చైతన్య : ఇందిర ఉక్కు మహిళ అయితే.. మరి మోడీ ఏంటి..?

అప్పట్లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా.. జనతా పార్టీ సహా.. విపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. కానీ ఇందిరాగాంధీ ఎప్పుడూ.. తాను మహిళను కాబట్టి… వారందరూ ఏకమయ్యారని.. మాట్లాడలేదు. అందర్నీ దైర్యంగా ఎదుర్కొన్నారు. విజయమో.. వీరస్వర్గమో… తేల్చుకున్నారు. కానీ కులం, మతం, లింగం, ప్రాంతం ఆధారంగా… వారిపై ఆరోపణలు చేయలేదు. కానీ ఇప్పుడు మోడీ మాత్రం… తాను బీసీనంటున్నారు. పేద తల్లిబిడ్డనంటున్నారు…ఇంకేదో అంటున్నారు. కానీ.. అసలు విషయాలు మాత్రం మాట్లాడటం లేదు.

కులాన్ని అడ్డు పెట్టుకుని దాక్కుంటున్న మోడీ..!

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ… రాజకీయ స్థాయిని బట్టి… విలువలు మెయిన్‌టెయిన్ చేస్తూ ఉండటం నైతికం. ప్రధాని స్థాయిలో ఉన్న వారు ఈ విషయాన్ని ఎక్కువగా గుర్తుంచుకుంటారు. భారతదేశంలో ఏనాడూ..ఎవరూ కూడా ప్రధాని స్థాయిలోఉండి కుల, మత, ప్రాంతాల్ని రాజకీయాల్ని వాడుకున్న దాఖలాలు లేవు. ఒక్క మోదీ మాత్రమే.. ఈ రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు దేశంలో కుల, మత, ప్రాంత బేధాల్ని రూపుమాపు చేసే భారతాన్ని తీర్చిదిద్దగలరా..? రాజకీయం కోసం సొంత ప్రజల మధ్యే చిచ్చు పెట్టే నేత..సమాఖ్య భారతాన్ని స్వప్నించగలరా..?. తనపై వస్తున్న విమర్శలకు కులాన్ని అడ్డుపెట్టుకునే నేత దేశంలో కుల రహిత సమాజాన్ని తేవడానికి ప్రయత్నిస్తారా..?. సాధ్యం కానే కాదు. కానీ మోడీ మాత్రం..అన్నింటినీ వాడేసుకుంటున్నారు.

నియంత స్థాయి అధికారం అనుభవిస్తూ పేద తల్లి బిడ్డనని చెప్పుకుంటారా..?

ప్రధానమంత్రి అంటే.. దేశం మొత్తానికి ప్రతినిధి. అధికార పార్టీకి దేశం మొత్తం.. ఏకపక్షంగా ఓట్లు వేయకపోవచ్చు కానీ… ప్రధాని మాత్రం.. అన్నింటికీ అతీతంగా ఉండాలి. కుల, మత, ప్రాంత భావనలకు దూరంగా ఉండాలి. మోదీకి ముందు వరకూ అందరూ అలాగే ఉన్నారు. ఎవరూ.. తమను ఓ కులానికో.. మతానికో..ప్రాంతానికో చెందిన వారిగా ఎస్టాబ్లిష్ చేసుకుని రాజకీయ లాభం పొందాలనుకోలేదు. కానీ అవన్నీ ప్రస్తుత ప్రధాని మోదీ చేస్తున్నారు. రాహుల్ గాంధీ… రాఫెల్ డీల్ విషయంలో తనపై చేస్తున్న విమర్శలను… తిప్పికొట్టేందుకు.. నరేంద్రమోదీ ఎంచుకున్న అస్త్రం బీసీ నినాదం. రాఫెల్ డీల్‌పై.. రాహుల్ ఎన్నో ప్రశ్నలు లేవనెత్తారు. వాటికి సమాధానం చెప్పడానికి ఏ ఒక్క బహిరంగసభలోనూ ప్రయత్నించని ప్రధాని.. తాను వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి.. రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారని ఆరోపించేశారు. తన ఎదుగుదల కాంగ్రెస్ పార్టీ చూడలేకపోతోందంటున్నారు. అంతే కాదు.. తనను తాను ఓ పేద తల్లి బిడ్డనని చెప్పుకుని సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు. మోదీ.. దేశంలో తిరుగులేని అధికారం చెలాయిస్తున్న వ్యక్తిగా ఉంటూ.. ఎన్నికల ప్రచారంలో పేదతల్లి బిడ్డగా … వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తిగా ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు.

గుజరాత్‌కు మాత్రమే మోడీ ఆలోచనలు పరిమితం..!

మోదీకి దేశానికి ప్రధాని ..కానీ ఆయన గుజరాత్ గురించే ఆలోచిస్తూంటారు. పదే పదే ఈ విషయాన్ని బయట పెట్టుకుంటూ ఉంటారు. గుజరాత్‌లో ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీ వస్తే.. గుజరాత్ అన్యాయం అయిపోతుందనేదే ఆ మాట. తాను ప్రధానిగా ఉన్నాను కాబట్టి…లెక్కలేనన్ని ప్రాజెక్టులు, నిధులు గుజరాత్‌కు తీసుకొస్తున్నాననే అర్థాన్ని గుజరాత్ ప్రజల్లో నింపేందుకు.. మోదీ అదే పనిగా ప్రయత్నిస్తూంటారు. నిన్న.. పలు ఉత్తరాది రాష్ట్రాల్లో పిడుగులు, గాలి వాన బీభత్సం సృష్టించింది. గుజరాత్‌లో కూడా.. ప్రకృతి విధ్వంసం సృష్టించింది. ఆస్తి, ప్రాణనష్టాలు జరిగాయి. మోదీ వెంటనే… ప్రధాని హోదాలో గుజరాత్‌కు పరిహారాన్ని ట్విట్టర్‌లో ప్రకటించారు. ఈ ట్వీట్ చూసి.. దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే..ప్రధాని హోదాలో ఉన్న మోదీ.. అకాల వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల గురించి పట్టించుకోలేదు. కానీ.. ఈ రాష్ట్రాలతో పోలిస్తే.. తక్కువ ప్రభావం ఉన్న గుజరాత్‌ కు వచ్చిన కష్టంపై వెంటనే..స్పందించి పరిహారం ప్రకటించారు. ప్రధాని తీరుపై.. తీవ్రమైన విమర్శలు రావడంతో.. కాసేపటికే పీఎంవో.. అన్ని రాష్ట్రాలకు నష్టపరిహారాన్ని వర్తింప చేస్తున్నట్లు ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే… ఆయన ప్రధానిగా ఉన్నప్పటికీ.. ఒక్క గుజరాత్ గురించి మాత్రమే ఆలోచిస్తారని.. ఎవరికైనా అనిపిస్తే.. తప్పుపట్టాల్సిందేమీ లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close