బీహార్ సిఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. 20వ తేదీన నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం పట్నాలోని గాంధీ మైదాన్‌లో జరగనుంది. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రులందర్నీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో ఆయనను కూడా ఆహ్వానించారు. అందుకే ఇద్దరూ వెళ్తున్నారు. ప్రచారానికి చంద్రబాబు వెళ్లలేదు. బీహార్ పూర్తిగా ప్రత్యేకమైన రాష్ట్రం కావడంతో ఇక్కడ నేతల్ని పిలవలేదు.
తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు బీహార్ ను చూపించి.. ఇతర పార్టీల నేతలపై విమర్శలు చేస్తూంటారు. బీహార్ గా మార్చేశారని అంటూ ఉంటారు. ఇలాంటి మాటల్ని అ్కకడి నేతలు సెంటిమెంట్ కోసం వాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని ప్రశాంత్ కిషోర్ అలాగే టార్గెట్ చేయడంతో ఆయనను మళ్లీ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి పిలువలేదు. అయితే నారా లోకేష్ ప్రత్యేకం. ఆయన ఇన్వెస్ట్ మెంట్స్ తో యువతలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందుకే ఆయనను పిలిచారు.
నారా లోకేష్ చివరి రెండు రోజులు బీహార్ లో ప్రచారం చేశారు. పారిశ్రామిక వేత్తలతో సమావేశం అయ్యారు. ప్రతి ఇంటికో ఉద్యోగం లాంటి సాధ్యం కాని హామీలను నమ్మవద్దని.. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ఎన్డీఏ సంకల్పానికి మద్దతివ్వాలని కోరారు.
