“మోజో” యాజమాన్య మార్పుపై కేంద్రం విచారణ..!?

మోజో టీవీ యాజమాన్యం.. ‌అనూహ్యంగా చేతులు మారిన వైనం.. కేంద్ర సమాచార, ప్రసారశాఖను కూడా నివ్వెరపరిచినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మోజో టీవీ వ్యవహారంపై… కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పూర్తి స్థాయిలో పరిశీన జరుపుతోంది. ఎవరు దాన్ని ప్రారంభించారు..? ఎవరు లైసెన్స్ తీసుకున్నారు..? ప్రస్తుతం అది ఎవరి చేతుల్లో ఉంది..? యాజమాన్యం చేతులు మారడానికి అవసరమైన నియమ, నిబంధనలు పాటించారా..? వంటి అంశాలపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పూర్తి వివరాలు సేకరిస్తోంది. మోజో టీవీ ప్రతి అడుగులోనూ.. నిబంధనల ఉల్లంఘన ఉన్నట్లు తెలుతోందని… ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. లైసెన్స్ రద్దు లాంటి.. తీవ్రమైన చర్య తీసుకున్నా.. ఆశ్చర్యపోనవసరం లేదని చెబుతున్నారు.

“మోజో టీవీ” టేకోవర్‌లో రూల్స్ పాటించారా..?

నిజానికి..మోజో టీవీని ప్రారంభించింది చేరెడ్డి హరికిరణ్. మరికొంత మంది పార్టనర్లు ఉన్నారు. ఎడిటోరియల్ డైరక్టర్ గా రేవతి ఉన్నారు. వీరంతా కలిసి.. మోజో టీవీని ప్రారంభించారు. చిన్న స్థాయిలో ప్రారంభించినా… చానల్‌కు ఓ గుర్తింపు తీసుకు రావడానికి తలా ఓ చేయి వేశారు. అయితే.. టీవీ9 అమ్మకం వివాదం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. టీవీ9 నుంచి ఈ సంస్థకు నిధులు వచ్చాయంటూ.. ఆరోపణలు గుప్పించిన కొత్త యాజమాన్యం.. మోజో టీవీ కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేసింది. కొంత వివాదాస్పదం అయినప్పటికీ.. సక్సెస్ అయింది. ఈ క్రమంలో… చానల్‌ను కబ్జా చే్శారన్న ఆరోపణలు… ఎడిటోరియల్ డైరక్టర్ కమ్ సీఈవోగా ఉన్న రేవతి సహా.. పలువురు జర్నలిస్టుల నుంచి వచ్చాయి. కానీ.. ఈ ఆరోపణలు.. అలాగే ఉండగానే.. చానల్ యాజమాన్యం చేతులు మారిపోయింది.

కేంద్రం అనుమతుల్లేకుండానే అన్నీ చేసేశారా..?

ఒక్క నెల వ్యవధిలోనే… వ్యవస్థాపకుడైన చేరెడ్డి హరికిరణ్ మినహా.. మిగిలిన డైరక్టర‌్లందర్నీ తొలగించారు. కొత్త వారిని చేర్చుకున్నారు. ఇప్పుడు పేరుకు హరికిరణ్ హోల్ టైమ్ డైరక్టర్ గా ఉన్నప్పటికీ.. ఆయనకు.. కనీస అధాకారాలు కాదు కదా.. అసలు ఆఫీసులోకి అడుగు పెట్టే అవకాశం కూడా ఇవ్వడం లేదన్న ప్రచారం జరుగుతోంది. కేవలం… కేంద్ర సమాచార, మంత్రిత్వ శాఖను.. నమ్మించడానికి మాత్రమే.. ఆయన పేరును.. హోల్ టైమ్ డైరక్టర్ గా ఉంచారని.. చెబుతున్నారు. అయితే… ఈ విషయంలో.. జరిగిన గూడుపుఠాణిపై.. పలు ఫిర్యాదులు వెళ్లడంతో… విచారణ ప్రారంభించింది. ఈ విచారణ కీలక దశకు చేరుకున్న సమయంలోనే.. తొలగించడబడిన ఎడిటోరియల్ డైరక్టర్ రేవతిని అరెస్ట్ జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి.

రేవతి అరెస్ట్ కూడా ఆ కోణంలోనే జరిగిందా..?

తనకు ఏ మాత్రం సంబంధం లేదని అట్రాసిటీ కేసులో ఏ -2 గా రేవతిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. హడావుడిగా ఆమెను.. ఇంటికి వచ్చి బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అంత అవసరం ఏమొచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. వారం రోజుల పాటు… కనీసం కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయకుండా.. లాకప్‌లోనే ఉంచారు. వారం రోజుల తర్వాత బెయిల్ పై విడిచిపెట్టారు. ఓ ప్రణాళిక ప్రకారం.. ఆమెను వారం రోజుల పాటు జైల్లో ఉంచారన్న అనుమానాలు ఇప్పుడు.. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ విచారణ కారణంగా బలపడుతున్నాయి. దీనిపై త్వరలో సంచలనాత్మక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చానల్ చేతులు మారిందన్న కారణంగా.. మోజో టీవీ లైసెన్స్ ను రద్దు చేసినా ఆశ్చర్యం లేదనే వాదన వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

ఇప్పటికీ ఎన్డీఏ వెంట పడుతున్న జగన్ !

రాజకీయం అంటే విదిలించుకున్నా వదిలి పెట్టను అని కాళ్లు పట్టేసుకోవడం కాదు. కానీ వైసీపీ అధినేతకు మాత్రం అదే రాజకీయం. ఎందుకంటే వదిలిస్తే కేసులకు కొట్టుకుపోతారు. అందుకే బీజేపీ వాళ్లు విదిలించుకున్నా ...

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close