పుష్కరఘాట్ దుర్ఘటనకు అసలు కారణమేమిటి?

రాజమండ్రి తొక్కిసలాట దుర్ఘటనకు నూటికి నూరుపాళ్ళూ ప్రభుత్వ, పోలీసుల వైఫల్యమే కారణమని స్థానికులు, యాత్రికులు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇంకా మూడు ఘాట్‌లున్నప్పటికీ వాటిగురించి అవగాహనలేని దూరప్రాంతాల యాత్రికులు ఒకే ఘాట్‌కు పోటెత్తటమే ప్రధాన కారణం. అదే పుష్కర ఘాట్. పేరే పుష్కర ఘాట్ అయిన కారణంగా, గోదావరి పుష్కరాలకు సంబందించి అనేక కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన ఘాట్ అయివుండటం మూలాన, ఆయన స్వయంగా స్నానం చేసిన ఘాట్ అవటంవల్లా భక్తులందరూ అదే ఘాట్‌కు తరలివచ్చారు.

ఈ ఘాట్ ని రోడ్డుని వేరుచేస్తూ పెద్దగోడ వుంది. లోనికి మూడుగేట్లు వున్నాయి. ముఖ్యమంత్రి స్నానం చేసి వెళ్ళేవరకూ, దాదాపు మూడుగంటలపాటు పోలీసులు అనుమతించని కారణంగా క్యూలలో యాత్రికులు నీరసించిపోతూ అసహనంగా వుండిపోయారు. ముఖ్యమంత్రి వెళ్ళిపోగానే వారంతా విరుచుకుపడినట్టు లోనికి ప్రవేశించారు. వీవీఐపీ వెళ్ళిపోగానే రిలాక్స్ అయిపోయిన పోలీసులు యాత్రికుల రద్దీని అదుపుచేయలేకపోయారు. మూడుగేట్లలో ఒక్కగేటుని కూడా ఎగ్జిట్ గేటుగా వుంచలేదు. బయటికి వెళ్ళే తొందరలో యువకులు గోడఎక్కి దూకడంతో ఏదో జరిగిపోతోందన్న భయమే తొక్కిసలాటకు కారణమైంది.

ఇందులో పోలీసు వైఫల్యమే కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అయితే కనిపించని సమన్వయ రాహిత్యమే అసలు మూలం. ప్రతీ రైలూ గోదావరి స్టేషన్ లో ఆపుతున్నామని పుష్కరాల అధికారులు ప్రకటించారు. గంటలకొద్దీ జాప్యంతో వచ్చిన మూడు రైళ్ళు ఒకేసారి పెద్దస్టేషన్ లోనే ఆగాయి. అక్కడ ఉచిత బస్సులు లేవు. ఆటోలులేవు. డిపార్టుమెంట్‌ల వాహనాల పార్కింగ్ ప్లేస్ గానే రైల్వేస్టేషన్ మిగిలిపోయింది. తెల్లవార్లూ ప్రయాణపు అలసట…అలాగే సామాను మోసుకుంటూ ఐదు కిలోమీటర్ల నడక అక్కడ క్యూలో పడిగాపులు…లౌడ్ స్పీకర్లలో ”ఉచిత బస్సులు కలవు..మీరు చేరవలసిన ఘాట్ సమీపంలో దిగి పుణ్యస్నానమాచరించి తరించండి” అనే అనౌన్స్ మెంట్లు బేరికేడ్లలో వున్న యాత్రికులను తీవ్రమైన చికాకు కలిగించాయి.

రోడ్లమీద నాలుగు వరుసల బారికేడ్లు పాతడం వల్ల జనప్రవాహాన్ని నిరోధించి కృత్రిమ రద్దీసృష్టించడమేనని ,ఫ్రీగా విడిచిపెడితే తొందరగా యాత్రికులు త్వరితంగా సాగిపోతారనీ, ఇందువల్ల బారికేడ్లను తొలగించి, అవసరాన్ని బట్టి మొత్తం రోడ్డునే తాత్కాలికంగా బ్లాక్ చేయవచ్చనీ, గత పుష్కరాల అనుభవాలరీత్యా సూచించిన హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంత చెప్పినా పోలీసు అధికారులు వినలేదు.

ఒక పోలీసు అధికారి ”సిఎం హేస్ అప్రూవ్డ్ అవర్ ప్లాన్ ”అని వీరికి సమాధానమిచ్చాడని తెలిసింది. ఇది నిజమే అయితే ఈ దారుణానికి ముఖ్యమంత్రే కారణమనుకోవాలి..వీవీఐపీని మాత్రమే పట్టించుకునే పోలీసు, సివిల్ యంత్రాంగానిదే పాపమనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close