9నెలల్లో ఐదు సార్లు అరెస్ట్..! చంద్రబాబుకు రాజకీయ సవాలే..!

ప్రతిపక్ష నేత చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కొనేంత కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్లడానికి ఆయనకు గతంలో ఎప్పుడూ ఇబ్బందులు ఎదుర్కోలేదు. కానీ ఇప్పుడు  ప్రజల్లోకి వెళ్తూంటే.. అడ్డుకోవడమే పనిగా.. ప్రభుత్వం పెట్టుకుంది. గత తొమ్మిది నెలల కాలంలో.. ఏకంగా ఐదు సార్లు చంద్రబాబును ప్రభుత్వం నిర్బంధించింది. మొదట ఇసుక కొరతను ప్రభుత్వం కృత్రికంగా సృష్టించిందని.. తక్షణం  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ..నిరసన చేపట్టినప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని.. చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు.

చంద్రబాబును ఇంట్లో నుంచి రానీయకుండా.. గేట్లను తాళ్లతో కట్టేసి పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. చంద్రబాబు పర్యటనకు వెళ్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయన్న కారణంగా ఈ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. భద్రత కల్పించాల్సిన పోలీసులు ఇలా .. అడ్డుకోవడం చర్చనీయాంశమయింది.  మరో సారి అమరావతి జేఏసీ బస్సు యాత్ర ప్రారభించాల్సిన సమయంలో.. పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా చంద్రబాబు పాదయాత్రగా.. బస్సుల దగ్గరకు వెళ్లేందుకు సిద్ధమవడంతో.. మళ్లీ అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో.. ప్రజా చైతన్య యాత్రకు వెళ్లే సమయంలో… అనుమతి ఇచ్చి మరీ పోలీసులు అరెస్ట్ చేసి వెనక్కి పంపారు.

చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తూండటంతో…  ప్రభుత్వం భయపడుతోందన్న విమర్శలను ఈ అరెస్టుల కారణంగా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నారు.  ఓ ప్రతిపక్ష నేతను ఇన్ని సార్లు అరెస్ట్ చేయడం ఏమిటన్న  చర్చ.. రాజకీయవర్గాల్లో వస్తోంది. ప్రభుత్వం తప్పు చేస్తోంది కాబట్టే… ఇంతగా భయపడుతున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అరెస్టులు.. టీడీపీకి ప్లస్ అవుతాయో.. మైనస్ అవుతాయో కానీ.. చంద్రబాబు మాత్రం.. స్వేచ్చగా బయటకు వెళ్లలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ‘నిఫా వైర‌స్‌’

ప్ర‌పంచం మొత్తం.. క‌రోనా భ‌యంతో వ‌ణికిపోతోంది. ఇప్పుడైతే ఈ ప్ర‌కంప‌న‌లు కాస్త త‌గ్గాయి గానీ, క‌రోనా వ్యాపించిన కొత్త‌లో... ఈ వైర‌స్ గురించి తెలుసుకుని అల్లాడిపోయారంతా. అస‌లు మ‌నిషి మ‌నుగ‌డ‌ని, శాస్త్ర సాంకేతిక...

సర్వేలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్సే..!

గ్రేటర్ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ మొత్తం బోల్తా కొట్టాయి. ఒక్కటంటే.. ఒక్క సంస్థ కూడా సరిగ్గా ఫలితాలను అంచనా వేయలేకపోయింది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వేవ్ ను...

కాంగ్రెస్ పనైపోయింది..! ఉత్తమ్ పదవి వదిలేశారు..!

పీసీసీ చీఫ్ పోస్టుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తాను ఎప్పుడో రాజీనామా చేశానని.. దాన్ని ఆమోదించి.. కొత్తగా పీసీసీ చీఫ్ ను నియమించాలని ఆయన కొత్తగా ఏఐసిసికి లేఖ రాశారు....

గ్రేటర్ టర్న్ : టీఆర్ఎస్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్..!

గ్రేటర్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన ఫలితాలు సాధించింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కాస్త ముందు ఉన్నట్లుగా కనిపిస్తోంది కానీ.. భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్‌పై సర్జికల్‌ స్ట్రైక్...

HOT NEWS

[X] Close
[X] Close