని.. ప్రముఖ పారిశ్రామికవేత్తలు హెచ్చరించారు. అమరావతిని చంపేయడం.. దేశ ఆర్థిక వ్యవస్థకు చేటు తెస్తుందని… తక్షణం ప్రధాని జోక్యం చేసుకోాలని.. ప్రముఖ జర్నలిస్టులు.. ఆర్థిక వేత్తలు కూడా.. పిలుపునిచ్చారు. మరి పీపీఏల విషయంలో చేసుకున్న జోక్యం.. అమరావతి విషయంలో ఎందుకు చేసుకోరు..?

సరే అధికారికంగా లేదు… అనధికారింగా ఒక్క ఫోన్ కాల్ చాలదా..?

అధికారం బీజేపీ చేతుల్లో ఉంది. ఏం చేయాలనుకున్నా చేస్తుంది. ప్రభుత్వాలను కూలగొట్టాలనుకుంటే.. క్షణాల్లో చేస్తోంది. సీబీఐ, ఈడీ, ఐటీ .. హుటాహుటిన రంగంలోకి దిగి… తమ పనులు తాము చక్క బెడుతున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో కర్ణాటకలో ప్రభుత్వాలను మార్చేశారు. గవర్నర్‌ను సైతం వాడుకుని రాజస్థాన్‌లోనూ మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రేపు జాబితాలో మహారాష్ట్ర కూడా ఉందంటున్నారు. ఇవన్నీ కేంద్రం చేతిలో ఉన్నవి కాదు. అయినా చేస్తున్నారు కదా..! నిజంగా బీజేపీ అమరావతికి కట్టుబడి ఉంటే… అమరావతిని కాపాడాలనే లక్ష్యం ఉంటే… జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఫోన్ కాల్ చాలదా..?. చేయాల్సిన వారితో చేయిస్తే… ఆయన ముందుకు పోగలరా..?. అన్ని సీబీఐ కేసుల లగేజీని పెట్టుకుని ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలను ధిక్కరించగలరా..?. ఈ ఆలోచన ప్రతి ఒక్క ఆంధ్రుడిలోనూ వస్తోంది.

నింద తమపై పడకూడదనే బీజేపీ ” కేంద్రానికి సంబంధం లేదనే” వాదన..!

నింద తమపై పడకూడదు కానీ అమరావతి మాత్రం రాజధానిగా నిర్మాణం కాకూడదు అన్న లక్ష్యంతోనే బీజేపీ ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చిందని స్పష్టంగానే అర్థమవుతోంది. అందుకే… అంతా.. వైసీపీనే చేస్తోందని… కానీ తాము మాత్రం అమరావతికే మద్దతుగా ఉంటామని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. అది రాజకీయం కావొచ్చు. కానీ.. నష్టపోయేది మాత్రం.. ప్రజలు.. రాష్ట్రం.. దేశం కూడా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే… దేశం అభివృద్ధి చెందినట్లే. రాజకీయాల కోసం.. స్వలాభం కోసం.. ఓ రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటే.. అదే అసలైన దేశద్రోహం అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close