వనజాక్షికి చంద్రబాబు ఫోన్

హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లాలో రేగిన ఇసుక వివాదంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యంచేసుకోవలసివచ్చింది. ఇసుక అక్రమరవాణాను అడ్డుకోటానికి వెళ్ళిన ముసునూరు తాసీల్దారు వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వర్గీయులు దాడి చేయటంతో రెవెన్యూ ఉద్యోగులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. జపాన్ పర్యటననుంచి ఢిల్లీ చేరుకున్న సీఎమ్,  వనజాక్షికి గురువారంరాత్రి ఫోన్ చేసి అనునయించారు. న్యాయం చేకూర్చుతానని వనజాక్షికి హామీ ఇచ్చారు. వివాదాన్ని పరిష్కరించాలని ఆయన కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమా, వనజాక్షికి బంధువైన వల్లభనేని వంశీలను పురమాయించారు. వారు విజయవాడలో రెవెన్యూ, ఏపీఎన్‌జీవో సంఘాల నాయకులతో మాట్లాడారు. అయితే, తనపై దాడికి ఉసిగొల్పిన ఎమ్మెల్యే చింతమనేనిని అరెస్ట్ చేయాల్సిందేనని వనజాక్షి పట్టుబడుతున్నారు. క్షమాపణ చెప్పిస్తే సరిపోదని అంటున్నారు. మరోవైపు చింతమనేనిని అరెస్ట్ చేసేవరకు తమ పోరాటం ఆగదని, సమ్మె విరమించబోమని రెవెన్యూ ఉద్యోగసంఘాల నాయకులు ప్రకటించారు. సోమవారం ముఖ్యమంత్రి సమక్షంలో చర్చలు జరపటానికి అంగీకరించారు. ఇటు చింతమనేని తన తప్పేమీలేదని చెప్పుకొచ్చారు. రెవెన్యూ ఉద్యోగులకు, డ్వాక్రా మహిళలకు మధ్య గొడవ జరుగుతుంటే తాను ఆపబోయానని, కిందపడిన వనజాక్షిని తాను లేవదీశానని చెప్పారు. వనజాక్షి కంటతడి పెట్టటం తనను కలచివేసిందని అన్నారు. తనది బకరా బతుకైపోయిందని చెప్పారు. చింతమనేనిది మొదటినుంచి వివాదాస్పద వ్యవహారశైలే. గతంలో కాంగ్రెస్ హయాంలో దెందులూరులో జరిగిన ఓ కార్యక్రమంలో నాటి మంత్రి వట్టి వసంతకుమార్‌తోనే కలబడటంతో పోలీసులు నాడు అరెస్ట్ చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close