న్యూస్‌పేపర్లను కాపాడే ప్రయత్నంలో కేంద్రం..!

కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ ఇబ్బందులు ఓ వైపు… దినపత్రికల కారణంగా ఆ వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందన్న ఫేక్ న్యూస్ ప్రచారం మరో వైపు… ఎటాక్ చేయడంతో.. దినపత్రికలు చరిత్రలో ఎప్పుడూ లేనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటాయి. ఓ దేశలో అన్ని ప్రధాన దినపత్రికల యజమానులందరూ మాట్లాడుకుని.. ముద్రణ నిలిపివేయాలని అనుకున్నారు. అయితే.. అది మరింత ఇబ్బందికర పరిస్థితుల్ని తెస్తుందని భావించారు. కేంద్ర ప్రభుత్వం కూడా.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో దినపత్రికలు ఉండాల్సిందేనని భావిస్తోంది. సోషల్ మీడియా, వెబ్ మీడియాల్లో ఏం ప్రచారం జరిగినా.. దానికి విశ్వసనీయత ఉండదని కేంద్రం భావిస్తోంది.

దినపత్రికల్లోని సమాచారమే.. అత్యంత విశ్వసనీయమైనదని ప్రజలు నమ్ముతారని.. ఇలాంటి సమయాల్లో ప్రజలకు దినపత్రికలు చేరాల్సి ఉందని భావిస్తోంది. ఈ మేరకు.. దినపత్రికల ముద్రణకు.. ఇతర విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్రం .. రాష్ట్రాలకు సర్క్యులర్‌ కూడా పంపింది. కేంద్ర ప్రభుత్వం దినపత్రికలను కాపాడేందుకు ప్రత్యేకమైన చొరవ తీసుకుంటూండటంతో దినపత్రికల యాజమాన్యాలు కూడా మనసు మార్చుకున్నాయి. అయితే క్లిష్ట పరిస్థితులను అధిగమించడం వారికి కష్టమే కాబట్టి… కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జిల్లా టాబ్లాయిడ్లను నిలిపివేస్తున్నారు. వాటిని మెయిన్ పేజీలోనే భాగం చేసి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

కరోనా భయంతో ప్రజలు పేపర్లను కొనేందుకు సిద్ధపడటం లేదు. ఈ భయాలను తొలగించేందుకు ఇప్పటికే… అవేర్ క్యాంపైన్లను ఆయా సంస్థలు ప్రారంభించాయి. చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా… దినపత్రికల వల్ల కరోనా రాదని ప్రకటన విడుదల చేసింది. దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎలాంటి ఉత్పాతాలు వచ్చినా దినపత్రికలకు.. ఓ భారీ అడ్వాంటేజ్ అయ్యేది. వాటి సర్క్యూలేషన్ అమాంతం పెరిగేది. కానీ ఇప్పుడు మారుతున్న కాలంతోనే.. వాటికి రివర్స్ సీన్లు కనిపిస్తున్నాయి. ప్రజల వార్తావసరాలు.. ఇన్‌స్టాండ్‌గా సోషల్ మీడియా తీర్చేస్తూండటంతో.. దినపత్రికల మనుగడకు ప్రమాదం ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: ఒకే సినిమా.. ఒకేరోజు.. రెండు ప్రారంభోత్స‌వాలు

సినిమా ప్రారంభోత్స‌వం అంటే.. ఓ పండ‌గ‌లాంటిదే. మంచి ముహూర్తం చూసుకుని, కొబ్బ‌రికాయ కొడ‌తారు. ఆ రోజున తొలి షాట్ తీసి శ్రీ‌కారం చుడ‌తారు. సాధార‌ణంగా ఏ అన్న‌పూర్ణ స్టూడియోలోనో, రామానాయుడు స్టూడియోలోనో, లేదంటే...

వైసీపీలోకి పర్చూరు, రేపల్లె ఎమ్మెల్యేలు..!?

తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఇరువురు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పడం దాదాపు ఖాయమైపోయింది. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా...

అలాంటిదేం లేదంటున్న సుమ‌

రంగ‌స్థ‌లంలో యాంక‌ర్ భామ అన‌సూయ‌కు ఓ మంచి అవ‌కాశం ఇచ్చాడు సుకుమార్‌. రంగ‌మ్మ‌త్త‌గా అన‌సూయ విజృంభించేసింది. ఆసినిమాతో అన‌సూయ‌కు కొత్త ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఇప్పుడు అదే పంథాలో త‌న కొత్త సినిమా...

బాలీవుడ్‌లో పాగా.. ఇదే క‌రెక్ట్ టైమ్‌!

తెలుగులో అగ్ర శ్రేణి నిర్మాత‌గా చ‌లామ‌ణీ అవుతున్నారు దిల్‌రాజు. పంపిణీరంగంలో ఇది వ‌ర‌కే త‌న‌దైన ముద్ర వేశారాయ‌న‌. చిన్న‌, పెద్ద‌, స్టార్‌, కొత్త‌.. ఇలా ఎలాంటి సినిమా అయినా తీయ‌గ‌ల స‌మ‌ర్థుడు. నిర్మాణ...

HOT NEWS

[X] Close
[X] Close