ఈ టైమ్‌లో ఇది అవ‌స‌ర‌మా జ‌క్క‌న్నా??

ఈ రోజు ఉగాది అన్న సంగ‌తే తెలుగు జ‌నాలు మ‌ర్చిపోయారు. క‌రోనా అంత‌గా భ‌య‌పెడుతోంది. పుట్టిన రోజులు, పెళ్లి రోజులూ – అంటూ ప్ర‌త్యేక సంద‌ర్భాల్ని గుర్తు చేసుకుని మ‌రీ వేడుకు చేసుకునే వాతావ‌ర‌ణం ఇప్పుడు లేదు. ప్ర‌పంచ‌మంతా ఇదే స్థితి. టీవీ ఛాన‌ళ్ల‌నీ, పేప‌ర్ల‌నీ, మ‌నిషి జీవితం మొత్తాన్నీ క‌రోనా ఆక్ర‌మించేసింది.

ఈ సంద‌ర్భంగా `ఆర్‌.ఆర్‌.ఆర్‌` టైటిల్‌లోగోని, మోష‌న్ పోస్ట‌ర్‌నీ విడుద‌ల చేస్తున్నాడు రాజ‌మౌళి. నిజానికి ఈ సినిమా గురించి ఎలాంటి చిన్న అప్ డేట్ వ‌చ్చినా అదో పెద్ద పండ‌గ‌లా ఉండేది. ఇక టైటిల్ చెప్పేస్తానంటే ఇక ఆ సంబ‌రం అంబ‌రాన్ని తాకాల్సిందే. ఈ సినిమా టైటిల్ ఎప్పుడు చెబుతారా అంటూ చాలా కాలం నుంచి అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఉగాది సంద‌ర్భంగా, ఈనెల 27న రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు కానుక‌గా టైటిల్ ని ప్ర‌క‌టిస్తోంది చిత్ర‌బృందం. ఈరోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల లోపు టైటిల్ ఏమిటో చెప్పేస్తారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో… సినిమా ప్ర‌చారాలు అవ‌స‌ర‌మా? అనే చ‌ర్చ మొద‌లైంది. క‌రోనా భ‌యంతో ప్ర‌పంచం వ‌ణికిపోతోంటే.. అవేం ప‌ట్ట‌న‌ట్టు సినిమా ప్ర‌చారం చేసుకోవ‌డం హ‌ర్షించ‌ద‌గిన విష‌యం కాదు.జ‌నాలు అంతా ఇంట్లో ఖాళీగా ఉంటారు. త‌న సినిమా గురించో, టైటిల్ గురించో మాట్లాడుకునే టైమ్ దొరుకుతుంది అని జ‌క్క‌న్న భావించి ఉంటాడు. కాక‌పోతే.. ‘రాజ‌మౌళి సినిమా టైటిల్ వ‌స్తుందిరోయ్‌’ అంటూ ఊగిపోయే ప‌రిస్థితి సోష‌ల్ మీడియాలో క‌నిపించ‌డం లేదు. జ‌నాల ఆలోచ‌న‌లు వేరు, అవ‌స‌రాలు వేరు. వీటి మ‌ధ్య రాజ‌మౌళి ప్ర‌మోష‌న్‌కి అనుకున్నంత స్పంద‌న రాక‌పోవొచ్చు కూడా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close