ప్రముఖులకు వైరస్..! అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా అంటుకుంటుందేంటి..?

కరోనా వైరస్‌కు రాజు – పేద తేడా తెలియదు. ఎవరు అదమరుపుగా ఉంటే వారిని పట్టేసుకుంటోంది. అయితే.. నిన్నామొన్నటిదాకా ప్రముఖులకు వైరస్ అంటుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే.. వారు… కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా… ప్రభుత్వాలను నడుపుతున్న పెద్దలు ఖచ్చితంగా ఆ పద్దతుల్ని పాటించాలి. లేకపోతే… వారు చెప్పే జాగ్రత్తల్ని ప్రజలు కూడా పట్టించుకోరు. అందుకే.. కేంద్ర ప్రభుత్వ పెద్దలు. కేబినెట్ భేటీలు అయినా.. మరో ఉన్నత స్థాయి సమావేశం అయినా… తప్పని సరి భేటీలు అయినా.. కోవిడ్ నిబంధనలు పక్కాగా పాటిస్తూ…నిర్వహిస్తారు. ఆ ఫోటోలు మీడియాకు విడుదల చేస్తారు. అయితే.. అంత పక్కాగా నిబంధనలు పాటించినా… కేంద్రహోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. గత అనారోగ్య సమస్యలు.. వయసు కారణంగా ఆయన ముందు జాగ్రత్తగా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.

రెండు రోజుల క్రితం.. ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనాతో చనిపోయారు. నిన్న ఉత్తరప్రదేశ్‌లో పదవిలో ఉన్న మహిళా మంత్రే కన్నుమూశారు. అలాగే.. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దంపతులకు కూడా.. పాజిటివ్‌గా తేలింది. ఇంతకు ముందే.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. రాజకీయంగా ఉన్నత పదవుల్లో ఉండేవాళ్లు సహజంగా… వయసు ఎక్కువ ఉన్న వాళ్లే కావడంతో.. సహజంగానే… ఆయా పార్టీలు.. ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.

కరోనా వైరస్ ఎంత ప్రమాదకరంగా విస్తరిస్తుందో.. అతి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకునే వారికి సైతం..అంటుకుంటున్న విషయం నిరూపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మామూలుగా అయితే.. కరోనా వచ్చిన వారి ద్వారానే అది వ్యాప్తి చెందుతుంది. అమిత్ షాకు అంటుకున్నా.. ఇతర ప్రముఖులకు అంటుకున్నా… వారు.. అప్పటికే కరోనా బయటపడని వారి కాంటాక్ట్‌లో ఉన్నారనే అర్థం. ఇలాంటి కేసులు ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి. చాలా మందికి కరోనా సోకినా వైరస్ లక్షణాలు లేకపోవడం వల్ల.. ఎలాంటి టెస్టులు చేయించుకోవడం లేదు. వారే సూపర్ స్ప్రెడర్లుగా మారుతున్నారు. ఇలాంటి వారిని గుర్తించలేకపోవడం కూడా.. వైరస్ వ్యాప్తికి కారణం అవుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఆపడం ఎవరికీ సాధ్యం కావడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close