‘చాణ‌క్య’ టీజ‌ర్‌: ఏది అబ‌ద్ధం? ఏది నిజం?

యాక్ష‌న్ క‌థ‌ల‌కు స‌రిగ్గా స‌రిపోతాడు గోపీచంద్‌. మ‌ధ్య‌లో కామెడీ ప్ర‌య‌త్నించాడు. కొన్ని వ‌ర్క‌వుట్ అయ్యాయి. ఇంకొన్ని ఫెయిల్ అయ్యాయి. దాంతో.. మ‌ళ్లీ యాక్ష‌న్ బాట ప‌ట్టాడు. గోపీచంద్ ఇప్పుడు ‘చాణ‌క్య‌’గా సిద్ధం అవుతున్నాడు. ఇదీ యాక్ష‌న్ స్టోరీనే. తిరు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ద‌స‌రాకి విడుద‌ల అవుతోంది. చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన సంద‌ర్భంగా టీజ‌ర్‌ని విడుద‌ల చేశారు.

50 సెక‌న్ల ఈ టీజ‌ర్లో యాక్ష‌న్ హంగామానే క‌నిపించింది. గోపీచంద్ రా ఏజెంట్‌గా క‌నిపించ‌బోతున్నాడు. కొన్ని షాట్స్‌లో ముస్లిం యువ‌కుడిగా చూపించారు. చూస్తుంటే అండ‌ర్ క‌వ‌ర్ ఆప‌రేష‌న్లో భాగంగా ఆ అవ‌తారం ఎత్తిన‌ట్టు క‌నిపిస్తోంది. హెలీకాఫ‌ర్లు, ఛేజింగులు, బుల్లెట్లు దూసుకుపోవ‌డాలు, ఫైట్లూ, ఛాలెంజులూ.. ఇలా ఈ 50 సెక‌న్ల‌లోనే ఈ సినిమా ఫ్లేవ‌ర్ ఏమిటో అర్థ‌మ‌య్యేలా చెప్పేశారు. `మ‌నం రెండు జీవితాలు లీడ్ చేస్తున్నాం సార్‌. ఒక‌టి అబ‌ద్ధం, మ‌రోటి నిజం`, `నామ్ హై అర్జున్‌.. ఇండియ‌న్‌`. `తేరే గాం** మే ద‌మ్ హైతే ఉద‌ర్ హీ రుక్ సాలే.. మై ఆ ర‌హాహూ..` అంటూ గోపీచంద్ డైలాగులు చెప్పాడు. టీజ‌ర్ అంతా సీరియ‌స్ లుక్‌లోనే క‌నిపించాడు గోపీచంద్‌. ల‌డ‌క్‌లో తీసిన యాక్ష‌న్ దృశ్యాలు, స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి బ‌లం అని చిత్ర‌బృందం చెబుతోంది. టీజ‌ర్ వ‌ర‌కూ చాణ‌క్య పాసైపోయాడు. మ‌రి తెర‌పై ఎలాంటి హంగామా చేస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.