తూచ్.. పోలవరానికి ఆ డబ్బులూ ఇవ్వట్లేదు..!

కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు రూ. 1850 కోట్లు విడుదల చేసినట్లు మూడు రోజుల కిందట.. ప్రకటన వచ్చింది. కానీ ఆ డబ్బులు రావాలంటే.. ఏపీ సర్కార్ తలకిందులుగా తపస్సు చేయాల్సిందే. దానికి కూడా స్వయం కృతమే కారణం. ప్రత్యక్షంగా..అనేక రకాల సాకులు చెబుతున్నప్పటికీ.. అసలు కారణం.. ఏపీ సర్కార్… గతంలో జరిగిన పనులపై విజిలెన్స్ విచారణ జరిపిస్తూండటమే. ఆ విచారణ పూర్తయిన తర్వాతే నిధులు విడుదల చేస్తామని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ రూ. 1850 కోట్లు విడుదలైతే.. తాత్కలికంగా.. కొన్ని పనులైనా చక్కబెట్టుకుందామనుకున్న ఏపీ సర్కార్‌కు.. కేంద్ర ఆర్థిక శాఖ పెడుతున్న మెలికలు.. మెలికలు తిరిగిపోయేలా చేస్తోంది.

గత ప్రభుత్వం పోలవరం హయాంలో బోలెడన్ని అక్రమాలకు పాల్పడిందని.. వైసీపీ ఆరోపిస్తోంది. అయితే.. కేంద్రం అధీనంలో ఉండే పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ మొత్తం వ్యవహారాలను డీల్ చేస్తుంది. అవినీతి జరిగితే.. దానికీ అంటుంకుంటుంది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. జగన్ .. బంధువు రేమండ్ పీటర్ అనే మాజీ అధికారి నేతృత్వంలో నిపుణుల కమిటీ వేసి… రూ. వేల కోట్ల అక్రమాలని నివేదిక తెప్పించింది. దీన్ని ప్రధానికి కూడా సమర్పించింది. తీరా ఆధారాలు సమర్పించమనేసరికి… ఆ కమిటీ నివేదికతో తాము ఏకీభవించడం లేదని.. యూటర్న్ తీసుకుంది. అయితే.. అంతటితో వదిలి పెట్టలేదు. విజిలెన్స్ విచారణ జరిపిస్తోంది. దాంట్లో పీపీఏ అధికారి కూడా భాగం కావాలని.. ఇటీవల కేంద్రం నిర్ణయించింది.

ఒక వేళ.. విజిలెన్స్ విచారణలో నిధులు దుర్వినియోగం అయ్యాయని తేలితే.. ఆ నిధులు.. ఏపీకి చెల్లించాల్సిన పని లేదు. ఎంత మేర పని జరిగితే.. అంత మేర మాత్రమే నిధులు చెల్లిస్తారు. అందుకే… ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ… రూ. 1850కోట్లను పెండింగ్ లో పెట్టేశారు. విచారణ పూర్తయిన తర్వాత మాత్రమే ఆ నిధులు విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు. అంటే.. ఇప్పుడల్లా ఆ నిధులు రావు. నిధులు ఇవ్వాలంటే.. విజిలెన్స్‌తోనూ క్లీన్ చిట్ ఇప్పించాల్సిన పరిస్థితి. చేసుకున్నవాడికి చేసుకున్నంత అంటే.. ఇప్పుడు వైసీపీ సర్కార్ .. పరిస్థితి లాంటిదేనన్న సెటైర్లు.. ఢిల్లీలో గట్టిగానే పడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొత్త హీరోయిన్ల తలరాతలు మారుస్తున్న రాంగోపాల్ వర్మ

సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ రావడం అన్నది అంత ఆషామాషీ కాదు. వందల మంది ఆర్టిస్టులు బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నా, టాలెంట్ విషయంలో కొదువ లేకపోయినా, అదృష్టం కలిసి రాక, సరైన గాడ్ ఫాదర్...

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

HOT NEWS

[X] Close
[X] Close