కేశినేని శివనాథ్, కొలికపూడి శ్రీనివాసరావు మధ్య ఏర్పడిన వివాదంపై చంద్రబాబు తీర్పు చెప్పనున్నారు. క్రమశిక్షణా కమిటీ ఇద్దరు నేతల్ని పిలిచి మాట్లాడింది. వారి వాదనలు విన్నారు. అలాగే వారిపై పార్టీ పరంగా ఓ నివేదిక కూడా రెడీ చేశారు. వాటిని చంద్రబాబుకు అప్పగించారు. ఇప్పుడు చంద్రబాబు ఆ నివేదికల్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
కొలికపూడి శ్రీనివాసరావు గెలిచిన ఒకటి, రెండు నెలల్లోనే దారి తప్పారని టీడీపీ హైకమాండ్ గుర్తించింది. ఆయనపై వివాదాలు ఇదే మొదటి సారి కాదు. టీడీపీ క్యాడర్ ను ఆయన ఓన్ చేసుకోలేక అనేక వివాదాలు తెస్తున్నారని .. పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని నివేదికలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే శివనాథ్ తన నియోజకవర్గానికి వేరే లీడర్ని తెచ్చి పెడుతున్నారని.. వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ లేదని చెబుతున్నారని కొలికపూడి చెప్పినట్లుగా తెలుస్తోంది. శివనాథ్ పై చేసిన ఆరోపణలకు కొలికపూడి ఎలాంటి ఆధారాలు ఇవ్వలేకపోయారని తెలుస్తోంది.
కేశినేని శివనాథ్..తాను కొలికపూడితో ఎలాంటి వివాదాలు పెట్టుకోలేదని పార్టీ కోసమే నిర్ణయాలు తీసుకున్నట్లుగా చెప్పినట్లుగా తెలుస్తోంది. తాను బహిరంగంగా కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పినట్లుగా తెలుస్తోంది.ఈ విషయంపై చంద్రబాబునాయుడు తుది నిర్ణయం తీసుకోనున్నారు. తీసుకుంటే అది కొలికపూడిపైనే చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. అది ఎప్పుడన్నది మాత్రం సస్పెన్స్.