కర్ణాటకంలో “కాంగ్రెస్ సీఎం” ఫార్ములా వర్కవుట్ అవుతుందా..?

కర్ణాటకలో ప్రభుత్వాన్ని నిలుపుకోవడానికి కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణం… ఆఖరి అస్త్రాన్ని వాడే ప్రయత్నంలో పడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అత్యధిక తిరుగుబాటుదారులు కావడంతో.. ముఖ్యమంత్రి పీఠాన్ని.. కాంగ్రెస్ పార్టీకే అప్పగిస్తే.. వారంతా తిరిగి వస్తారన్న అంచనాతో… ఈ దిశగా.. రాజకీయాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దేవేగౌడతో.. కాంగ్రెస్ పార్టీ నేతలు సంప్రదింపులు జరిపారు. దేవేగౌడ కూడా.. ఇప్పుడున్న సంక్షోభంలో పార్టీని కాపాడుకోవాలంటే… కాంగ్రెస్ పార్టీ నేత ముఖ్యమంత్రి అయినా అభ్యంతరం లేదని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలోనూ దీనిపై అంతర్గతంగా కసరత్తు జరుగుతోంది. కుమారస్వామి కూడా.. వైదొలిగి.. కాంగ్రెస్ పార్టీకి సీఎం పీఠం అప్పగించడానికి సిద్ధంగానే ఉన్నారంటున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో.. ఎమ్మెల్యేలను.. ఒకే తాటిపైకి తీసుకువచ్చి.. అందర్నీ కలిపి ఉంచే శక్తి.. టాస్క్ మాస్టర్ గా పేరొందిన.. సీనియర్ నేత డీకే శివకుమార్‌కు ఉందని.. అందరూ ఏకగ్రీవంగా ఓ అభిప్రాయానికి వచ్చారు. సంక్షోభం ప్రారంభయినప్పటి నుంచి డీకే శివకుమార్.. ప్రభుత్వాన్ని కాపాడటానికి అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. రెబల్ ఎమ్మెల్యేలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి ఆయనతో ఎమ్మెల్యేలు మాట్లాడితే మనసు మార్చుకుంటారన్న కారణంగానే… ముంబై క్యాంపులో.. వారిని ఎవరికీ అందకుండా.. బీజేపీ నేతలు ఉంచినట్లుగా చెబుతున్నారు. అసెంబ్లీకి హాజరైతే.. శివకుమార్.. వారిని గ్రిప్‌లో పెట్టేసుకుంటాడని.. వీలైనంత వరకు.. వారి రాజీనామాలను ఆమోదింపచేయడమో.. లేక.. గైర్హాజరు కావడమో చేయాలన్న లక్ష్యంతోనే బీజేపీ ఉంది. దాన్నే ఇప్పటి వరకూ అమలు చేస్తోంది.

ఇప్పుడు డీకే శివకుమార్ ను.. ముఖ్యమంత్రిని చేస్తే.. చాలా మంది.. ఆయనకు మద్దతు ఇస్తారన్న ప్రచారం కర్ణాటకలో ఉద్ధృతంగా సాగుతోంది. ఆ చాణక్యం శివకుమార్ కు ఉంది. అయితే.. అధికార మార్పిడి జరగాలి అంటే.. కచ్చితంగా… గవర్నర్ సహకారం కావాలి. కుమారస్వామి.. పదవి నుంచి దిగిపోతే.. గవర్నర్ కచ్చితంగా చాన్స్… యడ్యూరప్పకే ఇస్తారని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు మరింత రాజకీయ డ్రామా పండుతుంది. మొత్తానికి కర్ణాటకంలో కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణం చివరి అస్త్రాన్ని వాడటానికి రెడీ అయిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close