తెలుగు360 ఎడిటర్స్ కామెంట్ : జగన్ తిక్కకు లెక్కుంది..!

దేశం పరువు పోయిందని ఓ కేంద్ర మంత్రి బాధపడతారు..! విదేశీ పెట్టుబడులపై జగన్ నిర్ణయాల ప్రభావం పడుతోందని జాతీయ మీడియా విశ్లేషిస్తుంది..! జగన్‌ను రివర్స్‌ సింగర్ అని.. డిస్‌రుప్టర్ అని.. కథనాలు వస్తూంటాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర  స్థాయిలోనే కాదు.. జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. ఎవరెన్ని చెప్పినా.. ఆయన తన ఆలోచన ప్రకారమే ముందుకెళ్తున్నారు. ఆయన ఇంకా నలభైల్లోనే ఉన్నారు. ఆయన ఆలోచనలు ఆయనకు ఉంటాయి. ఆ ప్రకారం.. తిరుగులేని తీర్పు ఇచ్చిన ప్రజల్ని మెప్పించడానికి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే.. ఆ నిర్ణయాలు ఎక్కువగా.. చాలా రాంగ్‌ వేలో వెళ్తున్నాయి. జాతీయ మీడియా మొత్తం తీవ్రంగా విమర్శిస్తోంది. అయినా ఆయన వెనక్కి తగ్గడం లేదు. అందరూ అనుకుంటున్నట్లుగా ఆయన మొండితనంతో ఈ విషయంలో ముందుకెళ్లడం లేదు. ఆయనకు పక్కా లెక్కలున్నాయి. అందరూ తిక్క అని చెబుతున్నప్పటికీ.. ఆ తిక్కలోనే స్పష్టమైన లెక్కలున్నాయని అర్థం చేసుకోవాలి.

నిర్ణయాలన్నింటికీ జీరో రేటింగ్స్..! కానీ నో స్టాపింగ్ జగన్..!
   
జగన్ గురించి ఓ ప్రఖ్యాత బిజినెస్ డైలీలు, ఇంగ్లిష్ పత్రికల్లో…  రివర్స్ స్వింగ్, అన్ ప్రిడిక్టబుల్ సీఎ, ది డిస్‌రుప్టర్ అంటూ… విశ్లేషణాత్మక కథనాలు వచ్చాయి. కొన్ని ఇంగ్లిష్  పత్రికలు, ప్రముఖ జర్నలిస్టులు తుగ్లక్ మళ్లీ పుట్టాడనే ఘాటు విమర్శలతో కథనాలు రాశారు. దీనికి కారణం…అలాంటి “వెనుకబాటు” నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నారు. అమరావతి ప్రాజెక్ట్‌ను నిర్వీర్యం చేయడం.. మూడు రాజధానులను ఏర్పాటు చేయడం .. వంటివి దేశం మొత్తం.. ఆయనకు నెగెటివ్ ఇమేజ్ తెచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమం పేరుతో.. ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేసే పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి…లబ్దిదారుల విషయంలో మాత్రం… విమర్శలు ఎదుర్కొంటున్నారు.  ప్రభుత్వ నిరాదరణకు గురైన వారు శాపనార్ధాలు పెడుతున్నా.. ప్రభుత్వం లెక్క చేయడం లేదు. ఇక చార్జీల పెంపు విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. గతంలో చార్జీలు పెంచేది లేదని చెప్పిన నోటితోనే… అవకాశం ఉన్న  ప్రతీ చోటా ప్రజల్ని బాదేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తీసుకుంటున్న ప్రతి నిర్ణయంపైనా విమర్శలు వస్తున్నాయి. అవి సహజంగా విమర్శించే.. విపక్షాల నుంచి మాత్రమే కాదు… ఆ ఎఫెక్ట్ పడే ప్రతి వర్గం నుంచి వస్తున్నాయి.  

లెక్కల ప్రకారమే లబ్దిదారులకు పథకాలు..!

