మహిళా రిజర్వేషన్లు : చట్టం ఇప్పుడు – అమలు 2028 తర్వాత

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం బిల్లును ప్రవేశపెట్టింది. వెంటనే ఆమోదించడానికి కూడా అవకాశం ఉంది. రెండు రోజుల్లో అన్నీ పూర్తవుతాయి. కానీ… ఇప్పుడు రాజకీయ పార్టీలకు వచ్చిన టెన్షన్ ఏమీ లేదు. రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ దక్కే అవకాశాల్లేవ్. 2028 తర్వాత జరిగే ఎన్నికలకు మాత్రమే వర్తించేలా బిల్లులో కొన్ని షరతులు ఉన్నాయి. అంతే కాదు కేవలం ప్రజలు నేరుగా ఎన్నుకునే లోక్‌సభ, అసెంబ్లీలకు మాత్రమే మహిళా రిజర్వేషన్ వర్తిస్తాయి.

శాసనమండలి, రాజ్యసభలకు ఈ రిజర్వేషన్ విధానం వర్తించదు. లోక్‌సభ, అసెంబ్లీ సీట్లలో మూడవ వంతు రొటేషన్ పద్ధతిలో మహిళలకు కేటాయింపు జరగుతుంది. ప్రతీ డీలిమిటేషన్ ప్రక్రియకు ఒకసారి ఈ రొటేషన్ మారుతుంది. ఈ బిల్లు ప్రకారం మహిళలకు రిజర్వేషన్ 15 సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా ఇది కంటిన్యూ కావాలంటే ప్రభుత్వం విడిగా చట్టం ద్వారా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బిల్లు ప్రకారం.. చర్చల అనంతరం ఆమోదం పొంది చట్టంగా మారాల్సి ఉంటుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం గెజిట్ ద్వారా నోటిఫై చేయాలి. ఆ తర్వాత జనాభా లెక్కల సేకరణ జరగాల్సి ఉంటుంది.

ఆ లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ కమిటీ ఏర్పడి నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టాల్సి ఉంటుంది. షెడ్యూలు ప్రకారం 2021లోనే జనగణన ప్రక్రియ మొదలు కావాల్సి ఉన్నది. కానీ కరోనా కారణంగా ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ లెక్కల ప్రక్రియ పూర్తయ్యి దాని ఆధారంగా డీలిమిటేషన్ పూర్తయిన తర్వాత మహిళా రిజర్వేషన్ ఖరారు కానున్నది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నందున వీటిలోనూ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుంది. యూపీఏ హయాంలో 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన తరహాలోనే ప్రస్తుతం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఉన్నది.

ఓబీసీ రిజర్వేషన్ గురించి ఈ బిల్లులో ఎలాంటి ప్రస్తావనా లేకపోవడంతో అది సాకారమయ్యే అవకాశం లేదు. ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన మహిళా బిల్లు ఆచరణలోకి రావాలంటే రాజ్యాంగానికి సవరణలు జరగాల్సి ఉంటుంది. వాటిని ఈ సమావేశాల్లో పూర్తి చేయనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close