వైఫల్యాన్ని అంగీకరించిన చంద్రబాబు: ఉద్వేగంతో కంటతడి

హైదరాబాద్: రాజమండ్రి పుష్కర ఘాట్ దుర్ఘటనలో తమ వైఫల్యముందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగంతో కంటతడికూడా పెట్టారు. ఇలా జరగకుండా ఉండాల్సిందని అన్నారు. ఏర్పాట్లు ఇంకా ప్రణాళికాబద్ధంగా చేయాల్సిందని అన్నారు. అనుకున్నదానికన్నా పెద్దసంఖ్యలో భక్తులు రావటంతో నియంత్రణ సరిగా జరగలేదని చెప్పారు. మరిన్ని జాగ్తత్తలు తీసుకోవాల్సిందని అన్నారు. దుర్ఘటనపై విచారణకు ఆదేశిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే పుష్కరాలు పూర్తయ్యేవరకు రాజమండ్రిలోనే ఉంటానని అన్నారు. అవాంఛనీయ సంఘటనలు పునరావృతంకాకుండా చూస్తామని చంద్రబాబు చెప్పారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకుంటామని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com