తనపై వస్తున్న కామెంట్లు.. తన పాలనపై వస్తున్న విశ్లేషణలను జగన్మోహన్ రెడ్డి లెక్క చేయడం లేదు. అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. అవేమీ తన మీద ప్రభావం చూపించబోవని గట్టిగా నమ్ముతున్నారు. దీనికి ఆయన లెక్కలు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. దీన్ని విశ్లేషణ చేయాలంటే.. ఎనిమిది నెలల ముందుకెళ్లాలి. అధికారం చేపట్టగానే  ప్రతి యాభై కుటుంబాలకు ప్రజాధనం ఇచ్చి మరీ ఓ వాలంటీర్‌ను పెట్టారు. వారే పథకాల లబ్దిదారులెవరో తేల్చారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు అందలేదంటే.. వారిచ్చిన సమాచారమే కీలకం. వారు తమ వారు కాదని వాలంటీర్లు రాసుకున్నవారందరికీ పథకాలు ఎగిరిపోయాయన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో.. ముఖ్యమంత్రి.. ప్రభుత్వ పథకాల అమలుపై … లబ్దిదారుల ఎంపికపై జరిగే సమావేశాల్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూంటారు. అందులో.. ఒకటి… లబ్దిదారుల ఎంపికకు.. ప్రజాసాధికార సర్వే ప్రామాణికం తీసుకోవద్దని…చెబుతూంటారు. నిజానికి ప్రజాసాధికార సర్వేనే దేనికైనా ప్రామాణికం. కుటుంబాల పూర్తి సమాచారం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి ఆ వివరాలను తీసుకోవద్దని… వాలంటీర్ల సర్వేనే ప్రామాణికంగా తీసుకోమని చెబుతూంటారు. అక్కడే అసలు విషయం బయటపడుతోంది.

అభివృద్ధి అంటే పెట్టుబడులు.. పరిశ్రమలు కాదనే నమ్మకం..!

ఇప్పుడు కొత్త తరం రాజకీయ ఆలోచనలు జగన్ చేస్తున్నారు. ఓటర్లు రాష్ట్రానికేమీ వచ్చిందని చూడటం లేదు. తమకేమీ వచ్చిందనే చూస్తున్నారు. రాష్ట్రానికి బోలెడన్ని పరిశ్రమలు తీసుకొచ్చి… గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన ఓట్లు రాలవు. ఈ అంశాన్ని జగన్ పక్కాగానే గుర్తించారు. అందుకే… పెట్టుబడులు.. పరిశ్రమల గురించి ఆయన ఏ మాత్రం ఫికర్ చేయడం లేదు. ప్రజలకు ఏమిచ్చాను అన్నదే ఆలోచిస్తున్నారు. అదీ కూడా.. నగదు రూపంలో ఎంత ఇచ్చాను అన్నదే పట్టించుకుంటున్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా అందే సొమ్ముతో.. వారితో ఉత్సాహం ఉంటుంది. జగనన్న ఇచ్చాడన్న కృతజ్ఞత ఉంటుంది. ఈ లెక్కలన్నీ జగన్ పక్కాగా వేసుకున్నారు కాబట్టే… అభివృద్ధికి కొత్త అర్థం చెబుతున్నారు. ప్రజలకు ఎంత ఎక్కువ డబ్బులు పంచడమే.. అభివృద్ధి అని కొత్త తరానికి నేర్పుతున్నారు.

ఏవరేమైనా అనుకోనీ… తన బేస్‌ను దుర్బేధ్యం చేసుకునే లెక్క..!

భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మెజార్టీ మీద నడుస్తుంది. వందలో 30 శాతం ఓట్లు వచ్చిన వారు విజేతగా నిలుస్తారు. మిగతా డెభ్బై శాతం.. నాలుగైదు పార్టీల మధ్య  చీలిపోతే.. 30 శాతం సాధించిన పార్టీనే పాలకపార్టీ. 70శాతం వ్యతిరేకించారన్న మాట.. రాజ్యాంగం ప్రకారం చెల్లదు. దీని ప్రకారం..  ఓ నలభై శాతం ఓట్లను..   తాయిలాలో.. మరొకటో ఇచ్చి.. ఓటు బ్యాంక్‌గా మార్చుకుంటే…తిరుగుండదని జగన్ భావిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మిగతా అరవై శాతం మందికి ఏమీ ఇవ్వకపోయినా… వారు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకపోయినా… రాజకీయంగా సక్సెస్ అవుతారు. జగన్ తిక్క వెనుక ఉన్న లెక్క ఇదే. ఇది కొత్త తరం రాజకీయ నాయకుడి లెక్క అనుకోవాలేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close